Peddi First Review: పెద్ది మూవీ ఫస్ట్ రివ్యూ

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అభ్యంతరం చెప్పిన సన్నివేశాలు ఏమిటి? ఈ చిత్రానికి లభించిన సెన్సార్ సర్టిఫికెట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Also Read
నాకు గర్భస్రావం.. నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం సీఎం విజయ్‌.. మండిపడ్డ యువ హీరోయిన్
నాకు గర్భస్రావం.. నా ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం సీఎం విజయ్‌.. మండిపడ్డ యువ హీరోయిన్
Peddi Review by Censor Board

స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా దేశభక్తి అంశాలతో రూపొందిన పెద్ది చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ ప్రతినిధులు, అధికారులు సమీక్షించారు. చెన్నమనేని స్రవంతి, నాయక్ సంతోష్ సాయికిరణ్, గూడురి పావని, రిటా నాగరాజ్, రాహుల్ గావ్లీకర్ (ఈవో)తో కూడిన జట్టు ఈ సినిమాను సమీక్షించినట్టు విడుదలైన సెన్సార్ సర్టిఫికెట్‌ ద్వారా వెల్లడైంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై సెన్సార్ బోర్డు మెంబర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Recommended For You
Hai Jawani To Ishq Hona Hai First Review: హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ ఫస్ట్ రివ్యూ
Hai Jawani To Ishq Hona Hai First Review: హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ ఫస్ట్ రివ్యూ

పెద్ది చిత్రంలోని 13.30, 13.45 నిమిషాల వద్ద వచ్చే లౌడేష్ అనే డైలాగ్స్, అలాగే 39 నిమిషంలో వచ్చే బొక్క, 45.3 నిమిషం, 62.5 నిమిషంలో వచ్చే లంబ్డీ కొడుకా, 86 నిమిషంలో డెలివరీ అయ్యే మాదర్ చోద్, 100 నిమిషంలో వచ్చే దొంగ ముండా కొడుకా, కాల్చి పడి దెంగుతా అనే డైలాగ్స్‌ను తొలగించడమే లేదా వాటి స్థానంలో మరో డైలాగ్స్‌ను చేర్చడం చేయాలని సెన్సార్ సభ్యులు సూచించారు. అలాగే 122 .4 నిమిషంలో వచ్చే రాజస్థాన్ అనే పదాన్ని మార్చాలి. అలాగే 48.36 నిమిషంలో మిడిల్ ఫింగర్ చూపించే సీజీ విజువల్‌ను తొలగించాలని సెన్సార్ బోర్డు సభ్యులు సూచించారు.

You May Also Like
నందమూరి తేజస్వినిపై అలాంటి రూమర్లు.. వైరల్ డ్యాన్స్ వీడియోతో...
నందమూరి తేజస్వినిపై అలాంటి రూమర్లు.. వైరల్ డ్యాన్స్ వీడియోతో...

సెన్సార్ బోర్డు సభ్యులు సూచించిన ప్రకారం.. చిత్ర యూనిట్ కొన్ని డైలాగ్స్‌ను తొలగించారు. మరికొన్నింటి స్థానంలో మార్పులు చేర్పులు చేపట్టారు. దాంతో సంతృప్తి చెందిన అధికారులు ఈ చిత్రానికి యూఏ (UA16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్ల నిండిన వారు ఈ సినిమాను ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మాత్రం తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

'నేను డేటింగ్ చేయకపోతే.. బ్రేకప్‌తో ఆ క్రికెటర్ సూసైడ్ చేసుకోనే వాడేమో’
'నేను డేటింగ్ చేయకపోతే.. బ్రేకప్‌తో ఆ క్రికెటర్ సూసైడ్ చేసుకోనే వాడేమో’

సెన్సార్ కార్యక్రమాలు, మార్పులు, చేర్పులు పూర్తి చేసుకొన్న తర్వాత సెన్సార్ బోర్డు రీజినల్ ఆఫీసర్ రాహుల్ గావ్లికర్ అధికారికంగా ఈ సినిమా రన్‌టైమ్‌ను ధృవీకరించారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫై చేసిన ప్రకారం.. ఈ చిత్రం నిడివి 189 నిమిషాలు అని ఆయన అధికారికంగా ధృవీకరించారు. దాంతో ఈ సినిమా పబ్లిక్ చూడటానికి మార్గం సుగమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవలనే దేశవ్యాప్తంగా ఊపందుకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Read more about: peddi ram charan janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X