Perusu Movie Review: పెరుసు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

మూవీ: పెరుసు
నటీనటులు: వైభవ్, సునీల్ రెడ్డి, నిహారిక ఎన్ఎమ్, చాందినీ తమిళరాసన్, బాల శరవణన్, రెడీన్ కింగ్‌స్లే తదితరులు
దర్శకత్వం: ఇలాంగో రామ్
నిర్మాతలు: కార్తీకేయన్ సంతానం, హర్మాన్ బవేజా, హిరణ్య పెరీరా
మ్యూజిక్: అరుణ్ రాజ్
సినిమాటోగ్రాఫర్: సత్య తిలకం
ఎడిటర్: సూర్య కుమారగురు
ఓటీటీ రిలీజ్: నెట్‌ఫ్లిక్స్

ఓ గ్రామానికి పెద్దగా ఉండే పరంధామయ్య ఓ రోజు టెలివిజన్ చూస్తూనే ఆకస్మికంగా మృతి చెందుతాడు. తండ్రి మరణంతో షాక్‌లో ఉన్న ఆయన కుమారులు స్వామి (సునీల్), దొర (వైభవ్)కు మరో దిగ్బ్రాంతికరమైన విషయం వారి దృష్టికి వస్తుంది. అయితే గ్రామంలో ఎవరికి తెలియకుండా... మూడో కంటికి తెలియకుండా.. గుట్టుగా తమ తండ్రిని అంత్యక్రియలు నిర్వహించాలనుకొంటారు. కానీ వారు అనుకొన్న ప్రతి విషయంలో కథ అడ్డం తిరుగుతూనే ఉంటుంది.

Perusu Tamil Movie Review

పరంధామయ్య మరణం వెనుక అసలు కారణం ఏమిటి? కుమారులు, కుటుంబ సభ్యులు తమ ఇంటి పెద్ద మరణాన్ని చూసి ఎందుకు కంగారు పడుతారు? చనిపోతూ తమకు కంగారు పెట్టిన తండ్రి విషయంలో వైద్యులు, బూత వైద్యులను ఎందుకు సంప్రదించారు? తండ్రి పెట్టిన కంగారుతో గ్రామ ప్రజలు ఇచ్చిన సలహాలు, వారు చేసిన కంగాళీ వీరికి ఎలాంటి కష్టాలు తెచ్చిపెట్టింది. చివరకు తండ్రి అంత్యక్రియలను స్వామి, దొర ఎలా పూర్తి చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే పెరుసు సినిమా కథ.

ఏ తండ్రి మరణమైనా ప్రతీ ఇంటిలో విషాదం నింపుతుంది. కానీ పరంధామయ్య మరణం మాత్రం పరువు పోయేలా చేయడంతో కుటుంబ సభ్యులకు దిక్కు తోచని విధంగా మారుతుంది. అయితే అయితే ఆ పాయింట్‌ను చెప్పడానికి చాలా రోతగా ఉంటుంది. కానీ ఆ పాయింట్ చుట్టూ దర్శకుడు అల్లు కొన్న కథ కొన్నిసార్లు బాగా నవ్విస్తుంది? కొన్ని సార్లు ఏంటి చాదస్తం అనే రోత పుట్టింది. ఈ సినిమాను నడిపించి అలాంటి పాయింట్ కాబట్టి.. ఫ్యామిలీ అంతా కలిసి చూడటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది.

అయితే తండ్రి మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా స్వామి, దొర పాత్రల చుట్టు తిరిగే మరికొన్ని పాత్రలను దర్శకుడు బాగా రాసుకొన్నారు. విషాదం నుంచి పుట్టే ఓ వింత కామెడీ సీన్లను దర్శకుడు అల్లుకొన్న తీరును కొంత వరకు అభినందించాల్సిందే. చిన్న పాయింట్ పట్టుకొని రెండు గంటలపాటు కథను, పలు పాత్రలను జొప్పించిన విధానం బాగుందనిపిస్తుంది. డర్టీ జోక్స్, వెకిలి కామెడీ లాంటి అంశాలను ఏది ఏమైనా ఇలాంటి సినిమాను ఇంట్లో చూడాల్సి రావడం కష్టమే.

Perusu Tamil Movie Review

ఇక స్వామిగా సునీల్, దొరగా వైభవ్ తమ పాత్రలను సమర్ధవంతంగా పొషించారు. విషాదం ద్వారా కూడా కామెడీని సహజంగా పుట్టించడానికి వారు చేసిన ప్రయత్నం బాగుంది. నిహారిక ఎన్ఎమ్, చాందినీ తమిళరాసన్, రెడ్ కింగ్‌స్లే కామెడీని పండించారు. ఇక మృతుడి భార్యగా, ఆయన మరదలిగా నటించిన వారు కూడా ఆకట్టుకొంటారు. ఓవరాల్‌గా నటీనటులందరూ తమ వంతుగా ఈ సినిమాకు బలంగా కనిపిస్తారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. అరుణ్ రాజ్ మ్యూజిక్, సత్య తిలకం సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. సూర్య అందించిన ఎడిటింగ్ పనితనం ఈ సినిమా బోర్ కొట్టకుండా చేసింది. హర్మాన్ బవేజా, కార్తీకేయన్, హిరణ్య ఫెరీరా అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న పాయింట్‌తో కొత్తవారితో కలిపి చేసిన ప్రయత్నం బాగుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అర్జెంట్‌గా కాకపోయినా.. టైంపాస్ కోసం ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.

More from Filmibeat

Read more about: vaibhav sunil reddy Perusu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X