Pelli Kaani Prasad Movie Review: పెళ్లి కాని ప్రసాద్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.0/5

నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, భాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
సినిమాటోగ్రఫి: సుజాత సిద్దార్థ్
మ్యూజిక్: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2025-03-21

మలేషియాలో ఒక స్టార్ హోటల్‌లో ప్రసాద్ (సప్తగిరి) పని చేస్తూ ఉంటాడు. 38 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. తన తండ్రి (మురళీధర్) కారణంగా పెళ్లి లేట్ అవ్వడంతో ఫ్రస్టేషన్‌లోకి వెళ్తాడు. అలాంటి పరిస్థితిలో ప్రసాద్‌కు అదే ఊరిలో ఉండే ప్రియ (ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది. ఆమె తన తల్లితండ్రులు అమ్మమ్మతో కలిసి విదేశాల్లో సెటిల్ అవ్వాలని ముందు నుంచి కలలు కంటూ ఉంటుంది. ప్రసాద్ గురించి తెలిసి అతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రసాద్ ఇక ఫారిన్ వెళ్లకూడదు అని అనుకున్న విషయంలో ఇద్దరూ గొడవపడతారు.

Pelli Kaani Prasad Movie Review

ప్రసాద్‌ పెళ్లి లేటు అవ్వడానికి కారణాలు ఏంటి? తండ్రి కక్కుర్తి కారణంగా ప్రసాద్‌కు ఎలాంటి సమస్యలు వచ్చి పడ్డాయి? ప్రియతో ప్రసాద్ లవ్ ట్రాక్ ఎలా నడిచింది. ప్రసాద్‌ను ప్రియ ఎలా బుట్టలో వేసుకొన్నది? ప్రసాద్ విదేశాల్లో ఎందుకు సెటిల్ కావొద్దని అనుకొన్నాడు? చివరికి పెళ్ళికాని ప్రసాద్ పెళ్లి చేసుకున్న ప్రసాద్ అయ్యాక ఎలాంటి కష్టాలు పడ్డాడు? ప్రియ, ప్రసాద్ మధ్య గొడవకు ఎలాంటి పరిష్కారం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే పెళ్లి కాని ప్రసాద్ సినిమా కథ.

తెలుగు సినిమా రంగంలో లేటు పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా పాతదైనప్పటికీ.. ఎలా కొత్తగా చెప్పగలిగామనే విషయంపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పెళ్లి కాని ప్రసాద్ పాయింట్ రొటీన్, రెగ్యులర్ అయినప్పటికీ.. కొత్తగా ఈ తరం వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. అయితే కథలోను, కథనంలోని ఎలాంటి కొత్తదనం లేకుండా వెళ్లడం వల్ల పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతంది. అక్కడక్కడ మంచి కామెడీ సీన్లు వర్కవుట్ కావడం వల్ల సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌ను జోష్‌గా నడిపించిన దర్శకుడు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి తడబాటుకు గురయ్యాడు. ఎమోషనల్ సీన్లను మరింత బెటర్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయి ఉండేదనిపిస్తుంది.

ఇక సప్తగిరికి హీరోగా సక్సెస్ కావాల్సిన పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ప్రసాద్ క్యారెక్టర్‌లో తన వంతు పాత్రను బాగా చేశాడు. కథ, కథనాలు రొటీన్ కావడం వల్ల ఆయన పూర్తి స్థాయిలో మరో రేంజ్‌కు తీసుకెళ్లడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. ఈ సినిమా భారాన్నంత మోసే ప్రయత్నం చేశాడు. మురళీధర్ గౌడ్‌తో కాంబినేషన్ సీన్లు బాగున్నాయి. ప్రియాంక శర్మతో కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. ప్రియాంక శర్మ గ్లామర్ పరంగా, పెర్పార్మెన్స్ పరంగా ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. శ్రీనివాస్, ప్రమోదిని, రోహిణి, లక్ష్మణ్ తమ వంతుగా ఈ సినిమాకు బలంగా నిలిచారు. మిగితా వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

పెళ్లికాని ప్రసాద్ సినిమా సాంకేతిక విషయాలకు వస్తే.. పాటలు ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సీన్లను ఎలివేట్ చేసింది. కథలో, సన్నివేశాల్లో వైవిధ్యం లేకపోవడం శేఖర్ చంద్ర బీజీఎంకు ఎక్కువగా స్కోప్ లేకపోయింది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి ఫర్వాలేదనిపిస్తుంది. ఇతర విభాగాల పనితీరు మోస్తారుగా కనిపిస్తాయి. K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే సప్తగిరి కెరీర్ బెస్ట్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X