Ponniyin Selvan 2 Review మణిరత్నం మేకింగ్, టేకింగ్ సూపర్బ్.. విజువల్ ట్రీట్‌గా పొన్నియన్ సెల్వన్ 2

Rating: 3.5/5

నటీనటులు: విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, జయం రవి, ప్రభు, ఆర్ శరత్ కుమార్, పార్తీపన్, రెహ్మాన్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
డైలాగ్స్: బీ జయమోహన్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్
సినిమాటోగ్రఫి: రవి వర్మన్
మ్యూజిక్: ఏఆర్ రెహ్మాన్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-04-28

పొన్నియన్ సెల్వన్ 2 కథ ఏమిటంటే?: ఉత్తర చోళ సామ్రాజ్య యువరాజు, సైన్యాధ్యక్షుడు ఆదిత్య కరికాలన్ (విక్రమ్)తో ప్రేమ బంధం విఫలం కావడంతో తనపై పగ ప్రతీకారంతో పాండ్య సామ్రాజ్య రాణి, అనాథ నందిని (ఐశ్వర్యరాయ్) జ్వలించుకుపోతుంది. ఆదిత్య కరికాలుడిపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటుంది.

అంతేకాకుండా తన జన్మకు కారణమైన తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుక్కొంటుంది. ఇదిలా ఉండగా యుద్ధంలో గాయపడి నదిలో కొట్టుకుపోయిన అరుణ్ మొళి వర్మ అలియాస్ పొన్నియన్ సెల్వన్ తిరిగి రాజ్యానికి చేరుకోవడమే కాకుండా దేశాన్ని పాలించేందుకు అర్హత సంపాదిస్తాడు.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

పొన్నియన్ సెల్వన్ 2 కథలో ట్విస్టులు: ఆదిత్య కరికాలన్‌తో నందిని ప్రేమ వ్యవహారం ఎలా బెడిసి కొట్టింది? నందిని పుట్టుకకు కారణమైన వ్యక్తి ఎవరు? ఆదిత్య కరికాలన్‌పై నందిని ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటుంది? చోళ సామ్రాజ్యంలో సమస్య తలెత్తినప్పుడు ఆదుకొనే మందాకిని అలియాస్ మూగ రాణి (ఐశ్వర్యరాయ్ బచ్చన్) ఎవరు? చిన్ననాటి స్నేహితురాలు నందినిని ప్రేమించిన ఆదిత్య కరికాలుడు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో నందిని తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది? చోళ రాజ్యాధికారాన్ని పొన్నియన్ సెల్వన్ చేపట్టాడా? అనే ప్రశ్నలకు సమాధానమే పొన్నియన్ సెల్వన్ 2 సినిమా కథ.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

ఫస్టాఫ్ ఎలా సాగిందంటే?: పొన్నియన్ సెల్వన్ తొలిభాగంలో కీలక అంశం నందిని, ఆదిత్య కరికాలుడి బంధం గురించి క్లుప్తంగా వివరించి.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పొన్నియన్ సెల్వన్ 2 కథలోకి తీసుకెళ్లడం దర్శకుడు మణిరత్నం టేకింగ్ పరంగా మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు.

వల్లవరాయన్ వందియదేవుడు (కార్తీ) క్యారెక్టర్‌తో కథను నడిపిస్తూ భావోద్వేగ అంశాలతో ప్రధాన కథలోకి తీసుకెళ్లడంతో ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా చేశాడు. ఓ మంచి ట్విస్టుతో పొన్నియన్ సెల్వన్ 2 ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై ఆసక్తిని రేపేలా చేశాడు.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ప్రాణంగా..: ఇక సెకండాఫ్‌లో ఆధిత్య కరికాలుడు, నందిని మధ్య పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లడంలో మణిరత్నం సక్సెస్ అయ్యారు. అలాగే నందిని జన్మకు కారణమైన తండ్రి ఎవరనే తెలిపే సన్నివేశాలు సినిమాకు మరింత ఆకర్షణగా మారాయి. ఇక క్లైమాక్స్‌లో సుందర చోళ (ప్రకాశ్ రాజ్) సోదరుడు మధురాంతకన్ (రెహ్మాన్), పొన్నియన్ సెల్వన్ మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేసేలా ఉన్నాయి.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

దర్శకుడు మణిరత్నం గురించి: కల్కి కృష్ణమూర్తి రాసిన చరిత్ర ఆధారంగా దర్శకుడు మణిరత్నం డిజైన్ చేసుకొన్న పాత్రలు పొన్నియన్ సెల్వన్ సినిమాలో మరింత బలంగా కనిపించాయి. ప్రతీ పాత్రను కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా పూర్తిగా ఎమోషనల్ కంటెంట్, డైలాగ్స్‌తో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించేలా చేశారు.

