Parasakthi First Review: పరాశక్తి మూవీ ఫస్ట్ రివ్యూ

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి. ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రరానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి మథిమారన్ పుగజేంది కథను అందించారు. తమిళనాడులో 60వ దశకంలో సాగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి రవీ కే చంద్రన్ సినిమాటోగ్రఫిని, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాకు సెన్సార్ పరమైన సమస్యలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం రివైజింగ్ కమిటీని సంప్రదించి ఈ సినిమా విడుదల కోసం క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను సాధించారు. ఈ సినిమా సాధించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమాపై అధికారులు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే విషయంలోకి వెళితే..

Parasakthi Review By Censor Board

1960 దశకంలో తమిళనాడు సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రభావం చేసిన హిందీ భాషా వ్యతిరేకోద్యమం నేపథ్యంగా ఈ కథను దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. సినీ వర్గాల వెల్లడించిన ప్రకారం.. హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎం రాజేంద్రన్ జీవితంలోని కీలక సంఘటనలను ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆ ఉద్యమం కాలంలో పోరాటం చేస్తూ రాజేంద్రన్ మరణించారు. సోదరభావం, ఉద్యమం, దేశభక్తి, భాషా సామరస్యం, రాజకీయ, సామాజిక అస్థిత్వం అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.

అయితే ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ చిత్రంలోని సన్నివేశాలను తొలగించాలి. అలాగే హిందీ భాషకు వ్యతిరేకంగా చెప్పిన డైలాగ్స్‌ను తీసివేయాలి. దేశ సమగ్రతకు ఇది భంగం కలిగించేలా ఉంది అనే అంశాలతో ఈ సినిమాకు సర్టిఫికెట్‌ను నిరాకరించారు. దాంతో ఈ సినిమా విడుదలకు అవసరమయ్యే సర్టిఫికేట్ కోసం చిత్ర నిర్మాతలు, దర్శకులు రివైజింగ్ కమిటీని సంప్రదించారు.

అయితే తమ సినిమా పరాశక్తి కథ హిందీ వ్యతిరేకోద్యమం అంశంగా తెరకెక్కింది. ఆ చిత్రంలోని కథకు సంబంధించిన కీలక సన్నివేశాలను తొలగిస్తే.. ఆ చిత్రాన్ని తీసిన ఉద్దేశం, ప్రయోజనాలు నెరవేరదు. ఈ సినిమా కథ దృష్టిలో ఆలోచించి సర్టిఫికెట్ ఇవ్వాలని తమ వాదనలు వినిపించారు. దాంతో ఈ సినిమాపట్ల సంతృప్తి చెందిన రివైజింగ్ కమిటి చివరకు యూఏ (U/A 16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్ల నిండిన ప్రేక్షకులు ఈ సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని తమ నిబంధనల్లో పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా అనేక రకాల ఎమోషన్స్‌తో రూపొందింది. భాషా ఉద్యమం, ప్రేమ కథ, యువశక్తి పోరాటం అంశాలు బలంగా ఉండటంతో ఈ సినిమాను పక్కాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా కట్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు నిడివిగా ఫిక్స్ చేశారు. అంటే ఈ మూవీ రన్‌టైమ్ 155 ఉండేలా నిర్ణయించారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలోని ఉద్యమ సన్నివేశాలు, రాజేంద్రన్ పాత్రలో శివకార్తీకేయన్ నటన అందర్నీ కట్టిపడేస్తుంది. తమిళనాడులో ఈ తరం ప్రేక్షకులకు చరిత్రను మరోసారి గుర్తించేసేలా వినోదంతోపాటు చైతన్యాన్ని రగలించేలా ఈ సినిమా తెరకెక్కించారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X