twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాండురంగడు రివ్యూ: కామి కాని వాడు.....

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    నటీనటులు: బాలకృష్ణ,స్నేహ,టబు,కె.విశ్వనాధ్,శివ పార్వతి,బాలయ్య,
    జెన్నీ,మోహన్ బాబు,వై.విజయ,గుండు హనుమంతరావు,బ్రహ్మానందం,
    సుబ్బరాయశర్మ,ఎల్.బి.శ్రీరామ్,భారవి,సుహాసిని,వేద,అపూర్వ,
    ఆలీ,సునీల్,ధర్మవరపు తదితరులు
    ఆర్ట్ :భాస్కర్ రాజు
    సినిమాటోగ్రఫి :వి.జయరాం
    ఎడిటింగ్ :శ్రీకర్ ప్రసాద్
    ఎడిటింగ్ :వర్మ
    సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
    నిర్మాత :కె. కృష్ణమోహన్
    కథ,,మాటలు: జె.కె.భారవి
    స్ర్కీన్ ప్లే,దర్శకత్వం :కె.రాఘవేంద్రరావు
    రిలీజ్ డేట్ :30-05-2008

    కె.రాఘవేంద్రరావు వరస పౌరాణిక చిత్రాలలో మూడో చిత్రం ఈ పాండురంగడు .ఈ చిత్రం గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన సూపర్ హిట్ సినిమా 'పాండురంగ మహత్యం' ఆధారంగా రూపొందించారు. కాని ఆ చిత్రంలో బాగా ప్లస్ అయిన పాటలు మ్యాజిక్ ఇందులో మిస్సై మైనస్ గా విషాదం. ఇక ఈ సినిమాలో కథనాన్ని ఈ నాటి తరానికి తగినట్లుగా మార్చి కొత్త సన్నివేశాలు రూపకల్పన చేసారు. కాని సీన్ లాగ్ లు ఎక్కువవయి స్పీడుని తగ్గించాయి. అయినా బాలకృష్ణ తనదైన శైలిలో నటిస్తూ పెద్ద ఎన్టీఆర్ ని గుర్తు చేస్తూ.... సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసి ఒడ్డున పడేసారు.

    'మాతాపితురల సేవే మాథవ సేవ' అనే సత్యాన్ని చాటే ఈ కథ మహారాష్ట్రలోని పండరీపురం నేపథ్యంలో సాగుతుంది. పుండరీకుడు (బాలకృష్ణ) స్త్రీ లోలుడు, వ్యసనపరుడు, కన్నవారిని (కె.విశ్వనాధ్,శివ పార్వతి), కట్టుకున్న భార్య లక్ష్మిని(స్నేహ) పట్టించుకోకుండా అమృతం (టబు)అనే వేశ్య చుట్టూ తిరుగుతూంటాడు. కాని ఆమె మాత్రం తన బుద్ది పోనిచ్చుకోక అతను ఎప్పటికైనా చేజారతాడని మాయ చేసి ఆస్తి రాయించుకుని విష ప్రయోగం చేస్తుంది. ప్రాణాపాయమైన ఆ స్ధితి నుండి అతను ఎలా తప్పించుకుని దైవ భక్తుడుగా మారి భగవంతుడుని చేరుకుని చరిత్రలో చోటు సంపాదించుకున్నాడనేది మిగాతా కథ.

    భక్తుడుగా,భగవంతుడుగా బాలకృష్ణ ద్వి పాత్రలలో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఒరిజినల్‌లో నాగయ్య చేసిన పుండరీకుడు తండ్రి పాత్రను కె విశ్వనాథ్ చేశారు. అవి బాగానే ఉన్నాయి గాని పుండరీకుడు భార్య గా వేసిన స్నేహ పాత్రని సరిగా తీర్చి దిద్దలేదు. కృష్ణ భక్తురాలైన ఆమె రొటీన్ తెలుగు సినిమా హీరోయిన్ లా హీరో చుట్టూ పెళ్ళి...పెళ్ళి అంటూ తిరగటం విపరీతంగా కనిపిస్తుంది. అలాగే వేశ్యగా వేసిన టబు పాత్రకు ముగింపు లేదు...ఆమెకు పుండరీకుడు పై విష ప్రయోగం చెయ్యాలనే బుద్ది ఎందుకు పుట్టిందో సరిగ్గా ఎస్టాభ్లిష్ చేయలేదు. ఇక కథ పండరీ పురంలో జరిగినట్లుగా గానీ,ఆ కాలం ,వాతావరణం గాని తెలిసేలా చేయకపోవటం చేయతిరగిన దర్శకుడు రాఘవేంద్రరావు చెయ్యవలసింది కాదు. కామిడీ కోసం బ్రహ్మానందం చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను గుర్తు చేసేలా బిహేవ్ చేస్తూ...చీప్ గా చేసినా పండలేదు. సునీల్ పాత్ర రెగ్యులర్ రాఘవేంద్రరావు మోటు కామిడీ ముద్రే. 'తన్నులాట కాదు తరుణీ ..ఇది తనువుల ఆట', 'ఆంక్షలు పెట్టే చోట కాంక్షలుండవు' వంటి అడల్ట్ డైలాగులు ఫ్యామిలీలు కలసి వెళ్ధామనుకునే చిత్రాలుకు ఇబ్బంది పెడతాయి. స్క్రీన్ ప్లే కృష్ణుడు కథ నడుపుతున్నట్లుగా గాక చివరలో కృష్ణడు కనిపించేలా రాసుకుంటే...తన భక్తురాలైన హీరోయిన్ ని టబు పాత్ర పెట్టే ఇబ్బంది నుండి తొలిగించటానికి తన మాయతో దేముడే ఆమె మనసు మార్చవచ్చు కదా అన్నడౌటు రాదు. ఇవన్నీ ప్రక్కన పెడితే సినిమాలో బాలకృష్ణ స్త్రీ రూపంలో కనపడే సీన్ విజిల్స్ వేయించే రేంజ్ లో ఉంది. ఇక బృందావనం, భగవంతుడు విశ్వరూపం గ్రాఫిక్ లో చేసిన విజువలైజేషన్ చాలా బాగుంది. మెదటి పాటలో శృంగారం పాలు ఎక్కువైనా రసికులను బాగా అలరిస్తుంది. క్లైమాక్స్ సినిమాకు ప్రాణమై నిలిచింది.

    యేదైమైనా పురాణాలపై విమర్శ కాదు కాని...సినిమా చూస్తుంటే 'కామి కాని వాడు మోక్షకామి కాడు' అన్నది రుజువు చేస్తున్నట్లు ఉంటుంది. అది శృంగారం పాలు ఎక్కువ అవటం వల్ల వచ్చిన ఫీలింగ్ కావచ్చు. అయినా ఈ రోజుల్లో అలనాటి అద్బుతాలని నేటి తరానికి అందించాలని తపనతో సాహసంతో ఇలాంటి భక్తి రస చిత్రాలు తీయటం సాహసమే. ఇందుకు కె.రాఘవేంద్రరావు,బాలకృష్ణ అభినందీయులు. వరస సమ్మర్ ఫ్లాఫ్ లలో ఇది కలవక ఫ్యామిలీలకు ఆల్టర్ నేటివ్ అయి నిలిచే అవకాశం ఉంది. చాలాకాలం తర్వాత బాలయ్య కు విజయం అందించ వచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X