Peddha Kapu 1 Review తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం.. గోదావరి జిల్లాలో తర్వాత ఏం జరిగింది? పెద్దకాపు సమీక్ష

Rating:
3.0/5

నటీనటులు: విరాట్ కర్ణ, బ్రిగిడా సాగా, ఈశ్వరీరావు, అనసూయ భరద్వాజ్, నాగబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్, రాజీవ్ కనకాల, ఆడుకాలమ్ నరేన్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవిందర్ రెడ్డి
మ్యూజిక్: మిక్కి జే మేయర్
సినిమాటోగ్రఫి: చోటా కే నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్: జీఎం శేఖర్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
కొరియోగ్రఫి: రాజు సుందరం
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్‌
రిలీజ్ డేట్: 2023-09-29

పెద్దకాపు 1 కథ.. :రాజమండ్రి పరిసర ప్రాంతంలోని ఓ గ్రామంలో సత్య రంగయ్య (రావు రమేష్), భయ్యన్న (ఆడుకాలమ్ నరేన్) మధ్య ఎన్నో ఏళ్లుగా అధికారం కోసం సామాజిక, రాజకీయ ఆదిపత్యం కొనసాగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా గ్రామంలో దొమ్మిలు, గొడవలు, రాజకీయ వైరుధ్యాలు నెలకొంటాయి. ఆర్థికంగా, సామాజికంగా తక్కువ కులాలపై అగ్రవర్ణాల వివక్ష కొనసాగుతుంటుంది. ఈ క్రమంలో అంటే 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం పార్టీ జెండాను గ్రామంలోని నడిబొడ్డును పాతి సత్య రంగయ్య, భయ్యన్నకు సవాల్ విసురుతాడు.

Peddha Kapu 1 Movie Review and Rating: Srikanth Addalas Intense and Emotional Political Drama

పెద్దకాపు 1 కథలో ట్విస్టులు:గోదావరి జిల్లాలోని రాజకీయాలను, అధికారాన్ని సత్య రంగయ్య, భయ్యన్న లాంటి వాళ్లు ఎలా దుర్వినియోగం చేశారు? అక్కమ్మ (అనసూయ భరద్వాజ్) రాజకీయాల్లోకి రావాలనుకొన్న సమయంలో సత్య రంగయ్య వర్గం ఆమెను ఎలా నిలువరించాలనుకొన్నారు? ఆర్థిక స్థితిగతులు అంతంతా మాత్రమే ఉన్న పెద్దకాపు గ్రామ పెద్దలను ఎందుకు ఎదురించాల్సిన పరిస్థితి ఏర్పడింది? బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు ఎన్టీఆర్ పంపిన దూత (నాగబాబు) ఎలాంటి ప్లాన్ వేశాడు? సత్య రంగయ్య, భయ్యన్న లాంటి రాజకీయ నేతలకు పెద్దకాపు ఎలా ఎదుర్కొన్నాడు? పెద్దకాపును సత్యరంగయ్య కొడుకు (శ్రీకాంత్ అడ్డాల) ఎదుర్కొనేందుకు ఎలాంటి దుష్టపన్నాగాలు పన్నాడు? పెద్దకాపుకు ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడా? అనేది పెద్దకాపు 1 సినిమా కథ.

పెద్దకాపు 1 ఫస్టాఫ్ ఎలా ఉంది?:గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల మధ్య ఓ పాపను చాటలో పెట్టుకొని అమ్మడానికి ప్రయత్నించే ఎమోషనల్ సీన్‌తో పెద్దకాపు సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాలు టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా కావడమే కాకుండా కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, భయ్యన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరు చాలా ఇంట్రెస్టింగ్ నేరేషన్‌తో కథ నిదానంగా సాగుతుంది. ప్రతీ ఫ్రేమ్‌ను, ఎపిసోడ్‌ను వివరంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కానీ సగటు ప్రేక్షకుడికి కొంత సాగదీసినట్టు అనిపించే ప్రమాదం కనిపిస్తుంది.

Peddha Kapu 1 Movie Review and Rating: Srikanth Addalas Intense and Emotional Political Drama

పెద్దకాపు 1 సెకండాఫ్‌లో :ఇక సెకండాఫ్‌లో సత్య రంగయ్య మరణాంతరం పరిస్థితులు, అలాగే పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.

Peddha Kapu 1 Movie Review and Rating: Srikanth Addalas Intense and Emotional Political Drama

పెద్దకాపులో నటీనటులు :పెద్దకాపు సినిమాలో నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. తొలి చిత్రంలోనే విరాట్ కర్ణ తన శక్తికి మించిన నటనతో ఆకట్టుకొన్నాడు. ఏ కోశాన కూడా తొలి చిత్ర నటుడనే ఫీలింగ్ కలుగనివ్వకపోవడం అతడి టాలెంట్‌కు, సినిమా అంటే తపన ఏమిటో చూపించింది. యాక్షన్, ఎమోషన్స్, రొమాంటిక్ సీన్లలో ఏం చేశాడురా అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా భారాన్నంతా ఒంటిచేత్తో ముందుకు తీసుకెళ్లాడు. సరైన సినిమాలు, కథలు ఎంపిక చేసుకొంటే.. టాలీవుడ్‌కు స్టార్, యాక్టర్ అవ్వడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఇక రావు రమేష్ మరోసారి నట విశ్వరూపం చూపించారు. ఆడుక్కాలమ్ నరేన్, రావు రమేష్ పోటీ పడి నటించారు.

పెద్దకాపులో అనసూయ:ఇక పెద్దకాపు సినిమా ఓ ఇద్దరు నటీనటులను పరిచయం చేసింది. ఇప్పటి వరకు బోల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, స్పెషల్ సాంగ్స్‌లో నటించే ఆర్టిస్టుగా ఇమేజ్ ఉన్న అనసూయ భరద్వాజా అక్కమ్మ పాత్రతో విజృంభించింది. అనసూయ ఫెర్ఫార్మెన్స్ చూస్తే ఆమెపై మరింత గౌరవం పెరుగుతుంది. ఇక శ్రీకాంత్ అడ్డాల ఇప్పటి వరకు దర్శకుడిగానే తెలుసు. కానీ నటుడిగా సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ప్రగతి శ్రీవాస్తవ గ్లామర్ పరంగానే కాకుండా నటిగా కూడా ఆకట్టుకొన్నది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఆర్టిస్టు ఉత్తమ నటులకు ఏ మాత్రం తక్కువ కాకుండా తమ పాత్రతో కేక పెట్టించారు.

Peddha Kapu 1 Movie Review and Rating: Srikanth Addalas Intense and Emotional Political Drama

పెద్దకాపు 1 సాంకేతిక అంశాలు:పెద్దకాపు మూవీ సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ఆర్ట్ విభాగాల పనితీరు ఎక్ట్రార్డినరీగా ఉంది. మిక్కి జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సీన్లను ఎలివేట్ చేయడమే కాకుండా ఇంటెన్సిటీని, కథలోని డెప్త్‌ను తెలియజేసింది. చోటా కే నాయుడు తన కెరీర్‌లో బెస్ట్ వర్క్ ఇచ్చాడని చెప్పవచ్చు. స్టోరీ డీటైల్ నేరేషన్ కారణంగా కథ నెమ్మదిగా సాగినట్టు కనిపిస్తుంది. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. ఆర్ట్ వర్క్ అద్బుతంగా ఉంది. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

Peddha Kapu 1 Movie Review and Rating: Srikanth Addalas Intense and Emotional Political Drama

పెద్దకాపులో ఫైనల్‌గా :పెద్దకాపు 1 మూవీ భావోద్వేగంతో సాగే పొలిటికల్ డ్రామా. కథలో ఎమోషనల్ కంటెంట్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్, డైరెక్టర్ విజన్, టేకింగ్ సినిమాకు బలంగా మారింది. మితిమీరిన హింస, స్లో నరేషన్ సినిమాకు మైనస్‌గా అనిపిస్తాయి. తమిళంలో వెట్రీమారన్ లాంటి తరహా సినిమా. కులాల గొడవలు, బడుగు వర్గాలపై అగ్ర కులాల వివక్ష లాంటి కథతో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తెలుగు తెరపై బలమైన కంటెంట్‌తో వచ్చిన చిత్రాల జాబితాలో పెద్దకాపు చేరుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ విజయం సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X