»   » బోర్ అండ్ బుల్లెట్ సౌండ్స్ ('సర్దార్ గబ్బర్ సింగ్' ..గట్స్ అండ్ గన్స్ రివ్యూ)

బోర్ అండ్ బుల్లెట్ సౌండ్స్ ('సర్దార్ గబ్బర్ సింగ్' ..గట్స్ అండ్ గన్స్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.5/5

'ఈ సినిమా నా అభిమానులకు అంకితం ' అంటూ పవన్ సంతకంతో మొదలయ్యే ఈ సినిమా ఆ ఒక్క లైన్ లోనే టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది చెప్పేసారు అనిపిస్తుంది. సినిమా పూర్తిగా అభిమానుల కోసమే, వారికి నచ్చి, చప్పట్లు కొట్టే సీన్స్ తోనే రెడీ చేసారు. ఆ సీన్స్ ని ఓ కథగా చెప్పాలి కాబట్టి వాటి చుట్టూ ఓ పలచటి రెగ్యులర్ పరమ రొటీన్ కథనం అల్లేసారు. దాంతో ఈ అభిమాన ప్రయత్నం సగటు ప్రేక్షకుడుకి కాస్త కష్టంగానే అనిపిస్తుంది.

పోనీ ఈ రోజుల్లో పెద్ద సినిమాలు ఫ్యాన్స్ కోసం కాక అందరి కోసం తీస్తున్నారా అని ఎడ్జెస్ట్ అవుదామన్నా... సినిమా కథలో ఎక్కడా స్పష్టత కనపించదు. పోనీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసేస్తారు అదిరిపోతుంది అంటే అదీ దానికి తగ్గట్లే నీరసంగా నడుస్తూంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుడు లీనం కావటానికి కావల్సిన ఎమోషన్ ఆ పాత్రలో దొరకదు. అప్పుడు కేవలం ఎమోషన్ లెస్ వన్ మ్యాన్ షో చూస్తున్న ఫీలింగ్...అప్పటికీ , అక్కడక్కడా పవన్ చేసే ఫన్ ...నవ్విస్తూండటం కలిసి వచ్చే అంశం.


ఫొటోస్: సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


ఈ సినిమా కొత్తగా ట్రై చేయాలనుకుని పవన్ చేసిన పాత ప్రయత్నం. ఎందుకో పవన్ లో ఎప్పుడూ మెరిసే ఆ పవర్, జోష్ కనపడలేదు. అన్ని భాధ్యతలూ భుజాన వేసుకోవటం మూలాన్నో లేక మరెందుకో గానీ తను క్రియేట్ చేసిన క్యారక్టర్ లోకి పవనే వెళ్లలేకపోవటం జరిగింది. అయితే ఈ సినిమా వేరే హీరో చేసుంటే చివరిదాకా చూడలేం ..కేవలం ఈ మాత్రమైనా బాగుంది అనిపించిందంటే కేవలం పవన్ ఛరిష్మా అనే చెప్పాలి.


కథ ఏంటంటే...


రత్తన్ పూర్ ప్రాంత రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) ఓ కిరాతుకుడు. ఆ ప్రాంతంలోని మైనింగ్ ని చేజిక్కించుకోవటం కోసం...పంట భూములను అక్రమంగా ఆక్రమించుకుని రైతులును ఇబ్బందులు పెడుతూ...ఊరిని నాశనం చేస్తూంటాడు. మరో ప్రక్క అక్కడ రాజ సంస్థానంలో అప్పుల్లో కూరుకుపోయి.. ఆ సంస్థానానికి సంబందించిన ఛారిటిలు నడపటం కోసం...తమ ఇంట్లో వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఆ కుటుంబీకులు ఉంటారు.


తమ రాజమహల్ ని ఓ హోటల్ వారికి అప్పగించేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆ కుటుంబం భావిస్తుంది. అయితే భైరవ్ సింగ్ మాత్రం ఆ ప్రయత్నం ముందుకు సాగనీయడు. అప్పుడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ (పవన్‌ కల్యాణ్‌) సీఐగాఆ ప్రాంతానికి ట్రాన్సఫర్ పై వస్తాడు.


సర్దార్ గబ్బర్ సింగ్ లేటెస్ట్ ఫొటోస్


నానా ఇబ్బందుల్లో, దుస్దితిలో ఉన్న రతన్‌పూర్‌ ని, ఆ రాజకుటుంబాన్ని ఎలా భైరవ్ సింగ్ కబంధ హస్తాల నుంచి కాపాడాడు.. అడుగడుగునా అడ్డుపడే భైరవ్ సింగ్ నుంచి తప్పించుకుంటూ...అక్కడి సమస్యల్ని ఎలా తీర్చాడు అన్నదే సర్దార్‌ కథ.


అలాగే..రతన్ పూర్‌లో సర్దార్ కి పరిచయమైన రాజ కుమారి అర్షిని (కాజల్)తో అతడి ప్రేమ ప్రేమ వ్యవహారం ఏమైంది? అర్షిని కుటుంబానికి, భైరవ్ సింగ్‍కి ఉన్న గొడవలేంటీ? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


'ఆయన డబ్బుకు, భయానికి లొంగడు.. ఆయనకి మీరు వోన్‌ అవ్వాలంటే.. ముందు ట్యూన్‌ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్‌ అవ్వాలి' వంటి పవర్ ప్యాక్ డైలాగులు బ్యాక్ గ్రౌండ్ లో వస్తూండగా... 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' ఈ రోజే స్లైల్ గా ధియేటర్లలో దిగేసారు. అభిమానులకు నచ్చేసారు..లేదు లేదు అభిమానులకు మాత్రమే నచ్చాడు అనిపించింది.


ఈ డైలమాకు కారణం.. కేవలం అభిమానులు చప్పట్లు కొట్టడానికి సరిపడేటట్లు సీన్స్ రాసుకుని, వాటిని కలపటానికి ఓ కథ అల్లి అందించిన ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి కష్టమే అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించినా సెకండాఫ్ ప్రారంభం నుంచి విసిగిస్తుంది. ఎంతో పవర్ ఫుల్ గా చూపించిన విలన్ సైతం... ఎదురు ఉన్నది పవర్ స్టార్ పవన్ అని తెలిసిపోయి సైలెంట్ అయ్యిపోయాడనిపిస్తుంది. దాంతో ప్యాసివ్ హీరోయిజందే రాజ్యం. హీరో ఆడిందే ఆట..పాడిందే పాట..మనకు మాత్రం ఎన్నో సార్లు చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూస్తున్న ఫీలింగ్..


ఇక్కడా అంతే..

ఇక్కడా అంతే..

పవన్‌ కల్యాణ్‌ సినిమాలో హీరోయిన్‌ లేకపోయినా ఫర్వాలేదు కానీ గన్నులూ, గుర్రాలూ ఉండాల్సిందే. తన సినిమాల్లో బుల్లెట్ల వర్షం కురిపించడం, స్టైల్‌గా గుర్రాన్ని నడిపించుకొంటూ రావడం పవన్‌కి సరదా. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లోనూ అంతే జరిగింది. అదొక్కటే హైలెట్ అయ్యేలా చూసుకున్నారు.


రిస్క్ ఊహించినా

రిస్క్ ఊహించినా

ఒక సినిమా భారీగా హిట్టైన తర్వాత దాని సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ..ఏది చేయాలన్నా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో సేఫ్ కానీ, ప్రాజెక్టు పరంగా ఎప్పుడూ రిస్కే అని సినిమా గత చరిత్ర గట్టిగానే చెప్తోంది. అయితే ఈ రిస్క్ ని పవన్ ముందే ఊహించే ఫ్రాంచైజ్ చేసినట్లున్నారు. కానీ అదే ప్లస్, మైనస్ అయ్యింది.


గబ్బర్ సింగ్ తో పోలిక

గబ్బర్ సింగ్ తో పోలిక

పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ స్దాయిలో ఉంటుదంనుకుని వచ్చినవాళ్లకు ఆ సినిమాలో సగం కూడా లేకోపోవటం నిరాశ కలిగించే అంశం. ఈ పోలిక రావటానికి కారణం..సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్రాంచైజ్ కావటమే.


అదే ...

అదే ...

ఇక వెస్ట్ర్రన్ సినిమాలను తలపిస్తూ...కౌబాయ్ లుక్ తో పవన్ చేసే విన్యాసాలు బాగున్నాయి. అయితే వచ్చిన ఇబ్బంది అంతా...దాదాపు అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ రావటంతోనే


హైలెట్స్

హైలెట్స్

సినిమా హైలెట్స్ లో చెప్పుకోవాల్సింది...పవన్ సినిమాని తన కామెడీ టై మింగ్ తో మోయటం.అంతేకాదు..

అంతేకాదు..

క్లైమాక్స్ పార్ట్‌లో పవన్ ప్రయత్నించిన చిరు వీణ స్టెప్, ఫస్టాఫ్‍లో వచ్చే చిన్న చిన్న కామెడీ బిట్స్, కాజల్‍తో రొమాన్స్ ట్రాక్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా డిజైన్ చేసారు.


మగధీర గుర్తుకు వస్తుంది

మగధీర గుర్తుకు వస్తుంది

మగధీరలో రాకుమారిగా చేసిన కాజల్ మరోసారి ఇక్కడ కూడా రాకుమార్తిగా అదరకొట్టింది. అంతేకాదు తన ఏక్టింగ్ తో కూడా మురిపించింది.వంక పెట్టలేని విధంగా

వంక పెట్టలేని విధంగా

విలన్‍గా నటించిన శరద్ కెల్కర్ కూడా అద్బుతంగా వంకపెట్టలేని విధంగా నటించాడు. అయితే అతని క్యారక్టరేషన్ లో ఉన్న లిమిట్స్, స్క్రీన్ ప్లే లోపాల తో కథకు హెల్ప్ కాలేకపోయాడు.


దేవిశ్రీ లేపాడు

దేవిశ్రీ లేపాడు

సినిమాను ఉన్నంతలో తన పాటలు, రీరికార్డింగ్ తో లేపి నిలబెట్టే ప్రయత్నం చేసాడు. అయితే కొన్ని సన్నివేశాలను అతను ఏమి చేయలేకపోయాడు.


అదిరింది

అదిరింది

సినిమాలో రతన్ పూర్ అనే ఊహాజనిత ప్రాంతాన్ని నిజంగా అలాంటి ఊరు ఉందేమో అని బ్రాంతి కలిగేలా డిజైన్ చేసిన ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మకడిలి ని మెచ్చుకోవాలి.ఐటం సాంగ్

ఐటం సాంగ్

సినిమాలో రాయ్ లక్ష్మీ మీద డిజైన్ చేసిన తోబా తోబా ఐటం సాంగ్ హైప్ కు తగ్గట్లే సినిమాలో కూడా ఊపింది.ప్రత్యేకత లేదు

ప్రత్యేకత లేదు

ఈ సినిమాలో దర్శకుడు బాబీ చేసింది ఏమీ కనపడదు. ఆయన పనితనం, పవర్ ఉన్నప్పటి పనితన కూడా పవర్ స్టార్ సినిమాలో చూపించలేదు. తనదైన ముద్ర పవన్ వంటి హీరో దొరికినా వేయలేకపోయాడు.


ఫైట్స్ బాగున్నాయి కానీ..

ఫైట్స్ బాగున్నాయి కానీ..

సినిమాలో ఫైట్స్ ని రామ్ లక్ష్మణ్ తమ శక్తి యుక్తులు అన్నీ ఉపయోగించి డిజైన్ చేసారు. అయితే ఫైట్స్ కు లీడ్ చేసే ఎమోషన్ లేకపోవటంతో కొన్ని తేలిపోయాయి.జంప్ కట్స్

జంప్ కట్స్

సీన్స్ నేరేట్ చేసేటప్పుడు డైరక్టర్ ఎందుకు అన్ని జంప్ కట్స్ వాడుతున్నారో అర్దం కాదు. చాలా సీన్స్ చాలా ఇల్లాజికల్ గా, అర్దాంతరంగా ముగియటం, మొదలవటం జరిగాయి. క్లారిటీ మిస్సైపోయింది.


