Peddi Critic Review: పెద్ది మూవీ క్రిటిక్ రివ్యూ
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దుబాయ్‌కి చెందిన రివ్యూవర్, ఫిల్మ్ క్రిటిక్ ఉమేర్ సంధూ తన సోషల్ మీడియాలో రివ్యూను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటి? సినిమా హిట్టా? ఫట్టా? అనే వివరాల్లోకి వెళితే..

పెద్డి సినిమాకు సంబంధించి నా ఫస్ట్ రివ్యూ. దుబాయ్ సెన్సార్ బోర్డ్ నుంచి ఈ రివ్యూ ఇస్తున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు పైసా వసూల్ సినిమా. మాస్ ఎంటర్‌టైనర్. ఈ మూవీ ద్వారా రాంచరణ్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు. అన్ని రకాలుగా ఆయన ఆడియెన్స్ మనసును దోచుకొంటాడు అని దుబాయ్‌కి చెందిన స్వయం ప్రకటిత ఫిలిం క్రిటిక్ ఉమేర్ సంధూ తన రివ్యూలో వెల్లడించారు.
పెద్ది సినిమాకు స్క్రీన్ ప్లే చాలా రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఉంటుంది. అభిమానులకు అది కొంత నిరాశను కలిగించే విషయం. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సన్నివేశాలను చాలా టెర్రిఫిక్‌గా హైలెట్ చేస్తుంది. సాంకేతిక విభాగాల పనితీరు బాగుంటుంది. పాటలు ఒకే అని మెప్పిస్తాయి. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం. ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారుతుంది అని ఆయన తన రివ్యూలో వెల్లడించారు.
ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి కొంత నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఆమె గ్లామర్ షో తప్పా మరోటి ఆమె నుంచి ఊహించలేం. అలాగే ఈ సినిమాలోని పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. వారికి ఫస్ట్ రేటింగ్ ఇవ్వాల్సిందే. ఓవరాల్‌గా ఈ సినిమా రాంచరణ్ వన్ మ్యాన్ షో. కథ ఎంగేజింగ్‌గా ఉంటుంది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు.
అయితే ఉమేర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రివ్యూలు కొన్నిసార్లు ఫర్వాలేదనిపిస్తాయి. కొన్నిసార్లు చాలా దారుణంగా ఉంటాయి. తాను బ్లాక్ బస్టర్ అని చెబితే డిజాస్టర్లు అయ్యాయి. డిజాస్టర్ అని చెబితే హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా పెద్దిపై ఆయన చేసిన రివ్యూపై మెగా అభిమానులకు కొంత ఊరటను, జోష్‌ను కలిగిస్తున్నది. ఈ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర విశేషాల గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications