Pallichattambi Movie Review: పల్లి చట్టంబి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: టోవినో థామస్, కాయదు లోహర్, పృథ్వీరాజ్ సుకుమారన్, శత్రు తదితరులు
దర్శకత్వం: డిజో జోస్ ఆంటోని
నిర్మాతలు: నౌఫాల్, బ్రిజీష్, CCC (చాణక్య, చైతన్య, చరణ్) Brothers
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫి: టిజో టామీ
ఎడిటర్: శ్రీజిత్ సారంగ్
బ్యానర్: వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2026-04-17
కేరళలోని కానియార్ అనే ప్రాంతంలో పోతన్ క్రిస్టోఫర్ అలియాస్ కృష్ణ పిళ్లై (టోవినో థామస్) పేరు మోసిన రౌడీ. 1950 ప్రాంతంలో కమ్యూనిస్టులు, క్రిస్టియన్ మతస్తులకు జరిగే ఆధిపత్య పోరాటం, భూపోరాటం నేపథ్యంలో చర్చిలను కాపాడుకోవడానికి రౌడీలను నియమించుకొంటారు. ఆ కారణంతోనే క్రిస్టోఫర్‌ను ఓ చర్చికి రౌడీగా నియమించుకొంటారు. క్రిస్టియన్లను వ్యతిరేకించే కమ్యూనిస్ట్ ఉద్యమకారిణి రెబెకా (కాయదు లోహర్)తో క్రిస్టోఫర్ ప్రేమలో పడుతాడు. ఆ ప్రాంతాన్ని తన కనుసైగలతో శాసించే నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఆదేశాల మేరకు రెబెకాపై రైల్ రామన్న (శత్రు) అనే పోలీస్ ఆఫీసర్ ఎటాక్ చేస్తాడు. దాంతో నంబియార్‌పై క్రిస్టోఫర్ తిరుగుబాటు చేస్తాడు.

రౌడీగా చెలామణి అయ్యే కృష్ణ పిళ్లైకు క్రిస్టోఫర్‌గా ఎందుకు నామకరణం చేశారు. క్రిస్టోఫర్ అంటే అర్ధం ఏమిటి? పల్లి చట్టంబి అంటే అసలు అర్ధం ఏమిటి? రెబెకా, క్రిస్టోఫర్‌ల మధ్య ప్రేమ ఎలా పుట్టింది? రెబెకా ప్రభావంతో కృష్ణ పిళ్లైగా ఎందుకు మారాడు? కానియార్ ప్రాంతాన్ని నంబియార్ ఎందుకు గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకొన్నాడు? కానియార్ ప్రాంతంలో అపోహలు సృష్టించి గ్రామస్థులను ఎలా భయభ్రాంతులకు గురి చేశాడు. నంబియార్‌పై కృష్ణ పిళ్లై వార్ ఎలా కొనసాగించాడు అనే ప్రశ్నలకు సమాధానమే పల్లి చట్టంబి సినిమా కథ.
పల్లి చట్టంబి సినిమా కథ విషయానికి వస్తే.. 1950 ప్రాంతంలో కమ్యూనిస్టులకు, బ్రిటీష్ పాలకులకు మధ్య జరిగే భూపోరాటం నేపథ్యంగా దర్శకుడు డీజో ఆంటోని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే కృష్ణ పిళ్లైని క్రిస్టోఫర్‌గా మార్చే సంఘటన లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో కథను ముందుకు తీసుకెళ్లారు. కానీ కథలో వైవిధ్యం లేకపోవడం, ముఖ్యంగా సన్నివేశాల్లో డెప్త్ కనిపించకపోవడం వల్ల ఫస్టాఫ్ సాదాసీదాగా సాగిపోతుంది. బలమైన కథ, కథనాలు లేని లోటును కాయదు లోహర్ తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో పూడ్చే ప్రయత్నం చేసింది.
ఇక సెకండాఫ్‌లో కొన్ని ఎమోషనల్ పాయింట్స్‌ను తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథను దర్శకుడు పరుగులు పెట్టించాడు. టోవినో థామస్ కూడా డిఫరెంట్ రోల్‌లో ఒదిగిపోయి భీకరపోరాటలతో ఆకట్టుకొన్నాడు. నంబియార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీతో కథలో చలనం, వేగం పెరుగుతుంది. టొవినో, పృథ్వీరాజ్ మధ్య సీన్లు హై లెవెల్‌లో ఉండటంతో ఫస్టాఫ్‌లో ఉన్న అసంతృప్తి తగ్గిపోయేలా చేస్తుంది. దాంతో సెకండ్ పార్ట్ లీడ్ ఇవ్వడం వల్ల ఆడియెన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారనిపిస్తుంది.
టోవినో థామస్, కాయదు లోహర్ ఈ సినిమాకు ప్రధానంగా స్పెషల్ ఎట్రాక్షన్. పెర్ఫార్మెన్స్‌కు పూర్తిస్థాయి స్కోప్ ఉన్న పాత్రల్లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. కాయదు లోహర్ పాత్ర నిడివి కొంత ఉండటం ఆడియెన్స్‌కు అసంతృప్తిని కలిగించేలా చేస్తుంది. కానీ ఉన్నంత సేపు తన ప్రజెన్స్‌ను, క్యారెక్టర్ ఆరాను కంటిన్యూ చేసింది. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర అతిథి పాత్ర అయినప్పటికీ.. డాషింగ్ మోడ్‌లో సాగుతుంది.
ఈ చిత్రానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్స్. యాక్షన్, ఎమోషనల్ ఓరియెంటేషన్‌తో సాగే ఈ సినిమాలోని సన్నివేశాలను జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది. గ్రామీణ, కొండ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశాలు బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. కాకపోతే కథ, కథనాలపై ఇంకాస్త బెటర్‌గా వర్క్ చేయాల్సిందనిపిస్తుంది. సెకండ్ పార్ట్ కోసం కథను సిద్దం చేయడం వల్ల ఫస్ట్ పార్ట్‌లో కొంత బలం తగ్గిందా? అనే ఫీలింగ్ కలుగుతుంది. టోవిన్ థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, కాయదు లోహర్ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్ లాంటింది. డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలనుకొనే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications