Polimera 2 Review క్లైమాక్స్‌తో మెప్పించిన సస్పెన్స్ థ్రిల్లర్.. పొలిమేర 2 సమీక్ష

Rating: 2.75/5

నటీనటులు: స‌త్యం రాజేష్‌, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ తదితరులు
సమర్పణ: గౌరు గ‌ణ‌బాబు
నిర్మాత: గౌరికృష్ణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వ‌నాథ్
మ్యూజిక్: గ్యాని
సినిమాటోగ్రఫి: ఖుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్: శ్రీ వర
ఆర్ట్: ఉపేంద్ర రెడ్డి చందా
ఫైట్ మాస్టర్: రామ్ మాస్టర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ కుమార్

పొలిమేర 2 కథ..
జాస్తిపల్లి గ్రామానికి చెందిన కొమురయ్య (సత్యం రాజేశ్) అదృశ్యం కావడంతో అతడిని వెతికే పనిలో ఆయన సోదరుడు జంగయ్య (బాలదిత్య) ఉంటాడు. గ్రామంలో చోటు చేసుకొంటున్న అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఇన్స్‌పెక్టర్ రవీంద్ర నాయక్ ( రాకేందు మౌళి) వాటిపై ఆరా తీస్తుంటాడు. ఈ క్రమంలో కొమురయ్య తన గ్రామానికి చెందిన బలిజ (గెటప్ శ్రీను) భార్య రాముల (రమ్య)ను తీసుకొని కేరళకు వెళ్తాడు. ఆ క్రమంలో మరణాలకు కారణమైన పురాతన ఆలయంపై పురావస్తుశాఖ దృష్టిపెడుతుంది.

పొలిమేర 2 మూవీలో ట్విస్టులు
కొమురయ్య తన గ్రామానికి చెందిన వివాహితను తీసుకొని కేరళకు ఎందుకు వెళ్లాడు? కేరళలో ఎందుకోసం చేతబడులు చేస్తున్నాడు? కొమురయ్య సోదరుడు జంగయ్య అతడి కోసం ఎక్కడికి? ఎందుకు వెళ్లాడు? జాస్తిపల్లిలో అనుమానాస్పద మరణాలకు కారణాలు ఏమిటి? తన భార్య లక్ష్మీని కొమురయ్య ఎందుకు వదిలేసి వెళ్లాడు? కొమురయ్య జీవితంలోకి వచ్చిన కవిత ఎవరు? భర్త చేసిన అన్యాయంపై లక్ష్మీ ఎలా స్పందించిందనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మా ఊరి పొలిమేర 2 మూవీని థియేటర్లలో చూడాల్సిందే.

Polimera 2 Movie Review and Rating: Kamakshi Bhaskarla impressive Show

ఫస్టాఫ్ నిదానంగా..
మా ఊరి పొలిమేర సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించడంతో మా ఊరి పొలిమేర 2 పై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన కారణంగా ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. కాస్త నిదానంగానే సాగిందనిపిస్తుంది. తొలి భాగానికి సంబంధించిన అంశాలను చెప్పడానికి కొంత టైమ్ తీసుకోవడంతో కథను సాగదీసి చెప్పినట్టు అనిపిస్తుంది. అయితే స్లోగా సాగదీసినట్టుగా సాగే ఫస్టాఫ్‌లో చక్కటి ట్విస్టు ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని రేపాడనిపిస్తుంది.

సెకండాఫ్ జోష్‌తో
అయితే పొలిమేర 2 సినిమా సెకండాఫ్‌లో కూడా బలమైన కంటెంట్, ఆసక్తికరంగా సన్నివేశాలు లేకపోవడం కొంత నిరాశ పరుస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి స్టోరీ టేకాఫ్ అయిన విధానంతో అప్పటి వరకు రెగ్యులర్‌, రొటీన్‌గా సాగిన వ్యవహారానికి భిన్నంగా జోష్ పెరుగుతుంది. క్లైమాక్స్ వరకు ఎక్కడా కనిపించని లక్ష్మీ క్యారెక్టర్‌ ఒక్కసారిగా వైబ్రెంట్ కావడంతో సినిమాలో భారీ చలనం కలిగినట్టు అనిపిస్తుంది. పిల్లాడు బడిలో లేదా అమ్మ ఒడిలో అనే మంచి సందేశంతో సినిమాను భావోద్వేగంగా ముగించడం ఫీల్‌గుడ్‌గా మారింది.

Polimera 2 Movie Review and Rating: Kamakshi Bhaskarla impressive Show

కామాక్షి ఫెర్ఫార్మెన్స్‌తో
పొలిమేర 2 మూవీలో నటీనటులు విషయానికి వస్తే.. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపించకపోయినా లక్ష్మీ క్యారెక్టర్‌ హైలెట్‌గా అనిపిస్తుంది. ఎమోషనల్ క్లైమాక్స్‌తో సినిమాను నిలబెట్టడానికి లక్ష్మీ క్యారెక్టర్‌లో కామాక్షి భాస్కర్ల జీవించిన విధానానికి హ్యాట్పాఫ్ చెప్పాల్సిందే. డీ గ్లామరైజ్డ్ రోల్‌లో కూడా ఫెర్ఫార్మెన్స్ కారణంగా అందంగా ఆకట్టుకొన్నది. సత్యం రాజేశ్ మరోసారి డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నాడు. సత్యం రాజేశ్‌ను ఎక్కడా కనిపించకుండా కొమురయ్యగా తెర మీద విజృంభించారు. చివర్లో వచ్చిన పృథ్వీరాజ్ బబ్లూ, అలాగే కీలక పాత్రలో కనిపించిన బాలాదిత్య తమ ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే?
టెక్నికల్ విషయానికి వస్తే.. రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫి, గ్యానీ మ్యూజిక్ సినిమాలోని సన్నివేశాలను బాగా ఎలివేషన్ చేశాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరింత ఎమోషనల్‌గా మార్చింది. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొంత కట్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. గౌరికృష్ణ, గౌరు గణబాబు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఫస్టాఫ్‌లో కొంత నిరాశకు గురిచేసినా.. సెకండాఫ్‌లో తన ప్రతిభతో ఆకట్టుకొన్నారు.

Polimera 2 Movie Review and Rating: Kamakshi Bhaskarla impressive Show

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
చేతబడులు, మూఢ నమ్మకాలు, గ్రామీణ నేపథ్యం, మట్టిమనుషుల్లో అమాయకత్వం అంశాలన్నీ కలబోసి రూపొందించిన చిత్రం మా ఊరి పొలిమేర 2. అనిల్ విశ్వనాథ్ ఎంచుకొన్న పాయింట్‌ కొంత సాగదీసినట్టు ఉన్నప్పటికీ.. సెంకడాఫ్‌లో కథను చెప్పిన విధానం, మెసేజ్‌ను ప్రేక్షకులకు చేరవేసిన విధానం సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి పొలిమేర 2 నచ్చే అవకాశం ఉంది. నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్‌లో వచ్చింది. మీరు ఓసారి లుక్కేయండి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X