»   » పోస్టర్ చిరిగింది...('ఫటా పోస్టర్ నికలా హీరో' రివ్యూ)

పోస్టర్ చిరిగింది...('ఫటా పోస్టర్ నికలా హీరో' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:
1.5/5

ట్రెండ్ ని పట్టుకోవాలని ప్రయత్నించి తన ఒరిజనాలిటిని వదిలేసి మరో పెద్ద దర్శకుడు బోల్తా పడ్డాడు. గతంలో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన రాజకుమార్ సంతోషి ... ప్రస్తుతం నడుస్తున్న పోలీస్, ఎంటర్టైన్మెంట్ అనే ట్రెండ్ ని పట్టుకోవాలని 'ఫటా పోస్టర్ నికలా హీరో' అంటూ దూకాడు. అయితే ఆ కథ మరీ పురాతన కాలం నాటిది తవ్వి తీసినట్లుగా ఉంది. ఇప్పటి తరానికి అప్ డేట్ కాకుండా మరీ ఎనభైల నాటి కామెడీ, అప్పటి సిట్యువేషన్స్ తోనే కథ,కథనం నడిపే ప్రయత్నం చేసారు. విలన్ ఇంకా షాడో లో ఉంచి ...సస్పెన్స్ గా కథ నడపటం, హీరో తండ్రే విలన్ అయ్యి మెలో డ్రామాకు ప్రయత్నించటం,ఓవర్ గా తల్లి సెంటిమెంట్, కామెడీ విలన్ పిచ్చి చేష్టలు వంటి ఎన్నో ఎలిమెంట్స్ కలగలపి చూసేవారికి తెరని చింపి పారిపోవాలనిపించేలా చేసాయి. ఇక తెలుగు నుంచి వెళ్లిన ఇలియానా మరీ జీరో సైజ్ కు మారిపోయి..గుర్తుపట్టలేని విధంగా ఎముకలతో గ్లామర్ ప్రదర్శన చేసి అలరించే ప్రయత్నం చేసి ఘోరంగా విఫలమైంది.


విశ్వాసరావు(షాహిద్ కపూర్) కి చిన్నప్పటి నుంచి సినిమా హీరో కావాలనే ఆశయం. వాళ్ల తల్లికి అతనో నిజాయితీ పోలీస్ అఫీసర్ అవ్వాలని ఆశ. దాంతో ప్రతీసారి పోలీస్ సెలక్షన్స్ కు వెళ్లి ఏదో విధంగా చెడకొట్టుకు వచ్చేస్తూంటాడు. అయితే అతనికి ముంబై నుంచి పోలీస్ సెలక్షన్ ఇంటర్వూ వస్తుంది. తప్పనిసరి పరిస్దితుల్లో ముంబై వెళ్లిన అతను అక్కడ తనకు నచ్చిన వృత్తి అయిన నటనలో ఎదగాలని వేషాలు కోసం ప్రయత్నాలు చేస్తూంటాడు. ఈ లోగా అతని తల్లి ...తన కొడుకు పోలీస్ అయ్యాడనుకుని ముంబై బయిలు దేరి వస్తుంది. దాంతో ఆమె ఎదురుగా మున్నాభాయ్ ఎంబిబియస్ తరహాలో పోలీస్ గా నటన మొదలెడతాడు. అక్కడ నుంచి ఏం జరిగింది అనేది మిగతా కథ.

ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఏమైంది అనిపిస్తోందా..ఆమె పేరు కంప్లైట్ కాజల్(ఇలియానా). అదృష్టవశాత్తు ఏ ప్లాష్ బ్యాకూ లేని ఈమె ఎప్పుడూ కంప్లైంట్స్ అంటూ పోలీస్ స్టేషన్స్ అంటూ తిరుగుతూంటే...(ధైర్యంగా)..పోలీసులు భయపడుతూంటారు..ఆమె వస్తూంటే ఏం కంప్లైంట్స్ పట్టుకొస్తుందా అని. ఇక సల్మాన్ ఖాన్ గెస్ట్ గా కనిపిస్తాడు. అయితే ఆయన గెస్ట్ రోల్ ..కేవలం దర్శకుడుతో మొహమాటానికే వేసాడని అర్దమైపోతుంది. ఎందుకంటే..సల్లూ భాయ్ కనపడే కొద్ది సేపూ థియోటర్స్ లో విజిల్ పడ్డాయి కానీ...సినిమాకు వన్ పర్శంట్ కూడా ఉపయోగం ఉండదు. ఫస్టాఫ్ బాగానే నడిపినా, సెకండాఫ్ మాత్రం చాలా డల్ గా బోర్ గా ఇంకా గట్టిగా చెప్పాలంటే స్టేజి ప్లే లా వీధి నాటకంగా ఆగిపోయి...అరిగిపోయిన డైలాగులతో నడుస్తూంటుంది.


మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

కెమిస్ట్రీ ఓకే...

కెమిస్ట్రీ ఓకే...

సినిమాలో హీరో,హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా పండలేదనే చెప్పాలి. అలాగే కామెడీ కూడా ఇద్దరి మధ్యా జరిగే సీన్స్ లో వర్కవుట్ కాలేదు. ఏదో మొక్కుబడికి ఎమోషన్ లెస్ గా ఇలియానా మాట్లాడుతూంటే మనకి మనమే కితకితలు పెట్టుకుని నవ్వుకోవాలి.

ఒన్ మ్యాన్ షో...

ఒన్ మ్యాన్ షో...

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇది షాహిద్ ఒన్ మ్యాన్ షో . సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపే ప్రయత్నం చేసాడు. పోలీస్ గా కూడా బాగానే నప్పాడు. అలాగే కామెడీ సీన్స్ లోనూ కొద్దిగా ఓవర్ అనిపించినా బాగానే నవ్వించాడు.

ఇలియానా...

ఇలియానా...

బర్ఫీతో బాలీవుడ్ ని మెప్పించిన ఇలియానా మరోసారి తన అందాల ప్రదర్శనకు ఈ పాత్రను ఎంచుకుంది. పెద్ద దర్శకుడు,పెద్ద హీరో అనుకుని దిగినా ఆమె అనుకున్న రీతిలో ఫెరఫార్మ్ చేయలేకపోయింది. అయితే ఆమె బాలీవుడ్ కి వెళ్లి ..జీరో సైజ్ తో చిత్రంగా కనిపించింది.

తల్లి సెంటిమెంట్,...

తల్లి సెంటిమెంట్,...

మున్నాభాయ్ లో తండ్రి సెంటిమెంట్ వర్కవుట్ చేసినట్లుగా ఇక్కడ తల్లి సెంటిమెంట్ ని ప్లే చేద్దామనే ప్రయత్నం చేసారు. ఆ సీన్స్ కూడా బాగా పండాయి. షాహిద్ కు తల్లి అంటే ప్రేమ, అందులోంచి పుట్టే సంఘర్షణ బాగున్నా..సెకండాఫ్ లో కథనం దారితప్పి విసిగించింది.

దర్శకుడు..

దర్శకుడు..

దర్శకుడు గా రాజకుమార్ సంతోషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ కున్న కమర్షియల్ దర్శకులలో ఒకరు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన సంతోషి ఈ సారి..స్క్రిప్ట్ ని ప్రక్కన పెట్టి కేవలం ఫన్ సిట్యువేషన్స్ ని పేర్చుకుని భాక్సాఫీస్ ని మెప్పిద్దామని ప్రయత్నం చేసారు.

టెక్నికల్...

టెక్నికల్...

స్క్రిప్టు పరంగా ...ఫస్టాఫ్ ఫన్ తో చకచకా నడిచిపోయినా సెకండాఫ్ మాత్రం చాలా విసిగిస్తుంది. సంగీత పరంగా రెండు పాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ట్రిమ్ చేసి లెంగ్త్ తగ్గించి ప్రేక్షకులని రక్షించాల్సిన అవసరం ఉంది. ఛాయాగ్రహణం ఫస్టాఫ్ లో ఉన్నట్లు సెకండాఫ్ లో లేదు. విచిత్రంగా మారిపోయింది. మిగతా విభాగాలు ఓకే అన్నట్లు ఉన్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

ఇలియానా

ఇలియానా

నటీనటులు: షాహిద్ కపూర్, ఇలియానా, పద్మిని కొల్హాపురి తదితరులు
రచన : రాజకుమార్ సంతోషి
సంగీతం: ప్రీతమ్
ఛాయా గ్రహణం: రవి యాదవ్
ఎడిటింగ్: స్టీవిన్ బెర్నాడ్
స్టూడియో: టిప్స్ మ్యూజిక్ ఫిల్మ్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజకుమార్ సంతోషి
నిర్మాత: రమేష్ తరుణి,రోనీ స్క్రూ వాలా, సిద్దార్దరాయ్ కపూర్
విడుదల తేది: 20,సెప్టెంబర్ 2013

ఫైనల్ గా రాజకుమార్ సంతోషినో, ఇలియానో చూసి ఎక్సపెక్టేషన్స్ తో వెళితే నిరాస తప్పదు. కామెడీ అని తీసిన ఈ చిత్రం సెకండాఫ్ లో ఏడిపిస్తుంది. కాబట్టి..ఫస్టాఫ్ చూసి రావటం బెస్ట్.

(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Shahid Kapoor-Ileana D’Cruz starrer Phata Poster Nikla Hero released today with negitive talk. If Phata Poster is meant to be a comedy, it isn’t funny. If it is an action film, then it’s so last decade. What it definitely is, is a disappointment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu