Parari movie review ఆకట్టుకొనే మర్డర్, కిడ్నాప్ డ్రామా.. కొత్త హీరో, దర్శకుడు ఎలా చేశారంటే?
నటీనటులు: యోగేశ్వర్, అతిథి, కారుమంచి రఘు, భూపాల్ రాజు, శివానీ సైని, ఆలీ,జీవా, సుమన్, మకరంద్ దేశ్ పాండే, సాయాజి షిండే తదితరులు
దర్శకత్వం: సాయి శివాజీ
నిర్మాత: జీవీవీ గిరి
సమర్పణ: గాలి ప్రత్యూష
సినిమాటోగ్రఫి: గరుడవేగ అంజి
మ్యూజిక్: మహిత్ నారాయణ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్
ఎడిటింగ్: గౌతంరాజు
బ్యానర్: శ్రీ శంకర ఆర్ట్స్
రిలీజ్ డేట్: 2023-03-30
టాప్ బిజినెస్ మ్యాన్ (సాయాజి షిండే) కుమారుడు యోగి (యోగీశ్వర్) తన కాలేజీలో చదివే అతిథి (అతిథి)తో ప్రేమలో ఉంటాడు. తన స్నేహితులతో (రఘు కారుమంచి, భూపాల్, శివాని సైని) సరదాగా లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. తన స్నేహితులతోపాటు యోగి ఓ మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. అదే సమయంలో యోగి తండ్రి కిడ్నాప్ గురవుతాడు.

మర్డర్ కేసులో యోగి తన స్నేహితులతో కలిసి ఎలా ఇరుక్కొన్నాడు? యోగి తండ్రిని పాండే (మకరంద్ దేశ్‌పాండే) ఎందుకు కిడ్నాప్ చేశాడు? మర్డర్ కేసు నుంచి యోగి ఎలా బయటపడ్డాడు? కిడ్నాప్‌కు గురైన తండ్రిని యోగి ఎలా రక్షించుకొన్నాడు? అతిథితో లవ్‌ను ఎలా సక్సెస్ చేసుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే పరారీ సినిమా కథ.
లవ్, మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ డ్రామాగా పరారీ సినిమా కోసం దర్శకుడు సాయి శివాజీ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. కొత్త, పాత నటులతో కలిపి సినిమాను రూపొందించిన విధానం ఫర్వాలేదనిపిస్తుంది. కొత్త దర్శకుడైనప్పటికీ.. అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను రూపొందించారనే చెప్పాలి. ఇక దర్శకుడి విజన్ అనుగుణంగా బెస్ట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ పాటిస్తూ పరారీ చిత్రాన్ని నిర్మాత జీవీవీ గిరి ఉత్తమంగా తీర్చిదిద్దారు. సినిమా క్వాలిటీని చూస్తే.. ఎక్కడా రాజీ పడలేదనే విషయం కనిపిస్తుంది. పేరున్న సాంకేతిక నిపుణులతో సినిమాను రూపొందించడం చూస్తే.. మూవీపై ఆయన అభిరుచికి అద్దంపట్టింది.
సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే.. గరుడ వేగా అంజి సినిమాటోగ్రఫి ఈ సినిమా మంచి ఫీల్‌ను తెచ్చిపెట్టింది. స్వర్గీయ చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అందించిన మ్యూజిక్, పాటలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ అందించిన సాహిత్యం రిచ్‌గా ఉంది. స్వర్గీయ గౌతంరాజు ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. యోగీశ్వర్ కొత్త హీరో అయినప్పటికీ.. ఎక్కడా అలాంటి ఫీలింగ్ కనిపించకుండా తన ప్రతిభను చాటుకొన్నాడు. నటనపరంగా, డైలాగ్ డెలివరీ, డ్యాన్సులు, ఫైట్స్ పరంగా, మాస్ ఎలిమెంట్స్‌తో అనుభవం ఉన్న హీరోలా నటించారు. మంచి కథ పడితే తనకు తాను నిరూపించుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు కనిపించాడు. అతిథి తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. భూపాల్, కారుమంచి రఘు కామెడీని పండించారు. సీనియర్ కమెడియన్ అలీ, జీవా ఈ సినిమాకు స్పెషల్ మాత్రమే కాకుండా సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు.
ఫైనల్‌గా.. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌తో వచ్చిన చిత్రం పరారీ. కొత్త హీరో, నూతన దర్శకుడు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో మంచి ఫీల్‌గుడ్ అంశాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. కథా, కథనాల పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. చిన్న సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మర్డర్ మిస్టరీలను ఆస్వాదించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











