Parasakthi Twitter Review: పరాశక్తి ట్విట్టర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి. ఈ మూవీకి సుధా కొంగర దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. మథిమారన్ పుగజేంది కథను అందించారు. 60వ దశకంలో తమిళనాడు రాష్ట్రంలో సాగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కించారు. పరాశక్తి మూవీలో రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఈ మూవీకి రవీ కే చంద్రన్ సినిమాటోగ్రఫిని, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పరాశక్తి చిత్రం రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో శివకార్తీకేయన్ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

మ్యూజిక్, బీజీఎం ఫైర్. ప్రతి కీలక సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. పర్ఫెక్ట్ థియేటర్ వైబ్. ఎస్‌కే ఫైర్ అంటూ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
పకడ్బందీ నటనతో నటిచేలా చక్కగా సినిమాను రూపొందించారు. ఎస్కే మంచి డెప్త్ ఉన్న పర్ఫార్మెన్స్ చేశారు. లీల ఎమోషనల్‌గా నటించి బలమైన ముద్ర వేసింది. సంగీతం, విజువల్స్ సినిమాను మరింత ఎలివేట్ చేశాయని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
శివకార్తీకేయన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సాంగ్స్ ఎక్స్‌లెంట్ ఉన్నాయి.. సినిమాలో బీజీఎం అయితే ర్యాంప్ అసలు అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.
ఫస్టాఫ్ బ్రిలియంట్‌గా ఉంది. సుధా బెస్ట్ ఇచ్చారు. శివకార్తీకేయన్ నటనకు సెల్యూట్ చేయాల్సిందే. అథర్వ, శ్రీలీలలు ఫ్రెష్‌గా ఉన్నారు. బీజీఎం అయితే బ్లాస్టే. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
పరాశక్తి భారీ అంచనాలతో వచ్చింది. కానీ అది నెరవేరినట్లుగా కనిపించలేదు. ఒక శక్తివంతమైన కాలపు నేపథ్యాన్ని ఈ సినిమా పున: సృష్టించాలని భావించింది. అయితే ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్లలేకపోయింది. పాత్రలు, వాతావరణం మనల్ని ఆ కాలంలోకి లాగుతుండగా.. పరాశక్తి మనల్ని వర్తమానంలోనే వదిలేస్తుంది. హాస్య సన్నివేశాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆ కాలపు సందర్భానికి అనుగుణంగా ఉండేందుకు ప్రయత్నించినా అవి చప్పగా తేలిపోయాయి.
ఆ హాస్యం సహజంగా అనిపించకపోయినా బలవంతంగా ఇరికించినట్లుగా సినిమా కథాంశానికి పొంతన లేకుండా ఉంది. డ్రామా కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడినట్లుగా ఉంది. పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాన సమస్య అస్పష్టంగా ఉంది. దీని వలన పాత్రలలో, పోరాటాలలో దృష్టిపెట్టడం కష్టంగా మారింది. దాంతో ప్రతిఫలం ఎప్పుడూ రాదు. మొత్తం మీద పరాశక్తి ఆశించిన స్థాయిలో లేదు.. దాని ఉద్దేశం ఉన్నతమైనదే అయినా, అమలులో బలహీనంగా ఉందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
వాస్తవ సంఘటనల ఆధారంగా పరాశక్తిని నిర్మించారు. ఫస్టాఫ్ సింపుల్‌గా, సెకండాఫ్ బాగుంది. ఎస్‌కే, అథర్వల పర్ఫార్మెన్స్ సూపర్. పాటలు, బీజీఎం బ్లాస్ట్. రవిమోహన్ ట్రై చేశాడు, ఫెయిల్ అయయాడు. ఈ చిత్రంలో సర్‌ప్రైజ్ కామియో బలమైన ప్రభావం చూపిస్తుంది. బోలెడన్నీ పొలిటికల్ స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, యాక్షన్ అదిరిపోయాయని ఓ ట్విట్టర్ యూజర్ అభిప్రాయపడ్డాడు.
పరాశక్తిలో నిజాయితీతో కూడిన ఉద్దేశాలు ఉన్నప్పటికీ, మీ సహనాన్ని పరీక్షించే, విసుగు పుట్టించే, సుదీర్ఘమైన కథనంతో కూడిన చారిత్రక చిత్రం. ఈ సినిమా మొదట్లో ఒక ప్రామాణికమైన కాలపు సెటప్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుందవి. అయితే ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం నెమ్మదైన కథనం, నిస్తేజమైన ప్రేమకథ డామినేష్ చూపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాతి నుంచి సినిమా సాగదీతలా అనిపిస్తుంది. భాషా ఉద్యమం తాలూకా సన్నివేశాలు భావోద్వేగంగా అనిపించినా అంతగా ప్రభావం చూపలేదు.
దర్శకుడరాలు సుధా కొంగర ఒక సాహసోపేతమైన, నిజాయితీతో కూడిన కథాంశాన్ని ఎంచుకున్నప్పటికీ రచన, స్క్రీన్‌ప్లే విషయంలో తీవ్రంగా విఫలమయ్యారు. ఎస్కే చక్కగా నటించారు. జయం రవి పాత్రకు సరైన నేపథ్యం లేకపోవడం వల్ల దాని ప్రభావం పరిమితంగా ఉంది. కళా దర్శకత్వం ప్రత్యేకమైన ప్రశంసలకు అర్హమైనది. సంగీతం సో సోగా ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
శివకార్తీకేయన్ నటన, శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్‌తో పరాశక్తి సినిమా అద్భుతంగా వచ్చింది. బీజీఎం భావోద్వేగాలను మరింత పెంచుతుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