కంటెంట్ లేనప్పుుడు

కంటెంట్ లేనప్పుుడు

కంటెంట్ లేనప్పుడు కటౌట్స్ ఎన్ని ఉంటే ఉపయోగముంటుంది అన్నట్లు సినిమాలో కంటెంట్ విషయంలో సినిమా మొదటనుంచీ రాంగ్ స్టెప్స్ పడుతూ వచ్చాయి. దాంతో పవన్ ఎంత సినిమాని మోద్దామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.


సంగీత్ ఎపిసోడ్ లేకపోతే

సంగీత్ ఎపిసోడ్ లేకపోతే

సెకండాఫ్ లో సంగీత్ ఎపిసోడ్ లేకపోతే అసలు ఏమీ లేనట్లే..... దాంతో సంగీత్ ఎపిసోడ్ ని నమ్మే సెకండాఫ్ ని డిజైన్ చేసారా అనే డౌట్ కూడా వస్తుంది. కాకపోతే దాని కోసమే సినిమాకు వెళ్లాలి అంటే ఫ్యాన్ కానివాడికి కష్టమే.


సేఫ్ గేమ్

సేఫ్ గేమ్

డైరక్టర్ ఈ సినిమానూ పూర్తి స్దాయిలో పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ తీసారు. వాళ్లే మోసుకు వెళ్తారులే అనే ధైర్యంతో తీసినట్లుంది...


వీణ స్టెప్

వీణ స్టెప్

చిరంజీవిని అనుకరిస్తూ డైలాగులు చెప్పడం, వీణ స్టెప్పు వేయడం, శంకర్ దాదా ఎంబీబియస్ మూవ్ మెంట్స్ ...మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. కాకపోతే పవన్ వంటి పవర్ స్టార్ శ్రీను వైట్ల సినిమా తరహాలో ఎపిసోడ్స్ డిజేన్స్ చేస్తూ నడపాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది.


హైలెట్ అవ్వాల్సిన

హైలెట్ అవ్వాల్సిన

పవన్ సినిమాల్లో హెలెట్ అయ్యే... బ్రహ్మానందం, అలీ అంతగా నవ్వించలేకపోయారు. బ్రహ్మీ ట్రాక్ మరీ ఘోరం. పూర్తి స్దాయిలో ఫెయిలైంది.


ఎవరెవరు..

ఎవరెవరు..

బ్యానర్ :పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, రాయ్ లక్ష్మీ, సంజన, శరత్‌ కేల్కర్‌, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని, ముఖేష్‌రుషి, బ్రహ్మాజీ, కబీర్ సింగ్, పోసాని కృష్ణమురళీ, తదితరులు
ఛాయాగ్రహణం: ఆర్థర్‌ విల్సన్‌, ఆండ్రూ,
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా,
కూర్పు: గౌతంరాజు,
సంగీతం: దేవిశ్రీప్రసాద్
కళ: బ్రహ్మ కడలి,
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌.
క్రియేటివ్ హెడ్ : హరీష్ పై,
కథ,స్క్రీన్ ప్లే: పవన్ కళ్యాణ్
దర్శకత్వం: కె.ఎస్ రవీంద్ర (బాబి)
విడుదల తేదీ: 8, ఏప్రియల్ 2016.ఫైనల్ గా... పవన్ ...తన అభిమానులకు ట్రిబ్యూట్ ఫిల్మ్ గా తీసినట్లున్న ఈ చిత్రం మీలోనూ ఓ పవన్ ఫ్యాన్ ఉంటే నచ్చుతుంది.

English summary
Pawan Kalyan's Sardaar Gabbar Singh went wrong at so many stages that, we are clueless where to begin with. However, Pawan Kalyan's impeccable screen presence did wonders for the film, which made it a decent watch. Apparently, that is the reason he is called a star of substance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu