»   » ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ(పాండవులు పాండవులు రివ్యూ)

ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ(పాండవులు పాండవులు రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హైదరాబాద్: మంచు ప్యామిలీ స్టార్లంతా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. మోహన్ బాబు చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో నటించడంతో పాటు విష్ణు, మనోజ్, రవీనా టండన్, హన్సిక, వరుణ్ సందేశ్, తనీష్‌లతో భారీగా తెరకెక్కించడంతో సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి.

స్టోరీలైన్ వివరాల్లోకి వెళితే..నాయుడు(మోహన్ బాబు) బ్యాంకాక్‌లో టూరిస్ట్ గైడ్. అతనకి ముగ్గురు దత్తపుత్రులు అజయ్(మనోజ్), వరుణ్ సందేశ్, లక్కీ(తనీష్). అదే సిటీలో ఉండే రవీనాకు ఇద్దరు దత్తపుత్రులు విజ్జు(విష్ణు), వెన్నెల కిషోర్. మోహన్ బాబు, రవీనా టండన్ కొడుకుల మధ్య ఓ విషయంలో గొడవ జరుగుతుంది. తన కొడుకులతో గొడవ పడ్డవారి సంగతి తేల్చేందుకు రవీనా ఇంటికి వెళతాడు మోహన్ బాబు. కట్ చేస్తే....మోహన్ బాబు, రవీనా గతంలో విడిపోయిన ప్రేమికులు. చాలా కాలం తర్వాత కలిసిన వీరు గతాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లికి ఇరువురు తమ కుమారులను కూడా ఒప్పిస్తారు.

ఇలా సంతోషంగా సాగిపోతున్న వీరి ఫ్యామిలీ స్టోరీలో విజ్జు ప్రేమిస్తున్న హనీ(హన్సిక) కిడ్నాప్‌కు గురవుతుంది. హనీని ఎవరు కిడ్నాప్ చేసారు. ఆమె గతం ఏమిటి? విజ్జు తన ఫ్యామిలీతో కలిసి ఆమెను ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ. స్లైడ్ షోలో సినిమా పూర్తి రివ్యూ...

నటీనటుల పెర్ఫార్మెన్స్

నటీనటుల పెర్ఫార్మెన్స్


టూరిస్ట్ గైడ్ నాయుడు పాత్రలో మోహన్ బాబు పర్‌ఫెక్టుగా నటించి తన నటచాతుర్యం ఏరేంజిలో ఉంటుందో మరోసారి నిరూపించాడు. విష్ణు తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

హన్సిక, ప్రణీత గ్లామర్

హన్సిక, ప్రణీత గ్లామర్


రవీనా టండన్ తన పాత్రకు న్యాయం చేసింది. హన్సిక గ్లామర్ తో పాటు పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రణీత పాత్ర ఫర్వాలేదు. సినిమాకు హన్సిక, ప్రణీత ఒకరకంగా ప్లస్సే.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


సాంకేతిక విభాగాల్లోకి వెళితే...దర్శకుడు తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్‌ను నటీనటుల నుండి చక్కగా రాబట్టుకున్నాడు. సినిమా స్క్రీన్ ప్లే చక్కగా ఉంది. అయితే మధ్యలో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్పప్పటికీ సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేక పోయాయి. బాబా సెహగల్, ఆచు, కీరవాణి అందించిన సంగీతం సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక విభాగాలు ఫర్వాలేదు.

మనోజ్ మోహిని పాత్ర

మనోజ్ మోహిని పాత్ర


ఇక మనోజ్ పాత్ర విషయానికొస్తే మోహిని అనే ఆడ వేషంలో మనోజ్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమాకు ఉన్న హైలెట్లలో మనోజ్ పోషించిన మోహిని పాత్రను ఒకటిగా చెప్పొచ్చు.

బ్రహ్మానందం కామెడీ

బ్రహ్మానందం కామెడీ


వరుణ్ సందేశ్, తనీస్ పాత్రలు ఉన్నారు అంటే ఉన్నారు అన్నట్లుగా ఉన్నాయి. వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. ఇక సినిమాకు కామెడీ పరంగా బ్రహ్మానందం పాత్ర మరో హైలెట్. బ్రహ్మీ పాత్ర అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా నవ్వించింది.

మైనస్ పాయింట్

మైనస్ పాయింట్


ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనే విధంగా సినిమా మొత్తం వినోదాత్మకంగా సాగుతూ వెళ్లింది. అయితే స్టోరీలైన విషయానికొస్తే కొత్తదనం లేదు. తొలి భాగం హిందీ గోల్ మాల్ 3 మాదిరి, రెండో భాగం అప్పట్లో తెలుగులో వచ్చిన చంద్రవంశం చిత్రాన్ని పోలి ఉంటుంది. ఇదొక్క విషయమే సినిమాకు పెద్ద మైనస్. అయితే ఎంటర్టెన్మెంట్ జోడించిన స్క్రిప్టు వర్కు.....ఆ మైనస్ పాయింటును కప్పిఉంచేలా చేసింది.

ఫైనల్‌గా చెప్పేదేమంటే..

ఫైనల్‌గా చెప్పేదేమంటే..


ఓవరాల్‌గా సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇతర వివరాలు...

ఇతర వివరాలు...


పతాకం: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు:మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ,రవీనా టండన్, హన్సిక, ప్రణీత తదితరులు
సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్
కెమెరా : ఫలణికుమార్
పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్
మాటలు: డైమండ్ రత్నం
కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్
పోరాటాలు: విజయ్
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
కళ: రఘు కులకర్ణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్
సమర్పణ: అవియానా-వివియానా
నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్
దర్శకత్వం: శ్రీవాస్

English summary
Pandavulu Pandavulu Tummeda is decent family entertainer with all masala elements. Lead actors' performances are the main highlight in the film. Srivas' engaging narration, Baba Sehgal, Achu and Bappi Lahari's music and background score, Palani Kumar's beautiful picturisation, comedy scenes and witty dialogues are other attractions of the movie. The predictable story is one big drawback of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu