Maya Petika Review పాయల్ రాజ్‌పుత్ గ్లామర్‌తో మెప్పించిందా?.. మాయా పేటిక ఎలా ఉంది?

Rating:
2.0/5

న‌టీన‌టులు: విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్‌, సిమ్ర‌త్ కౌర్, ర‌జ‌త్ రాఘ‌వ్, సునీల్, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్ రెడ్డి, హిమ‌జ‌, శ్యామ‌ల త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ రాపర్తి
స‌మ‌ర్ప‌ణ‌: మాగుంట వెంక‌ట నారాయ‌ణ రెడ్డి
నిర్మాత‌లు: మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ: సురేష్ ర‌గుతు
ఎడిట‌ర్‌: డీ వెంక‌టేష్ ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌
సంగీతం: గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
ఆర్ట్‌: బిక్షు, మూర్తి
పీఆర్వో: వంశీ కాకా
బ్యాన‌ర్‌: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్మెంట్స్
రిలీజ్ డేట్: 2023-06-30

ప్రస్తుత నాగరిక ప్రపంచంలో సెల్‌ఫోన్ ప్రజల జీవితాల్లో భాగమవ్వడమే కాకుండా అత్యంత ప్రభావం చూపే సమాచార సాధనంగా మారింది. ఒక మొబైల్ ఫోన్ తన పుట్టుక నుంచి చావు వరకు ఎలా మనషుల జీవితాలతో ఆడుకొంటుందనే పాయింట్‌తో తెరకెక్కింది.

Payal Rajputs Maya Petika Movie Review and Rating

మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా అందుకొన్న హీరోయిన్ పాయిల్ రాజ్‌పుత్.. ఆ తర్వాత ఆమె లైఫ్‌పై ఎలా ప్రభావం చూపింది? ఆమె వద్ద నుంచి కార్పోరేటర్ కన్నె కామేశ్వర్ రావు (30 ఇయర్స్ పృథ్వీ) జీవితాన్ని ఎలా నాశనం చేసింది? అలీ, ఆస్రా ప్రేమకు ఎలా అడ్డంకిగా మారింది? వాచ్‌మెన్ నారాయణను నక్లీస్ నారాయణగా మార్చి ఎలా సెలబ్రిటిగా చేసింది? ట్రాన్స్‌జెండర్ (శ్రీనివాస్ రెడ్డి) జీవితాన్ని ఎలా మార్చింది. అలాగే పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల చేతికి చేరిన మొబైల్ ఫోన్ వారి జీవితాన్ని ఎలా నాశనం చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే మాయ పేటిక సినిమా కథ.

మొబైల్ ఫోన్‌ను ఉపయోగించుకొనే విధానాన్ని బట్టి ఆయా వ్యక్తుల జీవితం మంచి వైపు వెళ్తుందా? చెడు వైపు వెళ్తుందా అనే పాయింట్‌తో రాసుకొన్న కథ బాగుంది. ఐదు జీవితాలకు సంబంధించిన కథల సమాహారంగా ఈ సినిమాను రూపొందించిన తీరుకు ర‌మేష్ రాపర్తి అభినందించాలి. కానీ కథలను ప్రభావవంతంగా, ఎమోషనల్‌గా రాసుకోవడంలో కాస్త తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన కథలు కొత్తగా అనుభూతిని కలిగించలేకపోయాయి. ఇక సెకండాఫ్‌ కాస్త ఫర్వాలేదనిపిస్తుంది.

Payal Rajputs Maya Petika Movie Review and Rating

ఇక ఐదు కథల్లో మొదటి కథ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు నిర్మాత గిఫ్గుగా మొబైల్ ఫోన్.. ఆమె జీవితంలోకి వచ్చి కాబోయే భర్తతో విభేదాలకు ఎలా దారి తీసిందనే పాయింట్‌తో కథ రొటీన్‌గా సాగుతుంది. అలాగే కామంతో రగిలిపోయే కన్నె కామేశ్వరరావు ప్రతిష్టను ఎలా దిగజార్చిందనే విషయాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోయారు.

ఆలీ, ఆస్రా ప్రేమ కథ రొటీన్‌గానే ఉంది. కానీ ఆస్రా మూగ అమ్మాయి అనే విషయంలో ఎమోషన్స్ కనిపిస్తాయి. ఇక వాచ్‌మెన్ నారాయణ కథ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా చెప్పలేకపోయారనే చెప్పాలి. ప్రధానంగా హిజ్రా శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇక పాకిస్థాన్ తీవ్రవాదుల ఎపిసోడ్‌ కూడా మెప్పించలేకపోయింది.

Payal Rajputs Maya Petika Movie Review and Rating

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సురేష్ ర‌గుతు అందించిన సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. కొన్ని సన్నివేశాలను బాగా చిత్రీకరించారు గుణ బాలసుబ్రమణియన్ సంగీతం బాగుంది. శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్‌లో బీజీఎం బాగుంది. డీ వెంక‌టేష్ ప్ర‌భు, న‌వ్ క‌ట్స్‌ ఎడిటింగ్ విషయానికి వస్తే.. పాయల్ రాజ్‌పుత్, కమెడియన్ పృథ్వీ ఎపిసోడ్స్ నిడివి ఎక్కువై సాగదీతగా ఉందనిపిస్తుంది.

Payal Rajputs Maya Petika Movie Review and Rating

చైనాలో పుట్టిన మొబైల్ ఫోన్ ఇండియాకు చేరి.. రకరకాల వ్యక్తుల జీవితాలతో ఎలా ఆటాడుకొన్నదనే విషయం పాయింట్‌గా ఆలోచించడానికి బాగుంది. కానీ ఒక్రటెండు ఎపిసోడ్స్ ఫర్వాలేదనిపిస్తాయి. మిగితావి చాలా కంటెంట్ పరంగా నాసిరకంగా ఉంటాయి. మాయా పేటికను సినిమా కాకుండా వెబ్ సిరీస్‌గా చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చేదనే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత గొప్ప సినిమా అయితే కాదు.. తగినంత సమయం ఉండి.. చేయడానికి ఏం పని లేకపోతే.. థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X