For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హే 'రామ్ బాబు' ('...గంగతో రాంబాబు' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5
  అప్పట్లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో సమకాలీన అంశాలను ప్రతిబంబిస్తూ భారత్ బంద్, జెండా వంటి పూర్తి స్ధాయి పొలిటికల్ సెటైర్ సినిమాలు వచ్చేవి. ఈ మద్య కాలంలో అలాంటి సినిమాలు రావటం లేదు. ఆ లోటుని తీర్చడానికా అన్నట్లు పవన్ కళ్యాణ్ తో పూరీ ఈ చిత్రాన్ని దించాడు. అయితే అలాంటి సెటైర్ సినిమాలకు సాధారణంగా స్టార్స్ పెద్దగా హెల్ప్ కారు కానీ మైనస్ అవుతూంటారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలపై అభిమానులకు కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని వ్యంగ్య బాణాలతో రీచ్ అవటం కష్టమే. అందులోనూ మెగా రేంజి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ స్ధాయి వారికి ఇలాంటి సినిమాలు కష్టమే అనిపిస్తాయి. అప్పటికీ పవన్ తనదైన శైలిలో పవర్ ఫుల్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కథ, కథనం కలిసిరాలేదు. అయితే పవన్ వంటి స్టార్ తనదైన శైలిలో రాజకీయాలు, తమ చుట్టు ప్రక్కల జరుగుతున్న విషయాల పట్ల ప్రేక్షకులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయటం మాత్రం అభినందించదగ్గ విషయం.

  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  బ్యానర్: యూనివర్సల్ మీడియా,
  నటీనటులు పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
  ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
  సంగీతం: మణిశర్మ
  ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా,
  ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్,
  ఫైట్స్: విజయ్,
  స్టిల్స్: మాగంటి సాయి,
  కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్,
  సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ,
  నిర్మాత: డి.వి.వి దానయ్య,
  కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  ఓ మామూలు మెకానిక్ రాంబాబు(పవన్) మీడియాలో వచ్చే వార్తలు చూసి అన్యాయాలను ఎదిరిస్తూంటాడు. అదే రీతిలో ఓసారి రాష్ట్రంలో రగిలిన కులచిచ్చుని ఆర్పి మీడియాలో హైలెట్ అవుతాడు. దాంతో ఈ మెకానిక్ బయిటకన్నా తమ మీడియాలో ఉంటే సమాజాన్ని రిపేర్ చేస్తాడని భావించిన కెమెరామెన్ గంగ (తమన్నా) అతనికి జర్నలిస్టుగా తను పనేచేసే ఛానెల్ లో జాబ్ ఇప్పిస్తుంది. రెంచ్ వదిలి మీడియా మైక్ పట్టుకున్న అతను మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) కీ, అతను కుమారుడు రానాబాబు(ప్రకాష్ రాజ్)కి తలనొప్పిగా మారతాడు. మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలనే రానాబాబు పొలిటికల్ ప్లాన్స్ ని అతను మీడియా ద్వారా బయిట పెట్టి వారిని రోడ్డున పెట్టేస్తాడు. అప్పుడు వారు ఎలా అతన్ని అడ్డు తొలిగించుకోవాలనుకున్నారు.. దానికి రాంబాబు ఎలా కౌంటర్ ఇచ్చి రాష్ట్ర్రాన్ని కాపాడాడు అనేది మిగతా కథ.

  టైటిల్ చూసిన చాలా మంది ఇది టీవి మీడియాలో జరిగే వ్యవహారాలను,పోటీని, న్యూస్ తయారయ్యే విధానం వంటి వాటిని వ్యంగ్యంగా చూపిస్తారని ఫిక్స్ అయి వస్తారు. అయితే ఈ చిత్రం వాటినేమీ టచ్ చేయకుండా ఓ పొలిటీషియన్ ని సిఎం కాకుండా ఓ జర్నలిస్టు ఎలా అడ్డుకున్నాడనే వాటితోనే సరిపోతుంది. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ప్రకాష్ రాజ్ ప్రారంబించిన ఉద్యమంతో నింపేయటం జరిగింది. అలాగే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓ పాట,ఓ ఫైట్, ఓ డైలాగు, ఓ కామెడీ బిట్ అన్నట్లు రొటిన్ గా పూరీ నడిపారు. క్లైమాక్స్ డైలాగుతో సినిమా నిలబెడుతుందనుకున్నారు కానీ తేలిపోయింది. ఇక ఫస్టాఫ్ లో అలీ ,సెకండాఫ్ లో బ్రహ్మానందంని ఛానెల్ పోగ్రమ్ హెడ్స్ గా పెట్టి కామెడీ పండించే ప్రయత్నం చేసారు కానీ అవీ పెద్దగా పండలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్...ఓ సాధారణ రిపోర్టర్ అయ్యిండి ఓ స్ధాయి వారిని కూడా వారిని చాచి లెంపకాయ కొట్టడం,దాన్ని ఎవరూ ఎదిరించకుండా ఓకే పెద్ద హీరో కొట్టాడు అన్నట్లుగా పట్టించుకోకుండా పోవటం వంటివి వాస్తవ విరుద్దంగా అనిపిస్తాయి. పాటల్లో మొదటి సాంగ్ కి పవన్ వేసిన స్టెప్స్ సూపర్బ్ గా ఉన్నాయి. అలాగే ఎక్ట్రార్డనరీ సాంగ్ కూడా బాగుంది. మణిశర్మ ఎప్పటిలాగే రీరికార్డింగ్ చాలా బాగా చేసారు. సినిమాకు అది చాలా బాగా ప్లస్ అయ్యింది.