ప్రతీ చిన్న క్యారెక్టర్ నుంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్ల నుంచి హావభావాలు రాబట్టుకోవడం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టాయి. ప్రతీ క్యారెక్టర్‌ను పోషించిన నటీనటులు తమ పాత్రల్లో కనిపించారు గానీ.. యాక్టర్లుగా ఎక్కడా కనిపించనంతగా ఫెర్ఫార్మ్ చేశారు.

నటీనటులు పెర్ఫార్మెన్స్ గురించి: ఇక నటీనటుల విషయానికి వస్తే.. ప్రధాన పాత్రల్లో కనిపించిన విక్రమ్ అదిత్య కరికాలుడిగా, నందినిగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సినిమాకు తమ నటనతో ప్రాణం పోశారు. అండర్ డాగ్ క్యారెక్టర్లుగా కనిపించే కార్తీ (వల్లవరాయన్ వందియదేవుడు), జయం రవి (పొన్నియన్ సెల్వన్) పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

ఫస్ట్ పార్ట్‌ను తన భుజాల మీద వేసుకొని నడిపించిన కుందవై (త్రిష) సెకండ్ పార్ట్‌లో అతిథి పాత్రగానే మిగిలిపోయింది. నందిని తల్లి మూగ రాణి (ఐశ్వర్యరాయ్) పాత్రను మరింత డీటైల్‌గా చూపించి ఉండే బాగుండేదనిపిస్తుంది. సుందర చోళగా ప్రకాశ్ రాజ్, మధురాంతకన్‌గా రెహ్మాన్, నంబి పాత్రలో జయరాం తమ పాత్రల పరిధి మేరకు రాణించారు. మిగితా పాత్రల్లో కనిపించిన శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ పాత్రలకు పెద్దగా స్కోప్ లేకపోయింది.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి: ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. మ్యూజిక్, ఆర్ట్, గ్రాఫిక్ వర్క్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ అందించిన రీరికార్డింగ్ అద్బుతంగా ఉందని చెప్పవచ్చు. పలు సన్నివేశాలను తన మ్యూజిక్‌తో భావోద్వేగంగా మలచడంలో ఆర్ రెహ్మాన్ సూపర్బ్ అనిపిస్తాడు. ఇద్దరు, బొంబాయి సినిమాల తర్వాత ఆ రేంజ్ స్థాయి మ్యూజిక్‌ను రెహ్మాన్ అందించారు.

ఆర్ట్ విభాగం పనితీరు సినిమాను చాలా గ్రాండ్‌గా మార్చింది. రవి వర్మన్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. అవుట్ డోర్‌లోను, ఇండోర్‌లోను ఆయన వాడుకొన్న లైటింగ్ చాలా కొత్త అనుభూతిని పంచింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పర్‌ఫెక్షన్ తెచ్చిపెట్టింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు టాప్ క్లాస్‌గా ఉన్నాయి.

Ponniyin Selvan 2 Review and Rating: Mani Ratnams craft makes Histrical movie Visual treat

ఫైనల్‌గా ఎలా ఉందంటే?: ప్రేమ, పగ, ప్రతీకారం, రాజ్య కాంక్ష, ఎత్తులుపై ఎత్తులు లాంటి అంశాలతో భావోద్వేగంగా రూపొందిన చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. ఈ సినిమా కథ పక్కా తమిళ నేటివిటితో ఉన్నప్పటికీ.. తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేనప్పటికీ.. ఆ కథను భావోద్వేగంగా మలచడం మణిరత్నం వల్లే సాధ్యపడిందనిపిస్తుంది.

పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులు, వారి ఫెర్ఫార్మెన్స్ కారణంగానే ఈ సినిమా మరో రేంజ్‌లో ఉందనిపిస్తుంది. సాంకేతిక నిపుణుల పనితీరు, డైలాగ్స్ సినిమాకు ఆయువుపట్టుగా మారాయి. మణిరత్నం టేకింగ్, మేకింగ్, రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు పైసా వసూల్‌గా మారాయి. అంచనాలు పెట్టుకొని వెళ్లినా.. అంచనాలు లేకుండా వెళ్లినా పొన్నియన్ సెల్వన్ ఎలాంటి నిరాశకు, అసంతృప్తికి గురిచేయదు. చాలా రోజుల తర్వాత మంచి విందు భోజనం తింటే కలిగే తృప్తి పొన్నియన్ సెల్వన్ 2 కలిగిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X