twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pathaan Review షారుక్ ఖాన్ కమ్ బ్యాక్.. దీపిక అందాల ఘుమఘలు.. క్రేజీగా సల్మాన్ ఖాన్

    |

    Rating:
    3.0/5
    Star Cast: షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా
    Director: సిద్దార్థ్ ఆనంద్

    బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, గ్లామర్ క్వీన్ దీపిక పదుకోన్ జంటగా, జాన్ అబ్రహం కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్‌తో వచ్చిన చిత్రం పఠాన్. వార్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. 50 ఏళ్లుగా బాలీవుడ్‌కు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించిన యష్ రాజ్ ఫిలిం బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 తేదీన రిలీజైంది. గత 9 ఏళ్లుగా హిట్ లేని, గత నాలుగేళ్లుగా సినిమా రిలీజ్ కాని పరిస్థితుల్లో షారుక్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పఠాన్ చిత్రం షారుక్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఈ సినిమాను సమీక్షించాల్సిందే.

    పఠాన్ మూవీ కథ ఏమిటంటే?

    పఠాన్ మూవీ కథ ఏమిటంటే?

    పఠాన్ (షారుక్ ఖాన్) ఇండియాలో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (Raw) ఏజెంట్‌. వివిధ దేశాల్లో దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రలను చేధించడానికి ఇండియా తరఫున ఆపరేషన్స్‌కు నాయకత్వం వహిస్తుంటాడు. భారత సైన్యంలో పనిచేసే జిమ్ (జాన్ అబ్రహం) పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత. అయితే ఓ సంఘటన కారణంగా భారత్‌పై ద్వేషం పెంచుకొని.. పాకిస్థాన్‌తో చేతులు కలుపుతాడు. ఇక రుబీనా ఖాన్ (దీపిక పదుకోన్ పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్. ఓ మిషన్‌ కోసం పారిస్ వెళ్లిన షారుక్‌ను బుట్టలో వేసుకొని రుబీనా మోసం చేస్తుంది. ఈ క్రమంలో జిమ్, దీపిక కలిసి భారత్‌కు వ్యతిరేకంగా రక్త బీజ్ అనే కాన్సెప్ట్‌తో బయోలాజికల్ వార్ చేపట్టారనే విషయం పఠాన్‌కు తెలుస్తుంది.

    పఠాన్ మూవీలో ట్విస్టులు

    పఠాన్ మూవీలో ట్విస్టులు

    భారత సైన్యంలో పనిచేసే జిమ్ దేశానికి వ్యతిరేకంగా ఎలా మారాడు. ఎలాంటి సంఘటన దేశంపై జిమ్ విద్వేషం పెంచుకొనే పరిస్థితికి దారి తీసింది. ఐఎస్ఐ ఏజెంట్ అయిన రుబీనా పఠాన్‌ను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొన్నది. అసలు రక్త‌బీజ్ కాన్సెప్ట్ ఏమిటి? జిమ్ చేపట్టిన రక్త బీజ్ బయోలాజికల్ వార్ కుట్ర ఏమిటి? రక్త బీజ్ ఆపరేషన్‌తో భారత్‌ను జిమ్ ఎలా సర్వనాశనం చేయాలనుకొన్నాడు? పాకిస్థాన్‌కు చెందిన రుబీనా ఇండియాకు ఎందుకు సహాయం చేయాలని అనుకొంటుంది. రక్త్ బీజ్ ఆపరేషన్‌ను పఠాన్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడా? ఈ కథలో టైగర్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి? పఠాన్‌కు కబీర్ ఎలాంటి సహాయం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే పఠాన్ సినిమా కథ.

    పఠాన్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    పఠాన్ ఫస్టాఫ్ ఎలా ఉందంటే?


    కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాకిస్థాన్ ద్వేషం పెంచుకొని భారత్‌పై బయోలాజికల్ వార్ చేపట్టాలని.. జిమ్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా పఠాన్ చిత్రం చాలా ఎమోషనల్‌గా మొదలవుతుంది. పాకిస్థాన్ ఎత్తుగడలను, కుట్రను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే పఠాన్ తరమే అవుతుందనే కోణంలో పఠాన్ ఎంట్రీతో సినిమా పీక్స్‌లోకి వెళ్తుంది. దీపిక పదుకోన్ ఎంట్రీ.. బేషరమ్ రంగ్ పాట, జాన్ అబ్రహంతో షారుక్ యాక్షన్ సీన్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉండటమే కాకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. ఇక పఠాన్‌ను రుబీనా చీట్ చేయడం, రక్త బీజ్ అంశం లాంటి ట్విస్టులతో ఫస్టాఫ్ ముగుస్తుంది.

