Peddi Movie Twitter Review: పెద్ది మూవీ ట్విట్టర్ రివ్యూ

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంస్ధలు సమర్పిస్తున్నాయి.పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ, రవికిషన్, సత్య, జాన్ విజయ్, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే, ఆడుకలామ్ నరేన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్పెషల్ సాంగ్‌తో అలరించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు.

టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా జూన్ 4న పెద్ది రిలీజ్ అయ్యింది. జూన్ 3వ తేదీన పెద్ది మూవీ ప్రీమియర్స్ షో ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది చిత్రంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే..

Peddi Movie Twitter Review in Telugu  Is Ram Charan s Movie hits the bulls eye

ఇంటర్నల్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బుచ్చిబాబు పాత్రలు హై లెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. బలమైన భావోద్వేగాలు, ఎమోషనల్ డెప్త్, మరిచిపోలేని థియేట్రికల్ ఘట్టాలతో బుచ్చిబాబు నెక్ట్స్ లెవల్ స్క్రిప్ట్‌ను రచించారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను ఇచ్చారని అంటున్నారు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించనున్నాయని సమాచారం. జాన్వీ కపూర్ లవ్ ట్రాక్ రిఫ్రెషింగ్‌గా ఉంటుందట.

సినిమాపై జగపతి బాబు పాత్ర బలమైన ముద్ర వేస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో నేపథ్య సంగీతం అదిరిపోతుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో అత్యున్నత నిర్మాణ విలువతో రూపొందిన పెద్ది సినిమా రేపు థియేటర్‌లలోకి రాబోతోందని ప్రముఖ సినీ క్రిటిక్ రమేశ్ బాలా.. పెద్ది సినిమా తమిళ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ లోడింగ్ అంటూ ఆయన సినిమాపై అంచనాలు పెంచేశారు.

రీసెంట్‌గా వచ్చిన ఇన్ఫో ప్రకారం పెద్ద సెకండాఫ్ టాప్‌లో తీశాడట. జగపతిబాబు గారు అయితే ఫైర్. రెండు సీక్వెన్సెస్ అయితే టాప్ క్లాస్ ఉంటాయట. ఒక కమర్షియల్ సినిమా ఈ రేంజ్ గ్రౌండెడ్ కంటెంట్‌ ఏ డైరెక్టర్ తీయలేడట. చివరి 15 నిమిషాలు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందట. పేపర్ భాషలు సరిపోవు, ఎక్కువ రెడీ చేసుకుని వెళ్లండమ్మా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

పెద్ది ఫస్టాఫ్ బాగానే మొదలైనా.. త్వరగానే రోటీన్‌, ఊహించే కథనంలోకి జారిపోతుంది. సాగదీసిన సన్నివేశాలు, మందకొడి కథనం, ఎమోషనల్‌గా కనెక్టివిటీ లేకపోవడంతో సెకండాఫ్ కూడా దారి తప్పుతుంది. క్లైమాక్స్ బాగా డిజప్పాయింట్ చేస్తుంది. 3 గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ ముగింపు చాలా చప్పగా నిరాశజనకంగా అనిపించి ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేస్తుంది. ఒకటి లేదా రెండు సన్నివేశాలు, రామ్ చరణ్ కష్టం తప్పించి పెద్దిలో చెప్పుకోదగ్గ విశేషాలు చాలా తక్కువ. భారీ బడ్జెట్‌తో ఏళ్ల తరబడి చేసిన ప్రచారంతో నిర్మించిన ఈ సినిమాలో సెకండాఫ్.. ఫస్టాఫ్ కంటే ఘోరంగా విఫలమైంది. హిందీ బెల్ట్‌లో ఇప్పటికే బజ్ అంతంత మాత్రంగానే ఉండగా.. ఇలాంటి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.

పెద్ది ఆల్‌టైం బ్లాక్‌బస్టర్.. రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పహిల్వాన్ ఫైట్ సీన్స్ కథను ఉత్కంఠభరితంగా నడిపిస్తాయి. కథ కచ్చితంగా ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా ఉంది. నటీనటులతో సహా అందరూ అద్భుతంగా వర్క్ చేశారు. పెద్ది మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

Read more about: peddi ram charan janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X