For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పేపర్‌ బాయ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

  By Rajababu
  |
  Paper Boy Movie Review పేపర్‌ బాయ్ సినిమా రివ్యూ

  Rating:
  2.0/5
  Star Cast: సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి రచన, నిర్మాత: సంపత్ నంది
  Director: వీ జయశంకర్

  ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిరుచి చాలా వేగంగా మారిపోతున్నది. మంచి కథ ఉంటే ఆడియెన్స్ సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఆర్ఎక్స్ 100, గీతా గోవిందం చిత్రాలు అందుకు సాక్ష్యంగా మారాయి. విభిన్నమైన కథా చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి జయశంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పేపర్‌బాయ్.

  ఈ చిత్రంలో దివంగత దర్శకుడు, వర్షం ఫేం శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా, రియా సుమన్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. వినోదాన్ని పంచేందుకు బిత్తిరి సత్తి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఇలా ప్రత్యేక ప్యాకేజీగా కనిపిస్తున్న పేపర్‌బాయ్ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అని తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.

  పేపర్‌బాయ్ స్టోరి

  బీటెక్ చదివిన రవి (సంతోష్ శోభన్) పేదరికం కారణంగా పేపర్‌బాయ్‌గా పనిచేస్తుంటాడు. తండ్రి ఆటో, తల్లి పలు ఇండ్లలో వంటమనిషిగా పనిచేస్తుంటారు. సంపన్న కుటుంబానికి చెందిన యువతి ధరణి (రియా సుమన్)తో రవి ప్రేమలో పడుతాడు. ఇరు వైపుల కుటుంబాల వీరి ప్రేమకు ఒకే చెప్పినప్పటికీ.. ఓ కారణంగా విడిపోతారు. రవి చనిపోయాడనే విషయంతో ధరణి తీవ్రమైన నిర్ణయం తీసుకొంటుంది. ధరణి, రవి కోసం కొన్ని రోజుల్లో చనిపోబోతున్న మేఘా (తన్యా హోప్) వెతుకొంటూ వస్తుంది.

  పేపర్‌బాయ్ కథలో మలుపులు

  ఇరు కుటుంబాలు ఒప్పుకొన్నప్పటికీ ధరణి, రవి ప్రేమ ఎందుకు పెళ్లి వరకు చేరలేకపోయింది? ధరణి ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకొన్నది? రవి నిజంగానే చనిపోయాడా? తనకు రవి దూరం కావడంతో ధరణి పరిస్థితి ఏంటి? ఈ కథలో మేఘా (తన్యా హోప్) పర్పస్ ఏమిటి? ధరణి వారిని ఎందుకు వెతుక్కొంటూ వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే పేపర్‌బాయ్ చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  నిశ్చితార్థం రోజునే మేఘా (తన్యా హోప్) సృహతప్పడం, ఆ తర్వాత ప్రాణాంతక వ్యాధితో ఆమె చనిపోవడం అనే ఎమోషనల్ పాయింట్‌తో కథ మొదలవుతుంది. చావు, బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్న మేఘాకు ధరణి, రవి ప్రేమ ఆసక్తి కలిగిస్తుంది. ఓ ఆధారాన్ని ఆసరాగా చేసుకొని దర్శకుడు రవి, ధరణి ప్రేమ కథలోకి సుత్తి లేకుండా సూటిగా ప్రవేశించడంతో ఎమోషనల్ కథను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఏ మాత్రం కొత్తదనం లేని సన్నివేశాలు, మూస ధోరణి ఉన్న సినిమాను చూడబోతున్నామనే విషయం అర్థమవుతుంది. ఇంటర్వెల్‌లో చిన్న ట్విస్టుతో పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయాడు.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో కథ కొంత భావోద్వేగంగా సాగుతుంది. అయితే ప్రతీ విషయం అంతా ఊహించినట్టే సాగిపోతుండటం ఆకట్టుకోలేకపోయడానికి కారణంగా మారుతుంది. ఇక అసలు కథ ముడి క్లైమాక్స్‌లో విప్పడం ఇంట్రెస్ట్‌గా మారుతుంది. ఈ సినిమాకు క్లైమాక్స్ బలంగా మారింది. చివరి 15 నిమిషాల కోసం మిగితా కథ మొత్తాన్ని సహనంతో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

  డైరెక్టర్ టాలెంట్

  మేఘా కథను సబ్‌ ప్లాట్‌గా చేసుకొని మెయిన్ కథలోకి ప్రవేశించే అంశం దర్శకుడి జయశంకర్ ప్రతిభకు అద్దం పట్టింది. బలమైన సన్నివేశాలు లేకపోవడం, ఉన్న సీన్లలో ఎమోషనల్ కంటెంట్ తగ్గడం ఆయన లోపాలను ఎత్తి చూపింది. కథలో ఫీల్‌గుడ్ అంశాలు ఉన్నప్పటికీ వాటిని ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా యావరేజ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడనే భావన కలుగుతుంది.

  సంతోష్ శోభన్ ఫెర్ఫార్మెన్స్

  ఇక రవి పాత్రలో సంతోష్ శోభన్ పక్కింటి కుర్రాడిలా ఆకట్టుకొన్నాడు. పేదింటి కుర్రాడి పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేశాడు. ప్రసంగాలుగా ఉన్న డైలాగ్స్‌ను తనదైన శైలిలో చెప్పి మెప్పించాడు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించడంలో సఫలమయ్యాడు. పూర్తిస్థాయి హీరోగా మారాలంటే తన ప్రతిభకు మరింత పదును పెట్టుకోవాల్సిందే.

  రియా సుమన్ గ్లామరస్‌గా

  ధరణి పాత్రలో రియా సుమన్ గ్లామరస్‌గా కనిపించింది. అప్పుడప్పుడు తెరపైన తొలిప్రేమలోని కీర్తిరెడ్డిలా మెరిసింది. నటనపరంగా సెంటిమెంట్ సీన్లలో ఒకే అనిపించింది. డ్యాన్సులకు లేకపోవడం వల్ల ఆమె పెర్ఫార్మెన్స్‌ను అంచనా వేయడం కొంత కష్టమే. ధరణి పాత్ర రియాకు పెద్దగా పేరు తీసుకురాకపోవచ్చు.. కానీ ప్రేమ కథలకు ఛాయిస్‌గా మారే అవకాశం ఉంది.

  గెస్ట్ రోల్‌లో తన్యా హోప్

  తన్యా హోప్‌కు మేఘా పాత్ర పెద్దగా స్కోప్ లేనిది. గెస్ట్ రోల్‌ అయినప్పటికీ సినిమా ఆరంభంలో ఎమోషనల్ సీన్లను పండించి అదరగొట్టింది. విద్యుల్లేఖ రామన్‌ది ఎప్పుడూ తిండి గొడవ పాత్రేనా అనే విసుగు పుడుతుంది. బిత్తిరి సత్తి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా రొడ్డ కొట్టుడు కమెడియన్ రోల్‌లోనే కనిపించాడు. పలు సినిమాల పేరడీ సీన్లు ఆకట్టుకోలేకపోయాయి.

  ఆకట్టుకోలేకపోయిన మిగితా పాత్రలు

  మిగితా పాత్రల్లో ఏ పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. పోసాని, నాగిరెడ్డి తదితర పాత్రలు నామమాత్రంగానే కనిపిస్తాయి. ప్రేక్షకులకు పెద్దగా తెలియని నటీనటులు ఉండటం వల్ల పాత్రలు ఎలివేట్ కాలేకపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది.

  కనువిందుగా సినిమాటోగ్రఫి

  పేపర్‌బాయ్ సినిమా విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ఫ్రేమింగ్‌లు, లైటింగ్‌, ఇతర అంశాలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. గ్రీనరీతోఅందమైన లొకేషన్లు కనువిందుగా సౌందర రాజన్ తెరకెక్కించాడు. కేరళ అందాలు కొత్తగా ఉంటాయి.

  భీమ్స్ మ్యూజిక్

  భీమ్స్ సెసిరొలియో అందించిన సంగీతం యావరేజ్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో మాత్రం రీరికార్డింగ్ చాలా బాగుంది. కథలో బలమైన సన్నివేశాలు లేకపోవడం మ్యూజిక్‌కు పెద్దగా స్కోప్ లేకపోయింది. ఎడిటింగ్ పనితీరు ఫర్వాలేదు. అక్కడక్కడ కొన్ని సీన్లు లెంగ్తీగా అనిపిస్తాయి.

  నిర్మాణ విలువలు

  దర్శకుడిగా, రచయితగా ఆకట్టుకొన్న సంపత్ నంది తన మనసుకు నచ్చిన కథలకు నిర్మాతగా మారుతుంటాడు. ఆ క్రమంలో పేపర్‌బాయ్ అనే ప్రేమకథను అందించాడు. నిర్మాణపరంగా రిచ్ వాల్యూస్ కనిపించాయి. అందమైన లొకేషన్లు, సాంకేతిక నిపుణుల ఎంపిక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే కచ్చితంగా మెరుగైన ఫలితం వచ్చి ఉండేది.

  ఫైనల్‌గా

  పేదింటి కుర్రాడు, గొప్పింటి అమ్మాయితో ప్రేమలో పడటం అనే రొటీన్ కథాంశంతో పేపర్‌బాయ్ తెరకెక్కింది. కథ చెప్పడంలో కొత్తదనం లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. బలమైన సన్నివేశాలు బాగాలేకపోవడం మరో ప్రతికూలత. యూత్, బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల స్పందనపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్
  సంతోష్ శోభన్, రియా సుమన్ యాక్టింగ్
  సినిమాటోగ్రఫి
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్

  మైనస్ పాయింట్స్
  కథ, కథనం
  డైరెక్టర్ టేకింగ్
  స్లో నేరేషన్
  నటీనటుల ఎంపిక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి
  దర్శకత్వం: వీ జయశంకర్
  రచన, నిర్మాత: సంపత్ నంది
  సంగీతం: భీమ్స్ సెసిరొలియో
  సినిమాటోగ్రఫి: సౌందర్ రాజన్
  ఎడిటింగ్: తమ్మిరాజు
  బ్యానర్: బీఎల్‌ఎన్ సినిమా బ్యానర్
  రిలీజ్: 2018-08-31

  English summary
  Director Jaya Shankarr's Telugu movie Paperboy is a romance comedy drama featuring Santosh Shoban, Riya Suman and Tanya Hope. Filmmaker Sampath Nandi has penned the script and dialogues for the movie and also produced it under his home banner. The film has received a U certificate from the censor board and its runtime is 2.05 hours.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more