Patriot Movie Twitter Review: పేట్రియాట్ మూవీ ట్విట్టర్ రివ్యూ

మలయాళ చిత్ర పరిశ్రమకు దశాబ్ధాలుగా ఐకాన్స్‌గా వెలుగొందుతున్నారు మోహన్‌లాల్, మమ్ముట్టి. లేటు వయసులోనూ ఈ ఇద్దరు నట దిగ్గజాలు కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీ ఇస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్‌లాల్- మమ్ముట్టి కలిసి నటించిన మూవీ పేట్రియాట్. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాహద్ ఫాజిల్, కుంచకో బోబన్, నయనతార, దర్శన, రేవతి, రాజీవ్ మీనన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుశిన్ శ్యామ్ సంగీత దర్శకత్వం వహించగా.. మానుష్ నందన్ సినిమాటోగ్రాఫర్‌గా, మహేశ్ నారాయణన్, రాహుల్ రాధాకృష్ణన్‌లు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

దేశభక్తి, యాక్షన్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మే 1న వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేట్రియాట్ మూవీపై నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాలను పరిశీలిస్తే..

Patriot Movie Twitter Review in Telugu  Is Mammootty and Mohanlal s Movie hits the bulls eye

పేట్రియాట్ నాకైతే ఫస్టాఫ్ అంత గొప్పగా అనిపించలేదు. సుశిన్ శ్యామ్ ఎప్పటిలాగే అదరగొట్టేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. మమ్ముట్టి ఇంట్రడక్షన్ కాస్త బలహీనంగా అనిపించినా.. ఇంటర్వెల్ సీన్ మాత్రం బ్లాస్టింగే. మోహన్‌లాల్ ఇంట్రడక్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

పేట్రియాట్ ఫస్టాఫ్ ఇప్పుడే పూర్తయ్యింది. ఇంటర్వెల్ దగ్గరి నుంచి సినిమా వేగం పుంజుకుంది. నెమ్మదిగా ఉన్నా ఆసక్తికరంగానే ఉంది. ఫస్టాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ ఎంగేజింగ్‌గానే అనిపించింది. సెకండాఫ్ మీదే సినిమా ఆధారపడి ఉందని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

మోహన్‌లాల్ ఎంట్రీ పగలబడి నవ్వేలా చేసింది. ఈ జోకర్‌ని చూసి థియేటరంతా నవ్వుతున్నారు. భరించలేనంత ఇబ్బందికరంగా సాగుతోంది. ఇప్పటి వరకు చాలా బోర్ కొడుతోంది. ఫస్టాఫ్ దారుణం, సినిమా ఎప్పుడు ముగుస్తుందా అని వెయిట్ చేస్తున్నా. కథనం చాలా చప్పగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

మహేశ్ నారాయణన్ దర్శకత్వం దారుణం. మమ్ముట్టి పాత్ర వేస్ట్ అయ్యింది. మోహన్‌లాల్ డమ్మీ అతిథి పాత్రలో కనిపించారు. ఫహద్ ఫాజిల్ పాత్ర చాలా బహీనంగా ఉంది. సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏమాత్రం బాలేదు. నయనతార పాత్ర వేస్ట్, బోరింగ్ స్క్రీన్ ప్లే, కథ కూడా బాలేదు. దీనికి నా రేటింగ్ 1.5/5 అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

పేట్రియాట్ పర్వాలేదు. ఎంతో అద్భుతంగా ఉన్న ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ వెలవెలబోయింది. ఒక మోహన్‌లాల్ అభిమానిగా, అతన్ని విభిన్నమైన, అనూహ్యమైన పాత్రలో చూడటం ఆసక్తికరంగా అనిపించింది. ఇది ఒక సానుకూల అంశం అయినప్పటికీ ఆయన పాత్ర అంత సంతృప్తికరంగా లేదని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.

పేట్రియాట్ మూవీ.. కార్పోరేట్‌ల స్పైవేర్ నిఘాను బయటపెట్టే కథాంశం. కంటెంట్ బేస్డ్ మూవీ. ముమ్ముట్టి ఒక అసమ్మతివాదిగా కనిపిస్తే.. మోహన్‌లాల్ మంచి జోష్ నింపారు. ఒక క్లాస్ అటెంప్ట్.. కొన్ని మాస్ సన్నివేశాలే అయినా ఎంతో ప్రభావంతంగా ఉన్నాయి. కొన్ని వాస్తవ సంఘటనల నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంది. మహేశ్ మేకింగ్ బాగుందని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.

పేట్రియాట్ సినిమా మొత్తం స్కామ్‌లు, కార్పోరేట్ విలన్లు, ఇంటెలిజెన్స్, పిల్లి- ఎలుక ఆటలా ఉంటుంది. ఇలాంటి కథను నేను ఎన్నో భాషలలో ఎన్నోసార్లు చూశా. చాలా నిడివితో విసుగు పుట్టించేలా ఉంది. ఆ మల్టీస్టార్ భారీ బడ్జెట్ బాంబ్ కథ.. మలయాళానికి అస్సలు సరిపోదు. కేవలం లాలెట్టన్ సమయాన్ని వృథాచేయడమేనని ఓ అభిమాని పోస్ట్ పెట్టాడు.

ఇది ఒక సాధారణ మాస్ మసాలా వినోద చిత్ర కాదు. సామాజిక బాధ్యత కలిగిన ఈ సినిమాలో ఆకట్టుకునే వావ్ ఫ్యాక్టర్ కాస్త లోపించినప్పటికీ బిగ్ ఎం అద్భుతమైన నటన, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు, సుషిన్ శ్యామ్ సంగీతం మాత్రం అమోఘం. ఇది ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాల్సిన ఒక నాణ్యమైన చిత్రం. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5 అని ఓ యూజర్ రివ్యూ పెట్టాడు.

ఇది మరీ చెత్త సినిమా ఏమీ కాదు, కానీ గొప్పగానూ లేదు. విసుగుపుట్టించేలా, సాగదీసినట్లుగా ఉంది. కొన్ని చోట్ల వినోదాత్మకంగా ఉన్నప్పటికీ, చాలా భాగాలను చూస్తున్నప్పుడు ఎందుకు? నాకు అనిపించింది. మోహన్‌లాల్‌ను సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తోంది. అతిథి పాత్రలు అంతగా ఆకట్టుకోవు. వారు మోహన్‌లాల్‌ను చూసిన తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆయన ఈ పాత్ర చేయడానికి అస్సలు ఒప్పుకోకూడదు. స్క్రీన్‌ప్లే ఇంకా పకడ్బందీగా ఉంటే బాగుండేది. కథ పాతదే, కథనం కూడా ఊహించినట్లే ఉంది అని అభిమాని రాసుకొచ్చాడు.

Read more about: mammootty mohanlal Patriot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X