twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత 'పని'తనం లేదు

    By Staff
    |

    Pelaamto Panenti
    చిత్రం: పెళ్ళాంతో పనేంటి?
    నటీనటులు: వేణు, లయ, కళ్యాణి, తదితరులు
    నిర్మాణం: జగన్నాథ్‌ సినీమీడియా క్రియేషన్స్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి

    'పెళ్ళాం ఊరెళితే' పూర్తిస్థాయిలో వినోదాత్మక చిత్రంగా తీయడం, మళ్ళీ పెళ్ళాం అనే పేరుతో టైటిల్‌ పెట్టడంతో..'పెళ్ళాంతో పనేంటి?' కూడా అలానే ఉంటుందనుకోవడం సహజం. కానీ ఎస్వీ కృష్ణారెడ్డి మళ్ళీ తన పాత స్టైల్‌ లోకి వెళ్ళిపోయాడు. వినోదం తక్కువ..సాగతీత ఎక్కువ. క్లైమాక్స్‌ చివరిదశలో 20 నిమిషాల వరకు సినిమా కథ దేనికి సంబంధించి అర్థం కాదు. ఆ తర్వాత 'ట్విస్ట్‌ బావుందే' అనుకునేలోపే..మళ్ళీ సినిమా సామాన్యంగా ముగించడంతో ఈ సినిమాలో కొత్త పాయింట్‌ ఏమిటో స్పష్టమవదు.

    'ట్విస్ట్‌' వచ్చేలోపు..సినిమా అంతా ఎస్వీ కృష్ణారెడ్డి పాత ధోరణిలోనే కామెడీతో, పాటలతో సినిమా చుట్టేశాడు. ఆ కామెడీలో కూడా కొత్తగా నవ్వించేదేమీ లేదు. పాటలు వినడానికి బాగున్నాయి. అందులోనూ..శ్రేయా ఘోషాల్‌ పాడిన..'చిన్ని జీవితాన..' అనే పాటను చాలా బాగా చిత్రీకరించాడు. పెళ్ళాంతో పనేంటి అనే టైటిల్‌ కూడా హిట్‌ సెంటిమెంట్‌ తప్ప కథనుద్దేశించి పెట్టినదేమీ కాదు.

    హీరోగారు జల్సాపురుషుడు. ప్రేమ, పెళ్ళి మీద నమ్మకం ఉండదు. జల్సాపురుషుడిని చూసి లయ మనసు పారేసుకుంటుంది. ప్రేమించమని వెంట పడుతుంది. కానీ హీరో లొంగడు. ఈ లోపు హీరో విదేశాలకు వెళుతాడు. అక్కడికి టూర్‌ కు వచ్చిన కళ్యాణి హీరో 'కాల్‌ గర్ల్స్‌' వెంట తిరగడం చూసి అసహ్యించుకుంటుంది. కానీ వెంటనే ఇండియాకు రాగానే ఇష్టపడడం ప్రారంభించి..వాళ్ళ ఇంటికి వెళ్ళి కాబోయే కోడలు తానేనని చెపుతుంది.

    కళ్యాణి వెంటపడడం, ఆమె విసిగించడం నచ్చని హీరోగారు అమ్మాయిని లాగికొడుతాడు. హీరోకు లయ కళ్యాణి గురించి చెపుతుంది. ఆమె మెదడులో ఓ బుల్లెట్‌ ఉండిపోయిందని, ఆమె త్వరలోనే చనిపోతుందని, డాక్టర్లు ఎవ్వరూ సర్జరీ వద్దని చెప్పారని తెలుస్తుంది. ఆఖరి ఘడియల్లో ఉన్న హీరోయిన్‌ ప్రేమను అనుభవించాలనుకుంటుంది కాబట్టి హీరోగారు కూడా ప్రేమించాలని లయ ప్రోత్సాహిస్తుంది. చివర్లో ఒక జర్మన్‌ డాక్టర్‌ వచ్చి ఆపరేషన్‌ చేస్తాడు. లయ, వేణు పెళ్ళిచేసుకుంటారు.

    హీరోయిన్‌ మెదడులో బుల్లెట్‌ ఉందని, ఆమె త్వరలోనే చనిపోతుందనే చిన్న ట్విస్ట్‌ ఆఖర్లో సినిమా ముగుస్తుందనే 20 నిమిషాల ముందు రివీల్‌ చేస్తారు. ఈ లోపు సాగే కామెడీ ప్రహసనాన్ని మనం భరించాలి.

    వేణు తన ఎడం చేతితో నటించడం బాగానే చేశాడు. లయ, కళ్యాణిలు ఓకే. కొండవలస కామెడీ అతి. కాకపోతే..'నీకు తెలుసు..నాకు తెలుసు..' అనే కన్ఫ్యూజింగ్‌ డైలాగ్‌ బాగుంది. రాంప్రసాద్‌ ఫోటోగ్రఫీ విదేశాల పాట చిత్రీకరణలో బాగుంది. సాధారణ చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X