Paradha Twitter Review: పరదా మూవీ ట్విట్టర్ రివ్యూ

తెలుగు సినిమా రంగంలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు భారీ ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పరదా. శ్రీమతి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. సినిమా బండి, శుభం చిత్రాలను రూపొందించిన ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

మహిళా చైతన్యం కాన్సెప్ట్‌తో రూపొందిన రూరల్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల చేశారు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నెటిజన్ల అభిప్రాయాల వివరాల్లోకి వెళితే..

Paradha Movie Twitter Review

పరదా సినిమా విషయానికి వస్తే.. ఇంపాక్ట్‌ఫుల్ జర్నీ. మూఢచారాలు, మూడ నమ్మకాలపై మహిళ సాగించిన పోరాటమే ఈ సినిమా కథ. ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా, సెకండాఫ్ చాలా స్లోగా ఉంది. ఈ చిత్రంలో అనుపమ, సంగీత, దర్శన పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ సినిమా ఓసారి చూడొచ్చనిపించింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన విభిన్నమైన చిత్రం పరదా. గ్రామంలో ముఖం చూపించకుండా పరదా వేసుకొనే మూఢాచారంతో సాగే కథ. అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత నటన బాగుంది. దర్శకుడు యూనిక్ లైన్ ఎంచుకొన్నాడు. సెకండాఫ్ చాలా స్లోగా సాగడం ఈ సినిమాకు మైనస్. డిఫరెంట్ సినిమాలు చూడాలనుకొనే వారికి ఈ మూవీ చక్కటి ఆప్షన్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

పరదా సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఫస్టాఫ్‌ ఎంగేజింగ్‌గా ఉంది. దర్శకుడు కథను నడిపించిన విధానం స్ట్రాంగ్‌గా ఉంది. దర్శన, సంగీత తమ పాత్రలతో ఆకట్టుకొన్నారు. బలవంతంగా కుక్కినట్టు సీన్లు ఉండటం వల్ల సెకండాఫ్ ఆకట్టుకోలేకపోయింది. మిగితా క్యారెక్టర్లు పేలవంగా ఉన్నాయి. కథావేగం మందగించడం వల్ల సినిమా చప్పగా సాగింది. ఓవరాల్‌గా ఓసారి చూడొచ్చనే అభిప్రాయం కలిగింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

అనుపమ పరమేశ్వరన్ ఎంతో మంది కంటే బెటర్‌గా పరదా సినిమాలో కనిపించారు. కొత్త కథ, మంచి యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నారు. మూఢ ఆచారాలు, వాటి వల్ల జరిగే దుష్ప్రభావం గురించి చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ కండ్రేగుల తీసిన కొన్ని సీన్లు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. ఓవరాల్‌గా పరదా డీసెంట్ మూవీ అనిపించింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

పరదా సినిమా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంది. ఫ్రెష్ ఐడియాతో కథ బాగుంది. సెకండాఫ్ దారుణంగా ఉంది. బలవంతంగా ఎమోషన్స్ జొప్పించే ప్రయత్నం కనబడింది. బలహీనమైన కథనం ఈ సినిమాకు మైనస్. అనుపమ పరమేశ్వరన్ సుబ్బలక్ష్మీగా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X