twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేట మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Rajini Kanth's Petta Movie Review పేట మూవీ రివ్యూ | Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: రజనీకాంత్, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిషా
    Director: కార్తీక్ సుబ్బరాజు

    సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే స్టయిల్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు గుర్తొస్తాయి. అయితే తన రెగ్యులర్ స్టయిల్ మార్చి ఇటీవల కబాలి, కాలా చిత్రాల్లో నటించాడు. కానీ అన్ని వర్గాల ప్రజలను ఆ చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో తలైవాకి అభిమానిగా చెప్పుకొంటున్న 'పిజ్జా' దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పేట అనే మాస్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్ నటించారు. అలనాటి అందాల తార సిమ్రాన్, బ్యూటీ త్రిషా జంటగా నటించారు. ఓ హాస్టల్ వార్డెన్ జీవిత కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా అభిమానులను రజనీ మెప్పించారా? అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

     పేటా మూవీ కథ

    పేటా మూవీ కథ

    ప్రధానమంత్రి పీఏ సిఫారసుతో కాళి (రజనీకాంత్) ఓ కాలేజీలో హాస్టల్ వార్డెన్‌గా చేరుతాడు. ప్రేమజంట అయిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయి (సనత్, మేఘా ఆకాశ్)పై జరిగే దాడులను అడ్డుకోవడానికి ఆ కాలేజీకి వస్తాడు. ర్యాగింగ్, ఇతర గ్రూపు గొడవలకు ఫుల్‌స్టాప్ పెడుతాడు. అమ్మాయి తండ్రి చేసే దాడులను ఎదురించే క్రమంలో అతని పేరు కాళి కాదు.. పేట వీర అని తెలుస్తుంది. సింహాచలం సింగ్ (నవాజుద్దీన్ సిద్దిఖీ)తో విభేదాలు బయటకు వస్తాయి.

     పేట మూవీలో మలుపులు

    పేట మూవీలో మలుపులు

    కాళి పేరుతో హాస్టల్‌లో చేరిన పేట వీర గతమేమిటి? ఎందుకోసం కాళిగా మారాడు. యువ జంటను రక్షించే క్రమంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఈ కథలో జిత్తు (విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి? సింహాచలం సింగ్, పేట మధ్య గొడవలు ఎందుకు చోటుచేసుకొన్నాయి? చివరకు జిత్తు, సింహాచలంపై ఎలా పగతీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే పేట సినిమా కథ.

    ఫస్టాఫ్‌

    ఫస్టాఫ్‌

    కాళి కాలేజీలో వార్డెన్‌గా చేరడంతో కథ ప్రారంభమవుతుంది. కాలేజీలో సన్నివేశాలు, రజనీ మార్క్ స్టయిల్స్ కథ సాగిపోతుంది. మధ్యలో మేఘా ఆకాశ్ తల్లిగా నటించిన సిమ్రాన్‌తో చిన్న రొమాంటిక్ ఎపిసోడ్ కాస్త ఊరటగా ఉంటుంది. ఆ తర్వాత సనత్, మేఘా ఆకాశ్‌లను కాపాడే సన్నివేశాలతో చాలా రొటీన్‌గా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్‌కు ముందు ఓ వ్యక్తి వచ్చి కాళీ కాదు.. పేట వీర అని చెప్పడం కృత్రిమంగా అనిపిస్తుంది. తొలిభాగంలో నా పని అయిపోయిందనుకొన్నారా? పేట పరాక్ లాంటి డైలాగ్స్ చాలా క్రేజీగా ఉన్నాయి.

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో

    సెకండాఫ్‌లో ప్రారంభమయ్యే ఫ్లాష్‌బ్యాక్‌లో కులాంతర వివాహం అనే వివాదం సినిమాకు కేంద్రబిందువుగా మారుతుంది. ఓ ముస్లిం యువకుడికి, సింహాచలం (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చెల్లెలి మధ్య ఉండే ప్రేమ వ్యవహారం పేటతో వైరానికి కారణమవుతుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా తన చెల్లెలి పెళ్లిని జరిపించడంతో ప్రతీకారం పెంచుకొని నవాజుద్దీన్ చేసిన దాడిలో పేట తన భార్య, కుమారుడిని (త్రిష)ను కోల్పోతాడు. ఆ సమయంలో ఓ కారణంతో పారిపోయి ఓ ఊరికి దూరమవుతాడు. చివర్లో ఓ ఇంట్రెస్టింగ్ ముగింపుతో సినిమా ముగుస్తుంది. సెకండాఫ్ మొత్తం రజనీకాంత్ స్టయిల్‌పైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లలో భావోద్వేగం లేకపోవడం సినిమాకు ప్రతికూలత అనిచెప్పవచ్చు.

