twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పొనుమగల్ వందాల్ మూవీ రివ్యూ.. ఫెర్ఫార్మెన్స్ అదరొట్టిన జ్యోతిక

    |

    Rating: 3/5

    నేటి సమాజంలో చిన్నారులపై మాన భంగాలు, హత్యలు చాలా కామన్‌గా మారిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంతో మంది మృగాళ్ల కాటుకు పిల్లలు బలవుతున్నారు. ఎన్నో కేసులకు తీర్పులు రాక ఫైళ్లలోనే మూలుగుతున్నాయి. ఇలాంటి భావోద్వేగ పరిస్థితులను కథగా మలచుకొని, చక్కటి కథనంతో హీరో సూర్య నిర్మాతగా, జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం పోన్‌మగల్ వందాల్. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన తొలి సినిమా ఎలా ఉందంటే..

    కథ ఏమిటంటే..

    కథ ఏమిటంటే..

    సైకో కిల్లర్ జ్యోతి ఎన్‌కౌంటర్‌తో కథ మొదలవుతుంది. 15 క్రితం పిల్లల్ని కిడ్నాప్, మర్డర్ చేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సైకో కిల్లర్‌ జ్యోతిని పట్టుకొనేందుకు జరిగిన ప్రయత్నంలో పోలీసులు కాల్పుల్లో ఆమె చనిపోతుంది. ఆ ఘటనకు సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తల క్లిప్పింగులతో కథలోకో వెళ్లుంది. 15 ఏళ్ల క్రితం సంచలనం రేపిన ఆ కేసును రీఓపెన్ చేయాలని అప్పుడే లాయర్ వృత్తిలోకి ప్రవేశించిన వెంబా (జ్యోతిక) నిర్ణయించుకొంటుంది. కోర్టులో జరిగే వాదనల మధ్య ప్రాసిక్యూషన్ లాయర్ ట్రాన్స్‌ఫరై ఆయన స్థానంలో రాజరత్నం (పార్తీబన్) రంగంలోకి వస్తాడు.

    కథలో మలుపులు

    కథలో మలుపులు

    15 ఏళ్ల తర్వాత సైకో జ్యోతి కేసును వెంబా ఎందుకు రీ ఓపెన్ చేయాలనుకొంటుంది. ఈ కేసులో రాజరత్నం ఎవరి ప్రయోజనాలకు కాపాడటానికి రంగంలో దూకారు. సైకో జ్యోతి చేసిన తప్పు ఏమిటి? సైకో జ్యోతి ఎలా చనిపోయింది? అప్రతిష్టపాలైన సైకో జ్యోతికి వెంబా ఎందుకు అండగా నిలువాలని కోరుకొంటుంది? ఈ కేసులో వరదరాజన్ (త్యాగరాజన్) పాత్ర ఏమిటి? వరదరాజన్‌ను రాజరత్నం ఎందుకు కాపాడాలనుకొంటాడు? చివరకు సైకో జ్యోతి కిడ్నాపర్, మర్డరర్ కాదని కోర్టు తేల్చిందా? అనే ప్రశ్నలకు సమాధానమే పోన్‌మగల్ వందాల్ చిత్ర కథ.

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    ఫస్టాఫ్ ఎనాలిసిస్

    పోన్‌మగల్ వందాల్ చిత్రం ఎమోషనల్ కోర్డు డ్రామాగా తెరకెక్కింది. కోర్టు వాదనలు, ప్రతివాదనలు ఆసక్తికరంగా సాగుతాయి. కథ, కథనాలు ఆసక్తికరంగా సాగడంతో, అనేక భావోద్వేగాలతో ముందుకు సాగడం వల్ల ప్రేక్షకుడిలో మరింత ఇంట్రెస్ట్‌ కలుగజేస్తుంది. జ్యోతిక చేత దర్శకుడు ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడం ద్వారా కథ మలుపు తిరగడమే కాకుండా తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ ఎనాలిసిస్

    సెకండాఫ్ ఎనాలిసిస్

    జ్యోతికకు సంబంధించిన ఓ ట్విస్ట్‌ రీవీల్ కావడంతో రెండో భాగంపై క్యూరియాసిటీ పెరుగుతుంది. రెండో భాగంలో ప్రాసిక్యూటివ్ లాయర్ రాజరత్నం, డిఫెన్స్ లాయర్ వెంబా మధ్య పోటా పోటీగా వాదనలు, సన్నివేశాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. వరదరాజన్ పాత్ర సెకండాఫ్‌లో కీలకం కావడంతో కథలో మరింత ఇంటెన్సిటీని పెంచుతుంది. ఇక క్లైమాక్స్‌లో రివీల్ చేసిన మరో ట్విస్టు కథను మరింత ఫీల్‌గుడ్‌గా మారుస్తుంది. వెంబా తను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోవడం వల్ల కథ ఎమోషనల్‌గా ముగుస్తుంది.

    దర్శకుడు కథ, కథనాలు

    దర్శకుడు కథ, కథనాలు

    దర్శకుడు జేజే ఫెడ్రిక్ రాసుకొన్న కథ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను గుర్తు చేస్తుంది. కథను నడిపించిన తీరు హృదయాన్ని టచ్ చేస్తుంది. సమాజంలో చిన్నపిల్లలపై మానభంగాలు, హత్యలు, దారుణమైన పరిస్థితుల ఆధారంగా రాసుకొన్న కథను తెరకెక్కించిన తీరు దర్శకుడిలోని సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఈ సినిమాకు ఫెడ్రిక్ రాసుకొన్న స్క్రీన్ ప్లే బలంగా నిలిచిందని చెప్పవచ్చు. డైలాగ్స్, పాటలు సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

    జ్యోతిక ఫెర్ఫార్మెన్స్

    జ్యోతిక ఫెర్ఫార్మెన్స్

    ఇక జ్యోతిక రెండు కోణాలు ఉన్న పాత్రల్లో అద్బుతంగా పోషించింది. కోర్టులో ఆవేశం, తన ఆశయాన్ని సాధించాలనే పట్టుదల లాయర్‌గా, తన లక్ష్య సాధనలో తటస్తించే ప్రతికూల పరిస్థితులను ఎదురించే మహిళగా తన నటనతో అదరగొట్టింది. కళ్లతో పలికించిన ఎమోషన్స్ ఆమె ఫెర్ఫార్మెన్స్ సాక్ష్యంగా నిలుస్తాయి. సెకండాఫ్‌లో జ్యోతిక యాక్టింగ్ ప్రతి ఒక్కరి గుండెను టచ్ చేయడం ఖాయం.

    ఇతర పాత్రల్లో

    ఇతర పాత్రల్లో

    వెంబా తండ్రిగా భాగ్యరాజ్ తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. కూతురి పడే బాధతో కుమిలిపోయే తండ్రిగా తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక కరుడు గట్టిన లాయర్‌గా పార్తీబన్ ఆకట్టుకొన్నాడు. ఇక ఓ ప్రత్యేకమైన విలనిజంతో వరదరాజన్‌గా త్యాగరాజన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక జడ్జిగా ప్రతాప్ పోతన్ ఆకట్టుకొన్నారు. భాగ్యరాజ్, పార్తీబన్, త్యాగరాజన్ సినిమాకు వెన్నముకగా నిలిచారని చెప్పవచ్చు.

    సాంకేతిక నిపుణుల గురించి

    సాంకేతిక నిపుణుల గురించి

    సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పోన్‌మగల్ వందాల్ సినిమాకు రీరికార్డింగ్ కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎమోషనల్ సీన్లను ఎలివేట్ చేయడంలో గోవింద వసంత మ్యూజిక్ ప్రధాన పాత్ర పొషించిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాంజీ అందించిన సినిమాటోగ్రఫి మూవీకి మరో స్పెషల్ ఎట్రాక్షన్. సీన్లను అందంగా, ఆర్టిస్టిక్‌గా తీసి ఆకట్టుకొన్నాడు. రుబెన్ ఎడిటింగ్ బాగుంది.

    Recommended Video

    Amazon Prime : Seven Movies To Release Directly On Amazon Prime Video
    సూర్య నిర్మాతగా, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    సూర్య నిర్మాతగా, ప్రొడక్షన్ వ్యాల్యూస్

    పోన్‌మగల్ వందాల్ సినిమాకు హీరో సూర్య నిర్మాత. తన భార్య కోసం ఎంపిక చేసుకొన్న కథ, కథనాల విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక సినిమాను చాలా రిచ్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించిన తీరు నిర్మాతగా ఆయనకు హ్యాట్పాఫ్ చెప్పాల్సిందే. సూర్య పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా పోన్‌మగల్ వందాల్ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు. మూసగా సాగే కోర్టు డ్రామా కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. లీగల్ కథాంశం ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.

    English summary
    Ponmagal Vandhal Tamil legal drama film written and directed by J. J. Fredrick in his debut, and produced by Suriya. The film stars Jyothika leading an ensemble cast including R. Parthiban, K. Bhagyaraj, Thiagarajan, Pandiarajan and Pratap Pothen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X