For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Parigettu Parigettu movie review: సిస్టర్ సెంటిమెంట్, థ్రిల్లర్‌ అంశాలతో ఫీల్‌గుడ్‌గా

  |

  Rating: 2.5/5

  టాలీవుడ్‌లో విభిన్నమైన ఆలోచనలు, కథలతో యువ దర్శకులు చిత్రాలను రూపొందించి ఆకట్టుకొంటున్నారు. యువ దర్శకుడు రామకృష్ణ తోట కూడా క్రైమ్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన సినిమా చిత్ర యూనిట్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయంలోకి వెళితే..

  Parigettu Parigettu movie review and Rating

  అజయ్ (సూర్య, శ్రీనివాస్) మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. జీవితంలో స్థిరపడి ఫ్యామిలిని కష్టాల నుంచి దూరం చేయాలనుకొంటాడు. కుటుంబంలో ఓ సమస్య కోసం అప్పు చేసి సమస్యల్లో పడుతాడు. ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలో పనిచేసే యువతి ప్రియ (అమృత)తో ప్రేమలో పడుతాడు. సకాలంలో రుణాన్ని చెల్లించకపోవడంతో తన ప్రియురాలు ప్రియను అప్పు ఇచ్చిన వాళ్లు బంధిస్తారు. అప్పు తీర్చి ప్రియను తీసుకెళ్లమని కండిషన్ పెడుతారు.

  మధ్య తరగతి జీవితంతో కొట్టుమిట్టాడుతున్న అజయ్‌ ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది. తన కుటుంబంలో ఎలాంటి సమస్య ఎదురైంది? మాఫియా చేతిలో బందీ అయిన ప్రియ పరిస్థితి ఏమిటి? అప్పు తీర్చడానికి అజయ్ ఏం చేశాడు? చివరకు ప్రియను ఎలా విడిపించుకొన్నాడు? తన కుటుంబంలో చోటుచేసుకొన్న సమస్యను ఎవరి సహాయంతో పరిష్కరించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే పరుగెత్తు పరుగెత్తు సినిమా కథ.

  Parigettu Parigettu movie review and Rating

  దర్శకుడు రామకృష్ణ తోట ఎంచుకొన్న కథ, అల్లుకొన్న కథనం బాగానే ఉంది. కానీ అనేక భావోద్వేగాలు ఉన్న పాత్రలను మోసే నటీనటులు కరువయ్యారు. పేరున్న నటీనటులను పాత్రకు ఎంచుకొంటే సినిమాకు మంచి ఎలివేషన్ వచ్చేది. కానీ పరిమిత బడ్జెట్, కొత్త నటీనటుల నుంచి ప్రతిభను రామకృష్ణ రాబట్టకున్న తీరు ఆకట్టుకొంటుంది. దర్శకుడిలో అనుభవలేమి కొంత కనిపించినప్పటికీ.. కథ, కథనాలను డీల్ చేసిన విధానం ఆయన టాలెంట్‌కు నిదర్శనంగా మారిందని చెప్పవచ్చు.

  ఇక అజయ్‌గా అనేక రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను సూర్య శ్రీనివాస్ పోషించి మెప్పించారు. కుటుంబాన్ని ఆదుకొనే కొడుకుగా, చెల్లి ఎదురైన సమస్యను తీర్చే అన్నగా, ప్రియురాలిని రక్షించుకొనే ప్రియుడిగా, డ్రగ్స్ మాఫియాను ఎదురించే యువకుడిగా అనేక రకాల ఎమోషన్స్‌ను పండించారు. నటనపరంగా మరికొంత పరిణతి సాధించాల్సి ఉంది. నటనపరంగా చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొంటే కెరీర్ పరంగా గ్రాఫ్‌ను పంచుకొనే అవకాశం ఉంది. ప్రియ తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. గ్లామర్ పరంగా మెప్పించింది.

  సాంకేతిక నిపుణుల గురించి ప్రస్తావించాల్సి వస్తే.. సునీల్ కశ్యప్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ సన్నివేశాలను హైలెట్ చేసింది. ఐటెం సాంగ్ మంచి రంజుగా సాగింది. కల్యాణ్ సమీ సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. వెంకట్ ప్రభు తన కత్తెరకు మరికొంత పదును పెట్టాల్సి ఉందనిపిస్తుంది. ఇతర విభాగాల్లోని సాంకేతిక నిపుణులు తమ పరిధి మేరకు ఒకే అనిపించారు. దర్శకుడి విజన్, కథ, కథనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాత యామినీ కృష్ణ ఉత్తమ విలువలను పాటిస్తూ మంచి చిత్రాన్ని అందించడంలో సఫలమయ్యారు.

  పరిగెత్తు పరిగెత్తు సినిమా విషయానికి వస్తే.. సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే సస్పెన్స్, థ్రిలర్ మూవీ. మంచి కథకు పేరున్న నటీనటులు తోడైతే భారీ విజయాన్ని అందుకొనే సత్తా మూవీకి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్ కంటే.. ఓటీటీలో రిలీజ్ చేస్తే దర్శక, నిర్మాతలకు, హీరో, హీరోయిన్లకు మంచి రెస్సాన్స్ వచ్చి ఉండేది. ముఖ్యంగా ఈ సినిమా జోనర్ ఓటీటీకి పక్కాగా సరిపోతుందనేది ప్రేక్షకుల అభిప్రాయం. సెంటిమెంట్, థ్రిల్లర్ చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

  నటీనటులు: సూర్య శ్రీనివాస్, అమృత తదితరులు
  రచన, దర్శకత్వం: రామకృష్ణ తోట
  నిర్మాత: ఏ యామిని కృష్ణ
  డీవోపి: కల్యాణ్ సమీ
  మ్యూజిక్: సునీల్ కశ్యప్
  ఎడిటింగ్: బీ వెంకట్ ప్రభు
  స్టంట్స్: శంకర్
  ఆర్ట్: రాజ్ కుమార్
  రిలీజ్ డేట్: 2021-07-30

  English summary
  Young and aspiring hero Surya Srinivas's latest movie is Parigettu Parigettu. This movie directed by Ramakrishna Thota. Produced by Yamini Krishna. This movie hit the screens on July 30th, 2021.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X