  ముఖ్యంగా గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కి పెరిగిన క్రేజ్ ను ఈ సినిమా అస్సలు రీచ్ కాదు. పవన్ కళ్యాణ్ నుంచి మాస్ ప్రేక్షకులు, అభిమానులు ఆశించి ఎలిమెంట్స్ ని పెద్దగా లేకుండా చేయటంతో నిరాశకలుగుతుంది. అయితే పవన్ కల్యాణ్ తన సినిమాతో నేడు దేశంలో రాజకీయనాయకులు తమ అవసరాలు కోసం జరుపుతున్న ఉద్యమాలను ఎండగట్టే ప్రయత్నం చేయటం శభాష్ అనిపిస్తుంది. ఇక పూరీ మీడియాని ఉద్దేశించి... వుంచుకోవటానికి ఉయ్యాల ఊగటానికి... మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు వంటి డైలాగులు చెప్పించటం బాగుంది. అలాగే బ్రహ్మనందం పాత్రను అడ్డం పెట్టుకుని ప్రస్తుతం టీవీ ఛానెల్స్ లో మసాలా కలిపి వార్తలను ప్రెజెంట్ చేసే విధానాన్ని చురకలు వేయటం బాగుంది.. ముఖ్యంగా... "ఒరేయ్ నిన్ను ప్రకాష్ రాజ్ గురుంచి చెప్పమంటే- నాగార్జున గురంచి, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకురా.. వాడికి అసలే తిక్క ఎక్కువ ఎప్పుడు వచ్చి నడి రోడ్డు లో కాల్చి దొబ్బేస్తాడు"అని పవన్ తన గురించి తానే చెప్పుకున్నప్పుడు దియోటర్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది.

  అలాగే బిజినెస్ మ్యాన్ తరహాలో పూరీ జగన్నాధ్ ఈ చిత్రంలోనూ తన సినిమా చూసే వారికి ఏదో ఒకటి చెప్పాలనే తపన ఉన్నట్లు చాలా చోట్ల కనపడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో చెప్పే భారీ డైలాగ్స్..మహేష్ క్లైమాక్స్ లో చెప్పే తరహాలో ఉంటాయి. అయితే కేవలం డైలాగుతో పవన్ వంటి మాస్ స్టార్ క్లైమాక్స్ ని చూడటం కష్టమే అనిపిస్తుంది. తమన్నా విషయానికి వస్తే... ఆమె ఈ చిత్రంలో పవన్ కి పోటీ పడి మరీ చేసిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ 'ఏవండీ... మీరు' అని గౌరవంగా పిలిస్తే, ఆమె అతన్ని 'నువ్వు' అని సంబోధించటం బాగుంది. తమిళనాడు కరుణానిధిని గుర్తు చేస్తూ సాగిన కోట గురించీ,ప్రకాష్ రాజ్ పాత్రలకు గురంచి కొత్తగా చెప్పేదేమీ లేదు. వారు ఎప్పటిలాగే బాగా చేసారు. టెక్నికల్ గా ఎడిటింగ్, కెమెరా వర్క్ బాగున్నాయి. ముఖ్యంగా బోర్ కొట్టకుండా స్పీడుగా నడపటంలో షార్ప్ ఎడిటింగ్ బాగా హెల్ప్ చేసింది.

  పైనల్ గా పవన్ అబిమానులకు నచ్చే ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది. అయితే తను మాస్ హీరో అయ్యి ఉండి కూడా ఇలాంటి పొలిటికల్ సెటైర్ చిత్రం ఒప్పుకుని,సామాజిక చైతన్యం కలిగించాలనే పవన్ ఆలోచనను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

  English summary
  Cameraman Ganga Tho Rambabu can be called a political satire. Cameraman Ganga Tho Rambabu is an action movie and Pawan Kalyan's electrifying performance is the main attraction in the film. Puri Jagannath's message-oriented story and punch dialogues, Mani Sharma's hit music, Shyam K Naidu's excellent camerawork, stunning choreography of action and dance sequences, Bramhanandam's comedy, beautiful artwork, costumes and locations are its other highlights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X