twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Plan B Movie review: డిఫరెంట్‌గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.. మాస్ మర్డర్ మిస్టరీగా..

    |

    నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, డింపుల్, మురళీశర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ, శాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర, చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్ తదితరులు

    సాంకేతిక నిపుణులు:
    కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కెవి రాజమహి
    నిర్మాత: ఏవీఆర్
    డివోపి: వెంకట్ గంగాధరి
    మ్యూజిక్: స్వర
    బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శక్తికాంత్ కార్తీక్
    ఎడిటర్: ఆవుల వెంకటేష్
    యాక్షన్: శంకర్ ఉయ్యాల
    ఆర్ట్: కృష్ణ చిత్తనుర్
    ప్రొడక్షన్ డిజైనర్: సతీష్ దాసరి
    డిటియస్: రాధాకృష్ణ
    డిఐ కలరిస్ట్: ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్
    సౌండ్ ఎఫెక్ట్స్: రఘునాథ్ కే
    రిలీజ్ డేట్: 2021-09-16

     Plan B Movie review and Rating

    లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి) ఊరికి వెళ్తూ హత్యకు గురవుతాడు. విశ్వనాథ్ ఫోన్ నుంచి తన తండ్రి ఫోన్‌కు హత్యకు గురైన ఫోటోలు వెళ్తాయి. దాంతో విశ్వనాథ్ హత్య గురించి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాశ్) చేపట్టిన సమయంలో ఓ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) హత్యకు గురవుతాడు. తన హత్యకు ముందు కూతురు అవంతిక (డింపుల్)కు ఇచ్చిన పది కోట్ల రూపాయలు చోరికి గురవుతాయి.

    లాయర్ విశ్వనాథ్ హత్య వెనుక అసలు కారణం ఏమిటి? ఈ మర్డర్ మిస్టరీలో కీలకంగా మారిన గౌతమ్ (సూర్య వశిష్ట) ప్లాన్ ఏమిటి? లాయర్ విశ్వనాథ్‌ను ఎవరు హత్య చేస్తారు? ప్రైవేట్‌ టీచర్‌ రిషి (అభినవ్ సర్దార్)ని ఎవరు? ఎందుకు మర్డర్ చేస్తారు? అవంతికకు తండ్రి రాజేంద్ర ఇచ్చిన 10 కోట్లరూపాయలు ఎలా మాయమయ్యాయి? పోలీసులకు లభించిన 10 కోట్ల రూపాయలు నకిలీ కరెన్సీగా ఎవరు మార్చారు? రాజేంద్ర హత్య వెనుక అసలు కారణం ఏమిటి? రాజేంద్ర హత్య వెనుక మాఫియా నాయకుడు (సద్దాం)కు ఎలాంటి సంబంధం ఉంది? ( లాయర్ విశ్వనాథ్ హత్య కేసు విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది? లాయర్ విశ్వనాథ్ హత్యకేసు దర్యాప్తులో ఏసీపీకి ఎలాంటి నిజాలు తెలిశాయి అనే ప్రశ్నలకు సమాధానమే ప్లాన్‌B చిత్రం కథ.

    ప్లాన్‌B చిత్ర కథ లాయర్ విశ్వనాథ్‌ మర్డర్ ఘటనతో ఆసక్తిగా మారుతుంది. అయితే విశ్వనాథ్ కేసు దర్యాప్తు మొదలు పెట్టిన ఏసీపీకి అంతు చిక్కని విషయాలు తెలుస్తుంటాయి. కథ ఊహించని విధంగా అనేక మలుపులు తిరుగుతూ మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అవంతిక భర్త ప్రైవేట్‌ టీచర్‌ రిషి (అభినవ్ సర్దార్) హత్యతో మరో ట్విస్టు కథలో కనిపిస్తుంది. అయితే ఇలా హంతకుల వేట కొనసాగుతుండగా.. ప్రీ క్లైమాక్స్‌లో కృత్రిమ గర్భధారణ అంశం సినిమాను మరో లెవెల్ తీసుకెళ్తుంది. కృత్రిమ గర్భధారణ ట్విస్టుతో సినిమా ఫీల్‌గుడ్‌గా మారుతుంది.

