Papam Pasivadu Review సింగర్ శ్రీరామచంద్ర హీరోగా మెప్పించాడా? పాపం పసివాడు వెబ్ సిరీస్ సమీక్ష
నటీనటులు: శ్రీరామచంద్ర, రాశీ సింగ్, శ్రీ విద్య మహర్షి, గాయత్రి చాగంటి, మది, అశోక్ కుమార్, అజర్ తదితరులు
దర్శకత్వం: లలిత్ కుమార్
నిర్మాత: అఖిలేష్ వర్ధన్
మ్యూజిక్: జోస్ జిమ్మి
సినిమాటోగ్రాఫర్: గోకుల్ భారతీ
ఎడిటర్: విప్లవ్ నైషధం
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2023-10-01
పాపం పసివాడు కథ..
సాధారణంగా జీవితం పట్ల యువకుల్లో ఉండే అస్పష్టత కలిగిన యవకుడు క్రాంతి (శ్రీరామ చంద్ర). డింపీ (గాయత్రి చాగంటి) తో బ్రేకప్ తర్వాత విచిత్రమైన పరిస్థితిలో కూరుకుపోతాడు. ఆ పరిస్థితుల్లో బార్‌లో కలిసిన చారు (రాశీ సింగ్)తో పరిచయం కావడం.. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి శృంగారంలో పాల్గొనడం జరిగిపోతుంది. అయితే చారు పేరు తెలియకపోవడం..ఆమె ఉండే ఫ్లాట్ అడ్రస్ తెలియకపోవడంతో క్రాంతి వెతుకులాట మొదలుపెడుతాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బలవంతంగా అనుష (శ్రీ విద్య మహర్షి)తో పెళ్లి కుదుర్చుతారు.

పాపం పసివాడు వెబ్ సిరీస్‌లో ట్విస్టులు: డింపీతో క్రాంతికి బ్రేకప్ ఎలా జరిగింది? చారు పరిచయం ఎలా జరిగింది? పరిచయం జరిగిన మరుక్షణమే చారు, క్రాంతి మధ్య రొమాన్స్ ఎలా జరిగింది? అనూషతో నిశ్చితార్థం తర్వాత చారు కనిపించిందా? చారు కోసం వెతుకులాటలో క్రాంతికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇంతకు డింపీతో ప్యాచప్ జరిగిందా? చారు, అనూషలో ఎవరిని పెళ్లి చేసుకొన్నాడు? ఇలాంటి పరిస్థితుల మధ్య క్రాంతి పరిస్థితి ఏమిటనేది పాపం పసివాడు వెబ్ సిరీస్ కథ.

పాపం పసివాడు ఎలా ఉందంటే?: పాపం పసివాడు వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్‌గా సాగిపోతాయి. ఆ తర్వాత కథ, క్యారెక్టర్లు, స్క్రీన్ ప్లే క్లారిటీ కనిపించదు. సాగదీసినట్టు కథ సాగడం, అలాగే సన్నివేశాల్లో బలమైన కంటెంట్ లేకపోవడం వల్ల ఏదో రొటీన్, రెగ్యులర్ కంటెంట్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చివరకు గొప్పగా ఫన్, రొమాన్స్ ఉందా? అంటే అదీ కనిపించదు. కనీసం ఏదైనా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఉందా? అంటే అదీ ఉండదు. వెరసీ రెగ్యులర్ కథతో అయిపోయిందబ్బా అనే విధంగా వెబ్ సీరీస్ సీజన్ 1ను ముగించారు.

శ్రీరామచంద్ర యాక్టర్‌గా: నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. గాయకుడిగా, హోస్ట్‌గానే ఆయన తెలుసు. కానీ నటుడిగా కూడా రాణించగలనని శ్రీరామచంద్ర ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్లలో శ్రీరామచంద్ర యాక్టింగ్ బాగుంది. కొన్ని సీన్లలో కంటెంట్, ఎమోషన్స్ సరిగా లేకపోవడంతో పేలవంగా కనిపించారు. చారుగా రాశీ సింగ్ అందం, అభినయంతో మెప్పించింది. శ్రీ విద్య మహర్షి కూడా గ్లామర్‌తో అందాలను పంచింది. అశోక్ కుమార్, అజర్, ఇంకా మిగితా పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే: సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. గోకుల్ భారతీ సినిమాటోగ్రఫి, జిమ్మీ జోస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంత శ్రద్ద పెట్టాల్సి ఉంది. మిగితా సాంకేతిక విభాగాలు కంటెంట్‌కు తగినట్టుగా ఒకే అనిపించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. అయితే ఖర్చుకు తగినట్టు కంటెంట్‌పైన కూడా దృష్టిపెడితే ఇంకా బాగుండేదనిపిస్తుంది.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?: వెబ్ సిరీస్ అంటే యూత్‌ఫుల్, కామెడీ, రొమాన్స్ అనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు చూస్తారు. అందుకు తగినట్టుగా పాపం పసివాడు వెబ్ సిరీస్ కంటెంట్ డిజైన్ చేసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయితే యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బ్యాలెన్స్ చేసే విషయంలో దర్శకుడు లలిత్ కుమార్ తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. శ్రీరామచంద్ర ఫ్యాన్స్, ఫ్యామిలీ తరహా వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి నచ్చే అవకాశం ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళల్లో చూసే సదుపాయం ఉంది కాబట్టి.. మీకు వీలైన సమయంలో చూసి ఆనందివచ్చు.


Click it and Unblock the Notifications