    డైరెక్టర్ గురించి

    డైరెక్టర్ గురించి

    పిజ్జా లాంటి సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారిన కార్తీక్ సుబ్బరాజు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. పేట సినిమా కోసం కార్తీక్ ఎంచుకొన్న కథ చాలా ముతకగా ఉంది. పాతకాలం కథ, టేకింగ్‌ కొంత విసుగగా అనిపిస్తుంది. కానీ ప్రేక్షకులకు నచ్చే విధంగా రజనీ స్టయిల్స్, మేనరిజాన్ని కథకు జోడించి కాస్త రిలీఫ్ కలిగించాడు. అయితే సెకండాఫ్‌లో కథను సాగదీసి సహనానికి పరీక్ష పెట్టాడు. కథలో అనేక లోపాలు, నేరేషన్‌లో క్లారిటీ మిస్సాయ్యాడు. పాత్రల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి లోపాల మధ్య క్లైమాక్స్‌లో వాలి, సుగ్రీవుల కథను చెప్పి ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడం సఫలమయ్యాడని చెప్పవచ్చు.

    రజనీకాంత్ పెర్హార్మెన్స్

    రజనీకాంత్ పెర్హార్మెన్స్

    పేట చిత్రంలో రజనీకాంత్ మరోసారి మాస్ పాత్రతో అలరించాడు. గత కొద్దిగా కాలంగా రజనీలో ఉండే మాస్ ఎలిమెంట్స్ మిస్ అయిన ప్రేక్షకలకు ఈ సినిమాలో అన్ని దొరుకుతాయి. రజనీ తరహా డైలాగులు, నడక, హావభావాలు, యాక్షన్, రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్‌కి పండుగ వాతావరణం తెచ్చిపెట్టేలా ఉంటాయి. అయితే ఈ సినిమా మహాఅద్భుతం అనే రేంజ్‌లో లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు, సెకండాఫ్‌లో మరికొన్ని సీన్లు వాహ్ వా అనిపిస్తాయి. అయితే రజనీలో ఉండే చరిష్మా, పవర్, జోష్ పేట పాత్రలో కనిపించవు.

    సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాశ్ గురించి

    సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాశ్ గురించి

    ఇక సినిమాలో హీరోయిన్లు సిమ్రాన్, త్రిషా, మేఘా ఆకాశ్ ఉన్నప్పటికీ అంతగా ప్రాధాన్యం కనిపించవు. ఈ ముగ్గురి హీరోయిన్లకు రెండు, మూడు సీన్లు ఉన్నప్పటికీ పెద్దగా రిజిస్టర్ కావు. త్రిష, సిమ్రాన్, మేఘా నామమాత్రంగానే మిలిగిపోతారు. ఇక బాబీ సింహా పాత్ర కొంత ఫర్వాలేదనిపిస్తాడు. మిగితా నటీనటులు అంతగా గుర్తుండి పోయే విధంగా లేరు.

    విజయ్ సేతుపతి యాక్టింగ్

    విజయ్ సేతుపతి యాక్టింగ్

    పేట సినిమాలో ఇద్దరు విలన్లలో విజయ్ సేతుపతి నటనపరంగా మంచి మార్కులు కొట్టేశారు. తొలిభాగంలో భజరంగ్ దళ్ లాంటి సంస్థకు నేతగా కనిపిస్తాడు. లవర్స్ డే రోజున ప్రేమికులకు వివాహాలు చేయడం లాంటి సీన్లలో బాగా నటించాడు. అలాగే సెకండాఫ్‌లో విలన్‌ పాత్రలో తన మార్కు నటనను ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో రజనీతో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. మరోసారి గుర్తుండిపోయే పాత్రలో కనిపించాడు.

    నవాజుద్దీన్ మరోసారి పవర్‌ఫుల్‌గా

    నవాజుద్దీన్ మరోసారి పవర్‌ఫుల్‌గా

    సింహాచలంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించాడు. మాఫియాన నడిపే వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని సీన్లలో ఆయన నటన మ్యాజిక్ చేస్తుంది. విజయ్ సేతుపతి కారణంగా నవాజుద్దీన్ పాత్ర కురచగా అయిపోయిందా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు చూసిన దాని కంటే నవాజుద్దీన్ నటన మరింత మెరుగ్గా ఉంది.

    మ్యూజిక్, ఎడిటింగ్

    మ్యూజిక్, ఎడిటింగ్

    సాంకేతిక విభాగాల్లో అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ మాస్ పాట తప్ప పెద్దగా పాటలు అలరించలేకపోయాయి. కొన్ని చోట్ల రీరికార్డింగ్ బాగుంది. వివేక్ హర్షన్ ఎడిటింగ్ ఇంకా స్కోప్ ఉంది. చాలా సన్నివేశాల్లో ఎక్కువగా సాగదీత ఉంటుంది.

    సినిమాటోగ్రఫి

    సినిమాటోగ్రఫి

    తిరు అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. రజనీకాంత్‌ను గత చిత్రాలకంటే అందంగా చూపించారు. అలాగే లోకేషన్ల ఎంపిక, లైటింగ్ తదితర అంశాలు తెరపైన బ్రహ్మండంగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కూడా బాగుంది.

     నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    సన్ టెలివిజన్ నెట్‌వర్క్ పేట చిత్రాన్ని రూపొందించింది. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. నటీనటులు ఎంపిక, సినిమాను రిచ్‌గా అందించడానికి చేసిన ప్రయత్నం చాలా బాగుంది. కథ, కథనాలపై మరింత కసరత్తు చేసి ఉంటే సన్ బ్యానర్లో పేట మంచి చిత్రంగా మారేది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    పరువు హత్యలు, ప్రేమ, పగ, మాస్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకొన్న చిత్రం పేట. రజనీకాంత్‌ బాడీ లాగ్వేజ్, స్టయిల్, మేనరిజం పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఫ్యాన్స్‌లో సంబరాలు నింపే చిత్రం. కాకపోతే కథలో దమ్ము లేకపోవడం, కథనం సాగదీతగా ఉండటం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే పెట్టిన టికెట్ ధరకు ప్రతిఫలం దక్కుతుంది. అతిగా ఆశిస్తే భంగపాటు తప్పదు. పక్కా ఇది రజనీ ఫ్యాన్స్ సినిమా.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • రజనీకాంత్ స్టయిల్, మాస్ అప్పీల్
    • కార్తీక్ సుబ్బరాజన్ మేకింగ్
    • సినిమాటోగ్రఫి
    • క్లైమాక్స్
    • యాక్షన్ పార్ట్
    • మైనస్ పాయింట్స్

      • కథలో బలం లేకపోవడం
      • కథనంలో వేగం లోపించడం
      • రజనీ స్టయిల్స్‌పైనే దృష్టిపెట్టడం
      •  తెర ముందు, తెర వెనుక

        తెర ముందు, తెర వెనుక

        నటీనటులు: రజనీకాంత్, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిషా, మేఘా ఆకాశ్ తదితరులు
        రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
        నిర్మాత: కళానిధి మారన్
        సంగీతం: అనిరుధ్ రవిచందర్
        సినిమాటోగ్రఫి: తిర్రు
        ఎడిటింగ్: వివేక్ హర్షన్
        స్టంట్స్: పీటర్ హెయిన్స్
        బ్యానర్: సన్ పిక్చర్స్
        రిలీజ్ డేట్: 2019-01-10
        నిడివి: 172 నిమిషాలు

    English summary
    Petta film written and directed by Karthik Subbaraj and produced by Kalanithi Maran under his production studio Sun Pictures. The film stars Rajinikanth with an ensemble cast including Vijay Sethupathi, Simran, Trisha, M. Sasikumar, Nawazuddin Siddiqui, Bobby Simha, J Mahendran and Guru Somasundaram. This movie set to release on January 10th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X