     Plan B Movie review

    థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పాయింట్స్‌తో పలు రకాల ట్విస్టులతో దర్శకుడు రాజమహి రూపొందించిన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రతీ 15 నిమిషాలకో ట్విస్టు ఉండటంతో కథలో ఏం జరుగుతుందనే ఉత్సుకత పెరుగుతుంది. కానీ అనేక రకాల ట్విస్టులు సగటు ప్రేక్షకుడికి గందరగోళం కల్పించే పరిస్థితి ఉందా అనిపిస్తుంది. అయితే ట్విస్టులను డీల్ చేసిన విధానం దర్శకుడు రాజమహి ప్రతిభకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. కృష్ణవంశీ, రాఘవేంద్ర రావు తదితరుల వద్ద దర్శకత్వ శాఖలో గడించిన విశేష అనుభవంతో కథను చక్కగా థ్రిల్లింగ్‌గా, చివర్లలో ఎమోషనల్‌గా మలచడంలో పరిణతిని చూపించాడు.

    ఇక శ్రీనివాస్ రెడ్డి కథ ఒపెనింగ్ సీన్‌లోనే మర్డర్ కావడంతో ఆ పాత్రపై ఆసక్తి పెరుగుతుంది. కానీ క్లైమాక్స్‌లో శ్రీనివాస్ రెడ్డి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే అప్పటి వరకు అనేక సందేహాలు ఉన్న కథకు శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఇస్తుంది. శ్రీనివాస్ రెడ్డికి ఉన్న అనుభవంతో తన పాత్రను సినిమాకు బలంగా మారేలా చేశాడు. ఇక ఈ సినిమాలో గౌతమ్‌గా సూర్య వశిష్ట (త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ స్వర్గీయ సత్యం కుమారుడు) పాత్ర ఆకట్టుకొనేలా ఉంటుంది. ఈ కథకు వెన్నముకగా నిలవడమే కాకుండా కొత్త వాడు అనే ఫీలింగ్‌ను కల్పించలేదని చెప్పవచ్చు. ఏసీపీగా మురళీ శర్మ మరోసారి తన పాత్రతో ఆకట్టుకొన్నాడు. డింపుల్, సద్దాం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. వెంకట్ గంగాధరి సినిమాటోగ్రఫి బాగుంది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన లైటింగ్‌తో ప్రత్యేక మూడ్‌ను క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. కథలో ఉండే ట్విస్టులను ఆవుల వెంకటేష్ చక్కగా పేర్చాడు. ఆవుల వెంకటేష్ ప్రతిభతోనే కథ ఆసక్తికరంగా సాగింది. ప్రధానంగా శక్తికాంత్ కార్తీక్ బీజీఎం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సౌండ్, ఆర్ట్స్ విభాగాల పనితీరు బాగుంది.

    Recommended Video

    Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu

    ఫైనల్‌గా సినిమా విషయానికి వస్తే.. థ్రిల్లింగ్, క్రైమ్, మర్డర్ మిస్టరీతో కూడిన చిత్రంగా ప్లాన్‌B రూపొందింది. తన తొలి చిత్రంతోనే దర్శకుడు రాజమహి ఆకట్టుకొన్నారు. వైవిధ్యం, క్లిష్టమైన కథను ఎంచుకొని మెప్పించడం ఆయన టాలెంట్‌కు అద్దం పట్టిందని చెప్పవచ్చు. మర్డర్ మిస్టరీ, థ్రిలర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.

    English summary
    Comedian srinivas reddy' Plan B movie is released on Septemeber 17th in theatres. Surya Vasishta, Dimple are the lead roles. Murali Sharma and Ravi prakash are in lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X