పంచ్‌ల కింగ్ ('గబ్బర్‌ సింగ్‌' రివ్యూ)

By Srikanya

-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు
ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
ఎడిటింగ్: గౌతంరాజు
సమర్పణ: శివబాబు.
నిర్మాత: బండ్ల గణేశ్
మాటలు-మార్పులు-దర్శకత్వం: హరీష్‌శంకర్‌
విడుదల తేదీ: 11, మే 2012

"నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ... నాతో ఎవరూ పోటీకి రారు,రాలేరు.."అంటూ పవర్ ఫుల్ పంచ్ డైలాగుతో, ఫ్యాన్స్ కి కిక్కిచ్చే డాన్స్ లతో పవర్ స్టార్ ప్రభంజనంలా దూసుకొచ్చేసాడు. పంజా వంటి పెద్ద ప్లాప్ తర్వాత తన అభిమానులు కూడా నిరాశ చెందారనుకున్నారో ఏమో గానీ.. పూర్తిగా తనదైన శైలిలో ఫైట్స్, స్టైప్స్ తో గబ్బర్ సింగ్ పాత్రను అడ్డం పెట్టుకుని పవన్ చెలరేగిపోయాడు. దబాంగ్ రీమేక్ గా వచ్చినా... చాలా భాగం కథ, కథనం మార్చి.. హరీష్ శంకర్ తన కలం బలం చూపించి మాస్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసాడు. సెకండాప్ కొద్దిగా స్లోగా సాగినట్లున్నా ఓవరాల్ గా ఫ్యాన్స్ కి విందు భోజనంలా, సామాన్య ప్రేక్షకులుకు మంచి కిక్కు ఇచ్చే సినిమాగా సినిమాని తీర్చిదిద్ది విజయం సాధించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి సీన్, కెవ్వు కేక పాట సినిమాకి యూఎస్‌పిలా నిలుస్తాయి.


చిన్నప్పుడు షోలే సినిమా తెగ చూసి అందులో గబ్బర్ సింగ్ పాత్రను విపరీతంగా ప్రేమించి తన పేరుని గబ్బర్ సింగ్ గా మార్చుకున్న పోలీస్ అధికారి వెంకటరత్నం నాయుడు(పవన్ కళ్యాణ్). చాలా కాలం తర్వాత తన సొంత ఊరు కొండవీడు కి ట్రాన్సఫర్ అయి వస్తాడు. అతనొచ్చే సమయానికి లోకల్ గూండా సిద్దప్ప నాయుడు (అభిమన్యు సింగ్)కి రాజకీయంగ ఎదగటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు. అయితే కాస్త తిక్క ఉన్న గబ్బర్ సింగ్ కి అతని విలనీ ఛేష్టలు నచ్చక ఎటాక్ ఇచ్చి అడ్డుపడతాడు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్యా టామ్ అండ్ జెర్రీ తరహా గేమ్ స్టార్ట్ అయ్యి అది వార్ గా మారుతుంది. లోకల్‌గా ఎంతో పట్టు ఉన్న విలన్‌కి ఎలా అడ్డుపడి గబ్బర్ సింగ్ ఆ ఊరుని రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో అతను ఏమి పోగొట్టుకున్నాడు.. ఏమి సాధించాడు.. భాగ్య లక్ష్మి(శృతి హాసన్)తో అతని ప్రేమ కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

