Paruvu OTT Review: పరువు వెబ్ సిరీస్ రివ్యూ
Rating: 2.75/5
వెబ్ సిరీస్: పరువు
నటీనటులు: నివేతా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు, ప్రణీత పట్నాయక్ తదితరులు
దర్వకత్వం: సిద్దార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి
నిర్మాతలు: సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్య పోట్ల
స్క్రీన్ ప్లే: సిద్దార్థ్ నాయుడు
మ్యూజిక్: శ్రావణ్ భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్: చింతా విద్యాసాగర్
ఎడిటర్: విప్లవ్
క్యాస్టూమ్ డిజైనర్: లంక సంతోషి
బ్యానర్: గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఒటీటీ రిలీజ్: జీ5
ఓటీటీ రిలీజ్ డేట్: 2024-06-04
పరువు వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే.. పల్లవి (నివేతా పేతురాజ్) పెద్దలను ఎదురించి సుధీర్‌ను (నరేష్ అగస్త్య) ప్రేమవివాహం చేసుకుంటుంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందనే కోపంతో పల్లవిని ఆమె తల్లిదండ్రులతో పాటు బంధువులు దూరం పెడతారు. రెండేళ్ల తరువాత పల్లవి పెదనాన్న చనిపోవడంతో కడసారి అతడిని చూసేందుకు భర్తతో కలిసి సొంత ఊరు బయలుదేరుతుంది. పల్లవి బావ చందు ఇష్టం లేకపోయినా ఇద్దరిని తన కారులో తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. జర్నీలో పల్లవి, సుధీర్ గురించి చందు చులకనగా మాట్లాడుతాడు. దాంతో పల్లవి అతడితో గొడవపడుతుంది.

అదే రాత్రి చందు ఓ గన్ కొనడం పల్లవి చూస్తుంది. తమను చంపడానికే చందు గన్ కొంటున్నాడని భ్రమపడుతుంది. పల్లవి మాటలు నిజమని నమ్మిన సుధీర్ ఆవేశంలో చందును చంపేస్తాడు. ఆ శవాన్ని ఎవరికి తెలియకుండా మాయం చేయాలని ఇద్దరు ఫిక్సవుతారు. మరోవైపు చందు జాడ కోసం అతడి ప్రియురాలు స్వాతి (ప్రణీత పట్నాయక్) వెతుకుంటుంది. ఇంకోపక్క చందు కోసం లోకల్ ఎమ్మెల్యే రామయ్య(నాగబాబు) వెతుకుతూ ఉంటాడు. చివరికి చందు చనిపోయాడని తెలుస్తుందా..? ఈ ప్రేమ జంట చివరికి బయటపడ్డరా..? మధ్యలో దొరబాబు ఎవరు..? క్వీన్ కావ్య ఎందుకు వచ్చింది.. ? అనేది కథ.
సిరీస్ మొత్తం సస్పెన్స్ తో నింపేశారు. ఒక్క రోజులో జరిగే కథను చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. పరువు హత్య చేసి రామయ్య ఎలా ఇరుకున్నాడు అనేది చూపిస్తూనే.. ఇంకోపక్క చందు ఏమయ్యాడు..? అని వెతికే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. పల్లవి, సుధీర్ ఎక్కడ దొరికిపోతారేమో అనే భయం ప్రేక్షకుల్లో కల్పించి చివర వరకు చూసేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యారు.

ఒక మర్డర్ మిస్టరీగా కథను చూపిస్తూ అందులోనే కులం కోసం ఎంతకైనా తెగించే కుటుంబాలు ఇంకా ఉన్నాయని చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ట్విస్టులతో సాగే ఈ సినిమా కథనం ఆకట్టుకొనేలా ఉంటుంది.
సిద్దార్థ్ నాయుడు స్క్రీన్ ప్లే, శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫి ఈ వెబ్ సిరీస్‌కు ప్లస్ పాయింట్స్. విప్లవ్ ఎడిటర్‌గా ఆడియెన్స్‌ను క్యూరియాసిటీ కలిగించే సన్నివేశాలను పరుగు పెట్టించాడు. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
అనుకోకుండా ఓ మర్డర్ చేసి ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఒక జంట.. ఎన్ని ఇబ్బందులను దాటుకొని నిలబడ్డారు అనేది కన్విన్స్ గా చూపించారు. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆ సస్పెన్స్ పోకుండా చూడడంతో సిరీస్ మొత్తం ఇంట్రెస్ట్ గా సాగిపోయింది. కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా.. డైరెక్టర్స్ చూపిన విధానం ఆకట్టుకుంటుంది. మొత్తానికి పరువు మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఇంకా ఈ సిరీస్ చూడలేదు అంటే జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.. మీరు కూడా ఓ లుక్ వేసేయండి.


Click it and Unblock the Notifications