    సెకండాఫ్ హైలీ ఎమోషనల్

    సెకండాఫ్ హైలీ ఎమోషనల్

    ఇక సెకండాఫ్‌లో రష్యాలో రక్త బీజ్ రసాయనాలను తీసుకురావడం అనే ఎపిసోడ్‌లో షారుక్ ఖాన్ అక్కడి పోలీసులకు దొరికిపోవడంతో కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఆ సమయంలో టైగర్ (సల్మాన్ ఖాన్) ఎంట్రీ ప్రేక్షకులకు, అభిమానులకు కిరాక్‌ లేపుతుంది. అప్పటి వరకు కథ ట్రాక్ తప్పిందునుకొనే సమయంలో సల్మాన్ ఖాన్ సుమారు 10 నిమిషాల ఎంట్రీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. సల్మాన్, షారుక్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో రొటీన్‌ సీన్లు, కథలో ఏం జరుగుతుందనే రెగ్యులర్ ప్యాటర్న్‌తో కథ సాగినా.. క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడని చెప్పవచ్చు.

    షారుక్ ఖాన్ వన్ మ్యాన్ షో

    షారుక్ ఖాన్ వన్ మ్యాన్ షో

    రా ఏజెంట్‌గా పఠాన్‌ క్యారెక్టర్ షారుక్ ఖాన్‌కు టైలర్ మేడ్. క్యారెక్టర్ పరంగా రిస్క్ చేయకుండా.. పెద్దగా వేరియేషన్స్ లేకుండానే రెగ్యులర్‌ కమర్షియల్ అంశాలను ఆ క్యారెక్టర్ చుట్టూ అల్లుకొని మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనే ప్రయత్నాన్ని సిద్దార్థ్ ఆనంద్ చేశాడు. యాక్షన్, రొమాన్స్, దేశభక్తి లాంటి అంశాలతో ఉన్న క్యారెక్టర్‌లో షారుక్ ఖాన్ ఒదిగిపోయాడు. షారుక్ ఖాన్‌కు ఇలాంటి క్యారెక్టర్స్ కొట్టిన పిండిలాంటివే. ఇక సిక్స్ ప్యాక్‌తో తెర మీద షారుక్ ఖాన్ అద్బుతంగా కనిపించాడు. పాటలు, యాక్షన్, ఎమోషనల్ సీన్లతో అదరగొట్టాడు. 9 ఏళ్లుగా హిట్ లేదనే కసిని పఠాన్ ద్వారా తీర్చుకొనే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.

    దీపిక గ్లామర్ గాను.. ఎమోషనల్ గాను..

    దీపిక గ్లామర్ గాను.. ఎమోషనల్ గాను..


    పఠాన్ సినిమాకు దీపిక పదుకోన్ స్పెషల్ ఎట్రాక్షన్. కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా యాక్షన్ సీన్లలో ఇరుగదీసింది. హాలీవుడ్‌లో స్కార్లెట్ జాన్సన్ లాంటి పాత్రలో మెరిసింది. తండ్రి ఫ్యాష్ బ్యాక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పాత్రను అద్బుతంగా పలికిచింది. అయితే ఐఎస్ఐలో పనిచూస్తూ కూడా ఇతర దేశాల్లోనే ప్రజలకు జరిగే ద్రోహాంపై మానవత్వాన్ని ప్రదర్శించే సెన్సిబుల్ క్యారెక్టర్‌లో ఫిట్ అయింది. బికినీలు, శృంగార భంగిమలు, క్లీవేజ్ షోతో గ్లామర్‌ను యదేచ్ఛగా ప్రదర్శించింది.

    జాన్ అబ్రహం టెర్రిఫిక్

    జాన్ అబ్రహం టెర్రిఫిక్

    పఠాన్ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను ఢీకొట్టాలంటే.. జిమ్ లాంటి క్యారెక్టర్ బలంగా ఉండాల్సిందే. అలాంటి బలమైన పాత్రలో జాన్ అబ్రహం.. విలనిజానికి నిలువెత్తు అద్దంలా నిలిచారు. సిక్స్ ప్యాక్ హీరోను ఢికొట్టే మరో సిక్స్ ప్యాక్ విలన్‌గా నువ్వా నేనా అనేట్టు బలంగా నిలబడే క్యారెక్టర్‌లో జాన్ అబ్రహం ఒదిగిపోయాడు. జిమ్ పాత్రలో జాన్ అబ్రహం తప్ప మరొకరిని ఊహించుకోలేమని భావనను కల్పించాడు. రకరకాల వేరియేషన్స్, ఎమోషనల్ పాత్రతో జాన్ మెప్పించారని చెప్పవచ్చు.

    సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీతో

    సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీతో

    ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీ హిందీ ఆడియెన్స్, ఫ్యాన్స్‌కు విందు భోజనంలా మారిందని చెప్పవచ్చు. షారుక్‌తో, సల్మాన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. ఇంటర్వెల్ తర్వాత పది నిమిషాలు, క్లైమాక్స్‌లో ఓ ఐదు నిమిషాలపాటు సల్మాన్ కనిపించి సినిమాను పది మెట్లు ఎక్కించాడని చెప్పవచ్చు. సల్మాన్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?

    టెక్నికల్‌గా ఎలా ఉందంటే?


    ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాకు ప్రాణంగా సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నిలిచింది. పలుదేశాల్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్, యాక్షన్ సీన్లను తెరపైన సచిత్ పౌలోజ్ అద్బుతంగా చూపించాడు. హాలీవుడ్ స్థాయికి తీసిపోకుండా పఠాన్ సినిమాను విజువల్ ట్రీట్‌గా అందించాడు. ఇక యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లను సంగీత ద్వయం సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కేక పెట్టించారు. బేషరమ్ రంగ్, పఠాన్ సాంగ్స్ తెర మీద జోష్‌తో ఉన్నాయి. ఎడిటింగ్ ఇతర విభాగాలు పనితీరు హైస్టాండర్డ్‌లో ఉన్నాయి. తెలుగు సినిమాలతో పోల్చుకొంటే విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా కనిపిస్తాయి. కొన్ని చోట్ల సినిమా క్వాలిటీ కొంత పేలవంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

    యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

    యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్


    పఠాన్ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే.. యష్ రాజ్ ఫిలింస్ ప్రమాణాలకు పైపెచ్చే కనిపిస్తాయి. సినిమాను చాలా విలాసవంతంగా, రిచ్‌గా, ప్రతీ ఫ్రేమ్‌ను అద్బుతమైన క్వాలిటీతో అందించే ప్రయత్నాన్ని అభినందించాలి. రష్యా, ప్యారిస్, దుబాయ్, ఇతర దేశాల్లో ఎంచుకొన్న లొకేషన్లు అబ్బో అనిపిస్తాయి. టామ్ క్రూజ్ తరహా హాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా పఠాన్‌ను తెరకెక్కించారు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమాల ప్రభావంతో భారతీయ ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషనల్ అంశాలు దట్టించి చేసిన సినిమా పఠాన్. రొటీన్ కథ, రెగ్యులర్ కథనాలు ఉన్నప్పటికీ.. సినిమాలో ఉండే ఎమోషన్స్‌తో టెక్నికల్ వ్యాల్యూస్ కారణంగా ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ అనే ఫీలింగ్‌ను తెచ్చేలా దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు. షారుక్ వన్ మ్యాన్ షో, దీపిక పదుకోన్ గ్లామర్, ఫెర్ఫార్మెన్స్, జాన్ అబ్రహం విలనిజం, సల్మాన్ స్పెషల్ ఎట్రాక్షన్ సినిమాకు, అభిమానులకు విందు భోజనంలా మార్చాయని చెప్పవచ్చు. లాజిక్స్, అంచనాలు లేకుండా వెళితే ప్రతీ ఫ్రేమ్, ప్రతీ ఎపిసోడ్ ఎంజాయ్ చేయవచ్చు. షారుక్, సల్మాన్ అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టడం ఖాయం.. అయితే ఏ రేంజ్ కలెక్షన్లు కొల్లగొడుతుందనేది వేచి చూడాల్సిందే.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు


    పాజిటివ్ పాయింట్స్
    షారుక్ ఖాన్ పెర్పార్మెన్స్
    దీపిక పదుకోన్ గ్లామర్
    జాన్ అబ్రహం విలనిజం
    సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ
    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    మైనస్ పాయింట్స్
    రెగ్యులర్ కథ, రొటీన్ కథనం
    విజువల్ ఎఫెక్ట్స్
    సెకండాఫ్‌ నేరేషన్ కొంత స్లోగా సాగడం

     పఠాన్‌లో తెర వెనుక, తెర ముందు

    పఠాన్‌లో తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహం, సల్మాన్ ఖాన్, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా తదితరులు
    కథ, దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్
    స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
    నిర్మాత: ఆదిత్య చోప్రా
    సినిమాటోగ్రఫి: సచ్చిత్ పౌలోజ్
    ఎడిటింగ్: ఆరీఫ్ షేక్
    మ్యూజిక్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
    బ్యానర్: యష్ రాజ్ ఫిలింస్
    బడ్జెట్: 250 కోట్లు
    రిలీజ్ డేట్: 2029-01-25

    English summary
    Bollywood Super Star Shah Rukh Khan's Latest movie Pathaan. This movie hits the Theatres on January 25th. Deepika Padukone, Salman Khan, John abaram are steal the show. Here is the filmibeat exclusive Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X