బడిసిన పెళ్ళి సంబంధం

By Staff

Pellisamabandham
ప్రేమకథతో రంగప్రవేశం చేసిన సుమంత్‌ కు ఇది మూడో సినిమా. తొలి చిత్రంతో పాటు మలి చిత్రం యువకుడు కూడా ఫ్లాప్‌ అవడంతో ఈసారి మసాలా చిత్రంతో హిట్‌ కొట్టేందుకు చేసిన ప్రయత్నమే- పెళ్ళిసంబంధం. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని, రఘువరన్‌ ల నటన ప్రతిభ మినహా మరేదీ ఆకట్టుకునే విధంగా లేదు. రాఘవేంద్రరావు సినిమాలో సహజంగా ఉండే పండ్లు, బంతులు, హీరోయిన్‌ ల నాభీ సౌందర్య దృశ్యాలూ ఇందులోనూ ఉన్నాయి. అయితే పాటలు సాధారణంగా ఉండడం, టేకింగ్‌ కూడా పాత పద్దతిలోనే ఉండడం వల్ల ఈ సినిమాలో రాఘవేంద్రరావు మాయాజాలం పనిచేయలేదు.

అక్కినేని నాగేశ్వరావు తలపండిన రచయిత. భూస్వామి. అతని మనవడు సుమంత్‌. పట్టణంలో అగ్రికల్చరల్‌ బి.ఎస్సీ చదివి పల్లెటూరిలో సెటిల్‌ అవుదామనుకుంటాడు. కోట శ్రీనివాసరావు అక్కినేని తమ్ముడు. కూతురు, అల్లుడు(రఘువరన్‌)తో పాటు బొంబాయిలో ఉంటాడు. రఘువరన్‌ పెద్దకూతురును సుమంత్‌ కు ఇవ్వాలని అనుకుంటాడు అక్కినేని. కానీ రఘువరన్‌ కు ఇది ఇష్టం ఉండదు. తన కూతురుని అమెరికా అబ్బాయికిచ్చి పెళ్ళి చేసేందుకు నిశ్చయిస్తాడు. ఆ అమ్మాయి మరో అబ్బాయి రాజా రవీంద్రను ప్రేమిస్తుంది.ఈ అమ్మాయి పెళ్ళికని వచ్చిన అక్కినేని రాజారవీంద్రతో ఆమెకు రిజిస్ట్రార్‌ మ్యారేజ్‌ చేయిస్తాడు.

దాంతో రఘువరన్‌ కు ఆగ్రహం కలిగి అక్కినేని, సుమంత్‌ ను ఇంటినుంచి వెళ్ళగొడుతాడు. మరోవైపు రఘువరన్‌ రెండో కూతురు సాక్షి శివానంద్‌ అందాన్ని చూసి హీరోగారు ప్రేమలో పడుతారు. సాక్షి కూడా లవ్వాడుతుంది. అయితే పెళ్ళి ట్విస్ట్‌ వీరిని దూరం చేస్తుంది. తండ్రికిచ్చిన మాట ప్రకారం సుమంత్‌ ను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మహా రచయితైన అక్కినేని ఎన్నో ప్లాన్‌ లు వేసి వీరిద్దరిని, రెండు కుటుంబాలను కలుపుతాడు. అలా తిరిగి పెళ్ళి సంబంధం కుదురుతుందన్నమాట.

మరీ బోరు కొట్టించే విధంగా తీసిన ఈ సినిమాలో బ్రహ్మనందం కామెడీ కాస్త రిలీఫ్‌. సుమంత్‌ కు తాతయ్యగా అక్కినేని నటన, సాక్షి తండ్రిగా రఘువరన్‌ ల నటనే ఈ చిత్రంలో హైలెట్‌. ఇక సుమంత్‌ నటన ఫర్వాలేదు. కాకపోతే నాగార్జున, వెంకటేష్‌ లను అనుకరించడం మానేస్తే బావుంటుంది. దర్శకుడు రాఘవేంద్రరావు పెద్దగా దృష్టిపెట్టలేదనిపిస్తోంది- చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూస్తే. మొత్తమ్మీద ఫర్వాలేదనే చిత్రంగానే చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X