Patang Movie Review: పతంగ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: వంశీ పుజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, విష్ణు ఓఐ, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్, అను హసన్ తదితరులు
రచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డి
మ్యూజిక్: జోస్ జిమ్మి
సినిమాటోగ్రఫి: శక్తి అరవింద్
పాటల సాహిత్యం: శ్రీ మణి
ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పు
ప్రొడక్షన్ డిజైన్: వెంకట్ శాతవాహన
బ్యానర్: నాని బండ్రెడ్డి ప్రొడక్షన్
రిలీజ్ డేట్: 2025-12-25

పేదింటికి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పుజిత్), సంపన్న కుటుంబానికి చెందిన అరుణ్ (ప్రణవ్ కౌశిక్) బాల్య మిత్రులు. స్కూలింగ్ నుంచి ఇద్దరు మధ్య విడదీయలేనంత స్నేహం ఉంటుంది. ఒకరికోసం మరొకరు ప్రాణం ఇచ్చుకొనేంత ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. అలాంటి ఇద్దరు స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. మొదటగా విస్కీతో లవ్ ట్రాక్ నడిపిస్తుంది. ఆ తర్వాత మనసు మార్చుకొని అరుణ్‌తో ప్రేమలో పడుతుంది. దాంతో విస్కీ, అరుణ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని విడిపోతారు. ఐశ్వర్య ఎవరికి దక్కాలనే విషయంపై ఇద్దరి మధ్య పతంగ్ పోటీ పెడుతారు.

Patang Movie Review

విస్కీ, అరుణ్ మధ్య ఫ్రెండ్ షిప్ బలంగా మారడానికి చోటుచేసుకొన్న సంఘటనలు ఏమిటి? చిన్నతనం నుంచి టీనేజ్ వరకు వారి స్నేహం ఎలా కొనసాగింది? విస్కీతో ఐశ్వర్య ఎలా ప్రేమలో పడింది? విస్కీతో ప్రేమలో ఉండగానే.. అరుణ్‌కు ఎలా దగ్గరైంది? విస్కీతో తెగతెంపులు చేసుకొని అరుణ్‌తో లవ్‌ అఫైర్ కొనసాగించాలని ఎందుకు నిర్ణయం తీసుకొన్నది? ఐశ్వర్య కోసం జరిగిన పతంగ్ పోటీలు ఎలా జరిగాయి? ఈ పతంగ్ పోటీలో విస్కీ, అరుణ్‌లో ఎవరు గెలిచారు? ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనే ప్రశ్నలకు సమాధానమే పతంగ్ సినిమా కథ.

పతంగ్ సినిమా కథ చెప్పుకోవడానికి కొత్తగా ఏమీ అనిపించడమే కాకుండా అసలు పాయింటే ఉండదనిపిస్తుంది. ఒక చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ దర్శకుడు ప్రణీత్ ప్రతిపాటి అల్లుకొన్న పాత్రలు, సన్నివేశాలు స్క్రీన్ మీద మ్యాజిక్‌లా అనిపిస్తాయి. గౌతమ్ వాసుదేవన్ మీనన్‌తో కలిసి హీరోయిన్‌తో కథ చెప్పించిన తీరే సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేసింది. తెర మొత్తం కలర్‌ఫుల్‌గా, ఫ్రెష్‌గా, యూత్ ఫుల్ డైలాగ్స్, క్యూట్ లవ్ స్టోరి, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి స్టోరి చెప్పిన విధానం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. దాదాపు రెండున్నర గంటల సినిమాలో ఏ ఒక్క నిమిషం వృధా కాకుండా సన్నివేశాలు పేర్చిన విధానం కారణంగా సినిమాలో ఆడియెన్స్ లీనమవ్వడమే కాకుండా.. పాత్రలు, కథతో ఎంగేజ్ అయ్యేలా చేశాడు.

పతంగ్ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. సరదా సరదాగా అప్పుడే అయిపోయిందా? అనే ఫీలింగ్ కలిగిస్తుంది. పాత్రల పరిచయం.. ఫన్, అనుక్షణం పెదవులపై చిరునవ్వు తెప్పించే యూత్‌ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. సెకండాఫ్‌ మొదలైన తర్వాత కథ కొంత వరకు డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా స్లోగా సాగడంతో సినిమా దారి తప్పుతుందా? అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి పతంగ్ పోటీలను డిజైన్ చేసి.. హిలేరియస్ కామెడీ, హృదయాన్ని హత్తుకొనే ఎమోషన్స్‌తో సినిమాను చక్కగా.. మంచిగా ముగింపు ఇవ్వడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమాను ఫీల్‌గుడ్ టీనేజ్ లవ్ స్టోరి, ఎంటర్‌టైనర్‌గా మార్చేశాడు. సినిమాలో స్క్రిప్టుపరంగా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ వాటి గురించి చర్చించుకోవడం అనవసరం అనిపిస్తుంది.

పతంగ్ సినిమాలో ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్ తప్ప మిగితా అంతా ఊరు, పేరు, ముక్కు ముఖం తెలియని ఆర్టిస్టులే. కానీ వారందరూ ప్రాణం పెట్టి.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతీ ఒక్కరు నటించారు అనే కంటే సహజంగా పాత్రల్లా బిహేవ్ చేశారని చెప్పాలి. నటనకు కొత్తవారైనా వంశీ, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాసరావు ఈ సినిమాకు బలమైన పిల్లర్స్‌లా నిలిచారు. కమెడియన్ విష్ణు ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు సినిమా భారన్నంతా తన భుజాలపై మోశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు 100 శాతం తమలోని బెస్ట్ టాలెంట్‌ను అందించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యంత బలంగా మారింది. పలు సీన్లను మరింత ఫీల్‌గుడ్‌గా, ఎమోషనల్‌గా మార్చేలా చేసింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫి అదిరిపోయింది. స్క్రీన్ మొత్తం రంగులతో చూడముచ్చటగా మార్చేశాడు. పతంగ్ పోటీలను తెరకెక్కించిన విధానం ఆయన టాలెంట్‌ ఏంటో బయటపెట్టింది. ఈ సినిమాకు ఎడిటింగ్ పక్కాగా సెట్ అయింది. ప్రతీ ఫ్రేమ్‌లో కంటెంట్ చాలా రిచ్‌గా కనిపించింది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ కూడా ప్రొఫెషనల్‌గా ఉంది. విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు హైస్టాండర్డ్‌లో ఉన్నాయి.

పతంగ్ సినిమా గురించి ఓవరాల్‌గా చెప్పాలంటే.. కథ విషయానికి వస్తే.. రొటీన్, రెగ్యులర్ పాయింటే. కానీ డైరెక్టర్ స్టోరిని ప్రజెంట్ చేసిన విధానం.. నటీనటులు పెర్పార్మ్ చేసిన విధానం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టాయి. ఈ సినిమాకు రైటింగ్, స్క్రీన్ ప్లే అత్యంత బలంగా నిలిచాయి. చిన్న సినిమా కానీ.. రిచ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఫన్, ఎమోషన్స్, టీనేజ్ లవ్ అంశాలు ఈ సినిమా ఫీల్‌గుడ్ అంశాలు. ఈ వారాంతపు సెలవుల్లో మంచి వినోదాన్ని, ఎమోషన్స్ పొందాలంటే.. తప్పకుండా పతంగ్‌ను చూడండి.. థియేటర్‌లో ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ లభిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X