Patriot Movie Review: పేట్రియాట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్, ప్రకాశ్ బెలావాదీ తదితరులు
రచన, దర్శకత్వం: మహేష్ నారాయణన్
నిర్మాత: ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్
సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
ఎడిటింగ్: మహేష్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్
మ్యూజిక్: సుషిన్ శ్యామ్
బ్యానర్: ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, కిచప్పస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
థియేట్రికల్ రిలీజ్: 2026-05-01
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్: జీ5
ఓటీటీ రిలీజ్: 2026-06-04

స్కూల్ పిల్లలకు ఉచిత ల్యాప్‌టాప్‌‌లు ఇచ్చి వాటిలో స్పైవేర్ అనే సాఫ్ట్‌వేర్‌తో బాలికలను లైంగిక వేధించే కుట్రలను శక్తి సొల్యూషన్ చేస్తుంటుంది. DRW అనే డిఫెన్స్ సంస్థలో సైంటిస్ట్‌గా పనిచేసే డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి) దేశ భద్రతకు సంబంధించిన కుట్రలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆయనపై దేశద్రోహి ముద్ర వేయడంతో ఇండియా నుంచి లండన్ పారిపోతాడు. అక్కడ విమదన్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అనుభవాలను, కుట్రలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో డేనియల్‌పై శక్తి సొల్యూషన్ అధినేత శక్తి సుందరం (ఫాహద్ ఫాజిల్) హత్యాప్రయత్నం చేయిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రహీం నాయక్ (మోహన్ లాల్) శక్తి సొల్యూషన్స్ ఉద్యోగి మైఖేల్ (కుంచాకో బోబన్) డేనియల్‌కు అండగా నిలుస్తారు.

Patriot Malayalam Movie Review

ఉచిత ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిన అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? పిల్లల కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరిగింది? డిఫెన్స్‌లో నిస్వార్ధంతో పనిచేసే డేనియల్ జేమ్స్‌పై దేశ ద్రోహి అని ఎందుకు ముద్ర వేశారు. దేశం విడిచి డ్యానీ ఎందుకు పారిపోయాడు? రహీం నాయక్ ఇంతకు ఎవరు? డేనియల్‌కు ఎలా అండగా నిలిచారు? డేనియల్‌పై కుట్రలను మైఖేల్ ఎలా అడ్డుకొన్నారు? డేనియల్ లైఫ్‌లో లతిక (నయనతార), జ్యోతి (దర్వన రాజేంద్రన్) ఎవరు? చివరకు శక్తి సుందరం కుట్రలకు ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే పేట్రియాట్ సినిమా కథ.

Also Read
RGV's Obsession Review: రాంగోపాల్ వర్మ అబ్సెషన్ మూవీ రివ్యూ
RGV's Obsession Review: రాంగోపాల్ వర్మ అబ్సెషన్ మూవీ రివ్యూ

స్కూల్ పిల్లలకు ఉచిత ల్యాప్‌టాప్‌ అంశంతో కథను ఎమోషనల్‌గా ప్రారంభించేందుకు దర్శకుడు మహేష్ నారాయణన్ ట్రై చేసినట్టు కనిపిస్తుంది. కానీ అదంతా డాక్యుమెంటరీ మోడ్‌లో రన్ కావడంతో కొంత క్యూరియాసిటీ తగ్గించేలా చేస్తుంది. అలాగే డేనియల్ జేమ్స్‌పై జరుగుతున్న కుట్రలకు, దేశాన్ని విడిచిపోవడం అంశాలతో కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లడానికి ఎక్కువ సమయమే తీసుకోవడం వల్ల కొంత సహనానికి పరీక్షలానే ఉంటుంది. సెకండాఫ్‌లో రహీం నాయక్, మైఖేల్, లతిక, జ్యోతి పాత్రల వల్ల సినిమాలోను, కథలోను వేగం పెరుగుతుంది. చివరి 30 నిమిషాల్లో ఫాహద్ ఫాజిల్, మమ్ముట్టి, మోహన్ లాల్, నయనతార మధ్య జరిగే సన్నివేశాలు హై డ్రామాను క్రియేట్ చేస్తాయి. ముగింపు కొంత రొటీన్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది.

Recommended For You
పెద్ది థియేటర్‌లో ఒకే ఒక్కడు.. రాంచరణ్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ ఇంత దారుణంగానా?
పెద్ది థియేటర్‌లో ఒకే ఒక్కడు.. రాంచరణ్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరీ ఇంత దారుణంగానా?

ఈ చిత్రంలోని టాప్ హీరోలు, ఆర్టిస్టుల కలయికతో సన్నివేశాలన్నీ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ మూవీలోని పాత్రలు వేటికి అవే శక్తిమంతంగా ఉంటాయి. డేనియల్ జేమ్స్‌గా మమ్ముట్టి, రహీం నాయక్‌గా మోహన్ లాల్, శక్తి సుందరంగా ఫాహద్ ఫాజిల్, లతికగా నయనతార ఎవరికి వారే తమ పాత్రల స్వభావం, పరిధి మేరకు ఒదిగిపోయారు. మోహన్ లాల్‌ను దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆ పాత్రను కొంత పెంచితే ఇంకా బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. మమ్ముట్టి పాత్రను ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించాల్సింది. విలన్ పాత్రలో ఫాహద్ ఇంకా బెటర్‌గా ప్రజెంట్ చేసే ఛాన్స్ ఉన్నా ఆ ప్రయత్నం చేయలేకపోయారనిపిస్తుంది. దర్శన రాజేంద్రన్ కూడా ఎమోషనల్ క్యారెక్టర్‌లో కనిపించారు.

You May Also Like
Peddi Box Office: పెద్ది డిజాస్టర్ కలెక్షన్లు.. పీకల్లోతు నష్టాల నుంచి బయటపడాలంటే?
Peddi Box Office: పెద్ది డిజాస్టర్ కలెక్షన్లు.. పీకల్లోతు నష్టాల నుంచి బయటపడాలంటే?

ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మనుష్ నందన్ సినిమాటోగ్రఫి, సుషిన్ శ్యామ్ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు బలంగా కనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ఎడిటింగ్ విభాగం తడబాటు కనిపించినప్పటికీ.. సెకండాఫ్‌లో సన్నివేశాలు బలంగా ఉండటం, కథ వేగంగా సాగడం వల్ల వారి పనితనం ఏమిటో తెలిసేలా చేసింది. అంటో జోసెఫ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

పెద్ది ముందు సోమవారం అగ్నిపరీక్ష.. ఆదివారం రాంచరణ్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?
పెద్ది ముందు సోమవారం అగ్నిపరీక్ష.. ఆదివారం రాంచరణ్ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?

పేట్రియాట్ సినిమా కథ విషయానికి వస్తే.. ఎమోషనల్, హై ఇంటన్స్ పాయింట్‌తో రూపొందింది. వాటికి తోడు సూపర్ స్టార్స్ అందరూ తమ వంతుగా ఈ సినిమాను ఇంపాక్ట్‌ఫుల్‌గా చేశారు. ఫస్టాఫ్‌లో కొంత ల్యాగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో డైరెక్టర్ డీల్ చేసిన విధానం బాగుంటుంది. హై లెవెల్ స్టార్ వ్యాల్యూ ఉన్న ఈ సినిమాను ఓటీటీలో తీరిగ్గా చూసుకొవచ్చు. సూపర్ స్టార్స్ పెర్ఫార్మెన్స్‌ను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కుతుంది.

Read more about: Patriot mohanlal mammootty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X