Pochamma Web Series Review: పోచమ్మ వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: అంబటి అర్జున్, రమేష్ ఇందిరా, అచ్యుత్ కుమార్, ప్రియా శతమార్షన్, స్నేహల్ కామత్, శృతి నాయుడు తదితరులు
దర్శకత్వం: రమేష్ ఇందిరా
నిర్మాత: శృతినాయుడు
మ్యూజిక్: ఎల్వీ ముత్తు గణేష్
సినిమాటోగ్రఫి: శ్రీషా కుడువల్లీ
ఎడిటర్: రాజేంద్ర ఉర్స్
ఓటీటీ రిలీజ్: ఆహా
ఓటీటీ రిలీజ్ డేట్: 2026-04-16

సంపన్న కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త ఫెడ్రిక్ (రమేష్ ఇందిరా) విలాసవంతమైన కాఫీ ఎస్టేట్‌ను కొనుగోలు చేస్తాడు. క్రిస్టియన్ మతానికి చెందిన ఫెడ్రిక్ ఆ కాఫీ ఎస్టేట్‌లో ఎన్నో ఏళ్లుగా కొలుస్తున్న పోచమ్మ దేవత విగ్రహాన్ని బలవంతంగా తొలగిస్తాడు. కాఫీ ఎస్టేట్ మేనేజర్ రఘుపతి (అచ్యుత్ కుమార్) వారిస్తున్నప్పటికీ పోచమ్మ విగ్రహాన్ని పీకి దూరంగా పడవేస్తారు. ఆ తర్వాత ఫెడ్రిక్ కుమార్తె జెస్పీ (స్నేహల్ కామత్) అకస్మాత్తుగా మరణిస్తుంది. ఆ తర్వాత దిగ్బ్రాంతికరమైన సంఘటనలు ఫెడ్రిక్ కుటుంబానికి ఎదురవుతాయి.

Pochamma Web Series Review

పోచమ్మ విగ్రహాన్ని ఎందుకు తొలగించాలని ఫెడ్రిక్ పట్టుబట్టాడు? రఘుపతి మాటను వినకపోవడం వల్ల ఫెడ్రిక్ కుటుంబం పోచమ్మ ఆగ్రహానికి గురైందా? జెస్సీ మరణం వెనుక ప్రమాదముందా? జెస్సీ సూసైడ్ వెనుక ప్రమాదమే కారణమా? జెస్పీ షాకింగ్ డెత్ వెనుక మరేదేమైనా కారణం ఉందా? ఫెడ్రిక్ కుటుంబాన్ని వెంటాడిన విషాద సంఘటనలు ఏమిటి? పోచమ్మ విగ్రహాన్ని పున:స్థాపించే ప్రయత్నం సక్సెస్ అయిందా? ఫెడ్రిక్ ఫ్యామిలీని రఘుపతి విపత్తుల నుంచి కాపాడాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ కథ.

పోచమ్మ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. జెస్సీ సూసైడ్ ఘటనతో సినిమా ఓ ట్విస్ట్‌తో మొదలవుతుంది. జెస్సీ మరణం చుట్టూ అల్లుకొన్న సన్నివేశాలు, పోలీస్ దర్యాప్తు అంశాలు గ్రిప్పింగ్‌గా, ఆడియెన్స్‌కు ఉత్సుకతను కల్పించే విధంగా దర్శకుడు రమేష్ రాసుకొన్న స్క్రీన్ ప్లే, సన్నివేశాలు ఆకట్టుకొంటాయి. మధ్యలో కథను కొంత సాగదీసినట్టు అనిపించినా.. పోచమ్మ విగ్రహాన్ని తొలగించే ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా డిజైన్ చేయడం హైలెట్‌గా అనిపిస్తుంది. వెబ్ సిరీస్‌లో కొన్ని సన్నివేశాలు, కథ ఊహించే విధంగా ఉండటం మైనస్ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌ను ముగించిన విధానం, పాత్రలను డిజైన్ చేసిన తీరు ఈ వెబ్ సిరీస్ థ్రిల్లింగ్‌గా, ఫీల్‌గుడ్‌గా మార్చింది. తెలుగు వారికి తెలియని, పరిచయం లేని నటీనటులు ఎక్కువగా ఉండటం వల్ల కొంత కనెక్ట్ మేరకు కనెక్ట్ అవ్వలేకపోయామనే ఫీలింగ్ ఉంటుంది. తెలుగు నటీనటులను ఎక్కువ ఎంచుకొని ఉంటే ఈ వెబ్ సిరీస్ మరింత చేరువై ఉండేదనిపిస్తుంది.

ఈ వెబ్ సిరీస్‌కు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగా భారమైన పాత్రలో ఫెడ్రిక్ ఆకట్టుకొన్నాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, లుక్ తన పాత్రకు సరిపోయేలా చక్కగా ఉంది. అంబటి అర్జున్ పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోతాడు. ప్రియా, స్నేహల్ గ్లామర్‌గానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. ఇక ఈ సినిమా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అచ్యుత్ కుమార్ రోల్. అండర్ డాగ్‌గా కనిపించి కథను తనవైపుకు తిప్పుకొనే తీరు బాగుంది. ఆడియెన్స్‌కు తన పాత్ర ద్వారా థ్రిల్లింగ్ మూమెంట్స్ పంచారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్‌కు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. పోచమ్మ కనిపించే ఎపిసోడ్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోరు చాలా బాగుంటుంది. పలు సన్నివేశాలను బీజీఎం ఎలివేట్ చేసింది. కాఫీ తోటలు, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో షూట్ చేసిన సన్నివేశాలు బాగున్నాయి. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. శృతినాయుడు అనుసరించిన నిర్మాణ విలువలు, పాత్రల కోసం ఎంపిక చేసిన నటీనటులను చూస్తే.. సినిమాపై వారికి ఉన్న తపన కనిపిస్తుంది. దైవత్వం, సస్పెన్స్ థ్రిల్లర్స్ సాగే వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి పోచమ్మ నచ్చుతుంది. ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్నది. తీరిక వేళను చూసుకొనే ఒకేసారి చూసేయండి.. మంచి అనుభూతి పంచుతుంది.

Read more about: aha ott Pochamma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X