Pallichattambi Movie Twitter Review: పల్లిచట్టంబి మూవీ ట్విట్టర్ రివ్యూ

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ పల్లిచట్టంబి. ఈ చిత్రానికి డిజో ఆంటోనీ దర్శకత్వం వహించారు. వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నౌఫాల్, బ్రిటజీష్, చాణక్య, చైతన్య, చరణ్‌లు సంయుక్తంగా పల్లిచట్టంబి సినిమాను నిర్మించారు. విజయ రాఘవన్న, సిద్ధిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు ఈ సినిమాలో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు.

టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 15న పల్లిచట్టంబి రిలీజ్ అయ్యింది. సాంకేతిక కారణాలతో పల్లిచట్టంబి తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. ఏప్రిల్ 17న ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పల్లిచట్టంబి చిత్రంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

Pallichattambi Movie Twitter Review in Telugu  Is Tovino Thomas Movie hits the bulls eye

పల్లిచట్టంబి మూవీ ఫస్టాఫ్ యావరేజ్‌గా.. సెకండాఫ్ పర్వాలేదనిపించేలా ఉంది. స్క్రిప్ట్ వీక్‌గా ఉంది, కథనం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. టొవినో యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశాడు. ఈ సినిమా మొత్తంలో ఏదైనా హై మూవ్‌మెంట్ ఉందంటే అది పృథ్వీరాజ్ సుకుమారన్ క్యామియో మాత్రమే. ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచింది. పాస్ మార్కులు వేయించుకున్న ఈ సినిమాకు నా రేటింగ్ 2/5 అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

1950లలో కేరళలోని భూ సంస్కరణ ఉద్యమాల ఇతివృత్తంతో రూపొందించిన యాక్షన్ పీరియాడికల్ డ్రామా ఈ పల్లిచట్టంబి. ఈ కథాంశంలో అపారమైన సామర్ధ్యం ఉన్నప్పటికీ.. బలహీనమైన రచన, ఎగ్జిక్యూషన్‌లో లోపాల కారణంగా పల్లిచట్టంబి మూవీ చివరికి ఒక సాధారణ చిత్రంగానే మిగిలిపోయింది. పలు సన్నివేశాలు విఫలమైన కలయికలా అనిపిస్తాయని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

పల్లిచట్టంబి గొప్ప సినిమా మేకింగ్‌తో తీసిన ఓ యావరేజ్ సినిమా. ఒకవేళ దర్శకుడు రోటీన్ కేజీఎఫ్ మార్గాన్ని అనుసరించకపోయి ఉంటే.. ఈ సినిమా గొప్ప ఎంటర్‌టైనర్‌గా నిలిచేందుకు అన్ని విధాలుగా స్కోప్ ఉండేదని నా అభిప్రాయం. స్టోరీలో ఒక్క క్షణం కూడా విసుగు అనిపించలేదు.. సినిమా చాలా వేగంగా సాగుతుంది కూడా. కాకపోతే నాకు మాత్రం కథనం అంతగా నచ్చలేదు అని ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చాడు.

ఇది డిజో జోస్ మూవీ, ఖచ్చితంగా ఈ సినిమా మనసును హత్తుకునేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో వచ్చే అతిథి పాత్ర సర్‌ప్రైజింగ్ ఉంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం కాస్త హడావిడిగా సాగినట్లుగా అనిపిస్తుంది. సంగీతం అద్భుతంగా ఉంది. కృష్ణ పిళ్లై.. పట్టేలర్ కుంజాంబు నంబీయార్‌ల మధ్య జరిగే ముఖాముఖి పోరు కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

ఇది ఎబో యావరేజ్ పీరియాడికల్ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ అద్భుతంగా సాగింది, కానీ సెకండాఫ్‌లో కథను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మంచి అవకాశం ఉంది. టోవినో థామస్ పాత్రలో ఉన్న వైవిధ్యం, అతని నటనకు తోడ్పడటంతో పాటు అద్భుతమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సెకండాఫ్‌లో కథ ఊహించని మలుపు తిప్పడం, ఒక మంత్రి ప్రస్తావన. విలన్ రోల్ వంటివి మెప్పించాయి. కానీ సెకండాఫ్ అంతగా ఆకట్టుకోకపోవడంతో పల్లిచట్టంబి ఓ ఎబో యావరేజ్‌గా నిలిచింది.

రొమాన్స్ ట్రాక్ కొద్దిసేపే కొనసాగినా.. కొంతవరకు పర్లేదనిపించింది. గత దశాబ్ధా కాలంలో వచ్చిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఆధారిత సినిమాల మాదిరిగా ఇది లేదు. ఫస్టాఫ్‌లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. కానీ సెకండాఫ్‌లో క్రైస్తవ మతంపై కొన్ని నాటకీయ సంభాషణలు చిరాకు పెట్టాయి. జేక్స్ సంగీతం, డీవోపీ, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టోవినో థామస్ కోసం ఒకసారి ఈ సినిమా చూడొచ్చు అంటూ ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X