Phalana Abbayi Phalana Ammayi review స్లోగా సాగే లవ్ స్టోరి.. నాగశౌర్య హిట్ కొట్టాడా?

Rating:
2.5/5

నటీనటులు: నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్,దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
డీవోపీ: సునీల్ కుమార్ నామ
సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్: కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్: అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్: సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్: రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్: శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్: అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్: హర్ష చల్లపల్లి
పీఆర్వో: లక్ష్మీవేణుగోపాల్
రిలీజ్ డేట్: 2023-03-17

ఫలానా అబ్బాయి కథ ఏమిటంటే?

ఫలానా అబ్బాయి కథ ఏమిటంటే?

ఒకే కాలేజీలో కొత్తగా చేరిన సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) సినీయర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన సంజయ్‌ను సీనియర్ల ర్యాగింగ్ చేస్తుండటంతో అనుపమ ఆదుకొంటుంది. అలా ఏర్పడిన పరిచయం వారిని మరింత దగ్గర చేస్తుంది. ఇంజినీరింగ్ తర్వాత మాస్టర్ కోసం యూకేకు వెళ్లిన అనుపమ, సంజయ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అయితే చిన్న కారణంగా వారిద్దరి మధ్య మనస్పర్ధుల ఏర్పడి ఒకరికొకరు దూరం అవుతారు.

ఫలానా అబ్బాయి ప్రేమ కథలో ట్విస్టులు

ఫలానా అబ్బాయి ప్రేమ కథలో ట్విస్టులు

సీనియర్ అయిన అనుపమ ఏ పరిస్థితుల్లో సంజయ్‌కు దగ్గరైంది? సంజయ్, అనుపమ మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారింది. ఏ కారణంగా సంజయ్‌కి అనుపమ దూరమైంది. ఎలాంటి పరిస్థితుల్లో అనుపమకు గిరి (అవసరాల శ్రీనివాస్) దగ్గరయ్యారు. సంజయ్ జీవితంలోకి వచ్చిన పూజ (మేఘా చౌదరి) నీలిమా (సింగర్ హరిణి) జర్నీ ఎలా సాగింది? చివరకు అనుపమను సంజయ్ పెళ్లి చేసుకొన్నాడా? వారిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయా? గిరి లవ్ ప్రపోజల్‌‌ను అనుపమ అంగీకరించిందా? గిరి, అనుపమ, సంజయ్ మధ్య సాగిన ముక్కోణపు ప్రేమకథకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమా కథ.

ఫలానా మూవీ ఎలా సాగిందంటే?

ఫలానా మూవీ ఎలా సాగిందంటే?


పాప సినిమా కథ ఫన్, రొమాంటిక్ అంశాలతో సరదాగా మొదలవుతుంది. సంజయ్ జీవితంలో చోటు చేసుకొన్న ఓ కీలక సంఘటన అనుపమ, సంజయ్ కథకు ఓ టర్నింగ్ పాయింట్ మారి.. కథను ఫీల్ గుడ్‌గా ముందుకు తీసుకెళ్తుంది. కథలో వైవిధ్యం లేకపోవడం, ఎమోషన్స్ పెద్దగా పండకపోవడం, సీన్లు చాలా స్లో, రెగ్యులర్‌గా సాగడంతో మరీ సాగదీసినట్టుగా ఉంటుంది. స్టోరిలో బలమైన పాయింట్‌ ఉన్నప్పటికీ.. పూర్తి కథగా విస్తరించడంలో లోపాలు కనిపిస్తాయి. ఓ ఎమోషన్ పాయింట్ ఫస్టాఫ్ ముగిసినప్పటికీ.. ఆ తర్వాత స్టోరి టేకాఫ్ కాలేకపోయిందనిపిస్తుంది. కానీ చివర్లో కథ సాగడానికి కారణమైన ముగింపు పాయింట్ బాగుంది. కానీ చివరకు అంతసేపు లాగదీసి చెప్పడే కరెక్ట్ కాదనిపిస్తుంది.

అవసరాల టేకింగ్ ఎలా ఉందంటే?

అవసరాల టేకింగ్ ఎలా ఉందంటే?

దర్శకుడు అవసరాల శ్రీనివాస్ సినిమా అంటే ఫన్, హ్యుమర్, పంచ్ డైలాగ్స్, ఎమోషన్స్ ఉంటాయనే భావన ప్రేక్షకుల్లో ఉంది. కానీ ఈ సినిమాలో అవేమీ సరైన మోతాదులో తెర మీద ఆవిష్కరించేలా చేయడంలో తడబాటు కనిపించింది. కారణాలే ఏమై ఉంటోయో తెలియదు కానీ.. స్క్రిప్టులో చాలా లోపాలు కనిపిస్తాయి. మేకింగ్ పరంగా సినిమాను రిచ్‌గా తీశాడు కానీ.. కంటెంట్‌ను బలంగా చెప్పలేకపోయాడనిపిస్తుంది.

నాగశౌర్య, మాళవిక ఫెర్ఫార్మెన్స్

నాగశౌర్య, మాళవిక ఫెర్ఫార్మెన్స్


నటీనటులు విషయానికి వస్తే.. నాగశౌర్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాలుగా ప్రూవ్ చేసుకొన్న యాక్టర్. సంజయ్ పాత్రలో మరోసారి ఓదిగిపోవడమే కాకుండా ప్రతీ సన్నివేశంలో వైవిధ్యాన్ని చూపించేందుకు ప్రయత్నించాడు. అలాగే గెటప్ పరంగా ఆకట్టుకొన్నాడు. మాళవిక నాయర్ మరోసారి అనుపమగా ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించింది. కీలక సన్నివేశాల్లో ఆమె నటన ఆకట్టుకొంటుంది. సంజయ్ ఫ్రెండ్‌గా నటించిన వాలైంటెన్ సినిమాను వినోదభరితంగా మార్చారు. మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ అంశాల గురించి

టెక్నికల్ అంశాల గురించి


పాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాకు మ్యూజిక్ వెన్నముక. కల్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ సన్నివేశాలను ఫీల్ గుడ్‌గా మార్చింది. పాటలు ఆడియోపరంగా ఆకట్టుకోవడమే కాకుండా.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటాడేలా ఉన్నాయి. ఈ సినిమాకు సినిమాటోఫ్రి మరో స్పెషల్ ఎట్రాక్షన్. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంత వర్క్ చేయాల్సి ఉండేదనిపిస్తుంది.

ఫైనల్ గా ఎలా ఉందంటే?

ఫైనల్ గా ఎలా ఉందంటే?

ఫన్; హ్యుమర్, ఎమోషన్స్ కలిసి ఉన్న చిత్రం ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. అయితే ఆ అంశాలు పూర్తిగా పండకపోవడం ఈ సినిమాకు ఓ మైనస్ కాగా.. మరీ సాడగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది. కాకపోతే నటీనటుల ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా కనిపించాయి. మ్యూజిక్ ఫీల్ గుడ్ గా ఉంటుంది. ప్రేమ కథలను, ఎమోషనల్ కంటెంట్ ఉండే చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. అవసరాల మేకింగ్ లైక్ చేసేవారు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X