బాలీవుడ్ సూపర్ హిట్ దబాంగ్ రీమేక్‌గా వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం ఒరిజనల్ స్టోరీలైన్ .. కొన్ని కీ సీన్స్ మాత్రం తీసుకుని చేసుకున్న కథ. ముఖ్యంగా అజయ్ పాత్రను తగ్గించి, అతని లవ్ స్టోరీని తీసేయటం, విలన్ పాత్ర నిడివి పూర్తిగా పెంచటం వంటివి ఈ సినిమాకు ప్రాణం పోసాయి. ఆ యాంగిల్‌లో ఈ రెండు సినిమాలు పోల్చి చూస్తే... దబాంగ్ క్లాసిక్ అయితే, గబ్బర్ మాస్ మసాలా చిత్రం అనాలి. అలాగే సినిమా ప్రారంభంలో షోలో చిత్రంలోని గబ్బర్ సింగ్ పాత్రతో సినిమాను ప్రారంభించటంతో హీరో క్యారెక్టర్ కి డెప్త్ వచ్చింది. ఇక సినిమా సెకండాఫ్ లో వచ్చే అంత్యాక్షరి, బ్రహ్మానందం... కటౌట్ పట్టుకుని విలన్ ఇంటికెళ్లే సీన్, పవన్ రిక్షాలో.. ఈ పేటకు నేనే మేస్తిరి పాటతో ఎంట్రీ ఇవ్వటం వంటివి బ్రహ్మాండంగా పేలాయి. మొదటి నుంచే హరీష్ శంకర్ చెప్తున్నట్లు పూర్తిగా ప్యాన్స్‌కి ఏమి కావాలో వాటిని సరైన ప్లేసులో పేల్చి శభాష్ అనిపించుకున్నాడు. అంతేగాక ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫైట్ కూడా దబాంగ్‌లో లేనిది క్రియేట్ చేయటం బాగా ప్లస్ అయ్యింది.

ఇక ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టన్మెంట్ తో నడవటం.. సెకంఢాప్ పూర్తిగా విలన్, హీరోకి మధ్య గేమ్‌లా కథ నడవటంతో సినిమా ఫేజ్ మార్చుకుని స్లో అయిన ఫీలింగ్ వచ్చింది. అయితే ప్రీ క్లైమాక్స్‌కి వచ్చే సరికి కెవ్వు కేక పాట నుంచి మళ్ళీ ఊపందుకుంది. పాటల్లో .. టైటిల్ సాంగ్, పిల్లా పాట, కెవ్వు కేక పాటకు బాగా రెస్పాన్స్ వచ్చింది. డైలాగుల్లో "గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటము అంటే పారిపోవటం కాదు.. పైకి పోవటం", "పేరంటం అన్నాక లేడీసు పేకాట అన్నాక పోలీసులు రావడం మామూలేరా.. ఎవరి తాంబూలం వారికిచ్చేయాలి".. వంటివి అనేకం టప్పట్లు కొట్టించుకున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి నాటి స్టైల్స్, మ్యానరిజమ్స్‌ని చూపి ఫ్యాన్స్‌ని ఆనందపరిచే ప్రయత్నం చేసాడు. సినిమాలో మైనస్ అయితే శృతిహాసన్ అని చెప్పాలి. ఆమెకు డబ్బింగ్ కూడా సరిగ్గా కుదరలేదు. దాంతో వీరిద్దరి మధ్యా లవ్ సీన్స్ కూడా పెద్దగా పండలేదు.

మిగతా ఆర్టిస్టులలో బ్రహ్మానందం నవ్విస్తే, అలీ సపోర్టింగ్ క్యారెక్టర్‌గా డైలాగులకే పరిమితం అయ్యారు. హ్యాఫీడేస్ ఫేమ్ గాయత్రి పాత్రకు పర్పస్ లేకుండా పెట్టారు. ఆమె పాత్ర కాస్త వల్గారిటి తెచ్చిపెట్టడం తప్ప ప్రయోజనం లేదు. తణికెళ్ల భరిణి, అభిమన్యు సింగ్ బాగా చేస్తే, కోట వంటి ఆర్టిస్టుకు పెద్దగా సీన్స్ లేకుండా చేసారు. కోట పాడిన పాట కూడా పెద్దగా పేలలేదు. టెక్నికల్ గా కెమెరా, ఎడిటింగ్ వంటి కీలక విభాగాలు వంక పెట్టలేని విధంగా సాగాయి.

ఫైనల్ గా... పూర్తిగా ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ తీసిన ఈ చిత్రం అన్ని వర్గాలకు నచ్చేటట్లు ఉంది. దబాంగ్ తో పోల్చి కాకుండా చూస్తే స్క్రిప్టు కూడా బాగుందనిపిస్తుంది. పంచ్ డైలాగులు ఎంజాయ్ చేయటానికి,చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి జోష్ తో చేసిన చిత్రం గా చూడటానికి ఈ సినిమాకి వెళ్లవచ్చు. ఈ వేసవిలో ఈ చిత్రం ఫ్యామిలీలకు కూడా పడితే ఓ రేంజి విజయం సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X