Pallichattambi First Review: పల్లిచట్టంబి మలయాళ మూవీ ఫస్ట్ రివ్యూ
మలయాళంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం పల్లిచట్టంబి. యువ హీరో టొవినో థామస్, బ్యూటీ క్వీన్ కాయదు లోహర్ జంటగా నటించిన ఈ చిత్రానికి డిజో ఆంటోని దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు నౌఫాల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ రాఘవన్, సిద్దిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గెస్ట్ అప్పియరెన్స్‌తో సందడి చేయనున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్ ఎఢిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఏప్రిల్ 15వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..

పల్లిచట్టంబి సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలో 1950 దశకంలో ఇడుక్కి ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇడుక్కి ప్రాంతంలో జరిగిన భూపోరాటం, భూస్వాములకు, పేద ప్రజలకు జరిగిన వర్గ పోరాటం నేపథ్యంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఈ క్రమంలో భూ చట్టం కోసం జరిగిన పోరాటంలో క్రిస్టోఫర్ (టొవినో థామస్) పాత్ర ఏమిటి? రెబెక్కా (కాయదు లోహర్)కు క్రిస్టోఫర్‌కు మధ్య ప్రేమ వ్యవహారం ఏమిటి? అనేది ఈ సినిమా కథ.
భూమి కోసం పోరాటం, ప్రేమ, యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమాను ఇటీవల సెన్సార్ అధికారులు వీక్షించారు. ఈ సినిమాలోని కథ, కథనాలపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. పాత్రలను మలిచిన విధానాన్ని, ఓ సీరియస్ విషయాన్ని కథగా మలిచి, పాత్రలను జొప్పించిన విధానం బాగుందని ప్రశంసించారు. కానీ కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సెన్సార్ అధికారుల సూచనల మేరకు చిత్ర యూనిట్ మార్పులు చేర్పులు చేయడంతో ఈ సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పల్లిచట్టంబి సినిమాకు క్లియరెన్స్ ఇస్తూ ఈ మూవీకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ మూవీకి సెన్సార్ అధికారులు యూఏ (UA16+) సర్టిఫికెట్ అందించారు. ఈ సర్టిఫికెట్ అనుసరించి ఈ చిత్రాన్ని 16 ఏళ్లకు పైబడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడవచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో జారీ చేశారు.
ఇక ఈ సినిమాలోని కథ, సన్నివేశాలను చాలా క్రిస్పీగా చూపించే ప్రయత్నం చేశారు. కథను కథగా చెప్పడమే లక్ష్యంగా సాగదీత లేకుండా తక్కువ నిడివితో సినిమాను ముగించే ప్రయత్నం చేశారనే విషయం రన్‌టైమ్‌తో స్పష్టమైంది. ఈ సినిమాకు నిడివి 2 గంటల 11 నిమిషాలు అంటే సుమారుగా 131 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి...


Click it and Unblock the Notifications











