twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ponniyin Selvan: I review మణిరత్నం మ్యాజిక్ వర్కవుట్ అయిందా? మూవీ గ్రాండియర్‌గానే..కానీ!

    |

    Rating:
    3.0/5

    భారతీయ చరిత్రలో 947-1014 కాలంలో చోళ సామ్రాజ్యంలో రాజరాజ చోళ చక్రవర్తి అరుళ్‌మోజీవర్మన్ జీవితానికి సంబంధించిన కథను సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌గా మూవీని దృశ్యకావ్యంగా మలిచాడు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్ లాంటి అగ్రతారలు నటించారు. ఈ చిత్రం సెప్లెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం వెండితెర మీద ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది? మణిరత్నం మళ్లీ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేశాడా? అనే వివరాలను తెలుసుకొందాం..

    పొన్నియన్ సెల్వన్ కథ ఏమిటంటే?

    పొన్నియన్ సెల్వన్ కథ ఏమిటంటే?

    సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాండ్య, రాష్ట్రకూటులు, ఇతర దేశాలను హస్తగతం చేసుకోవడంతో పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. విక్రమ్ (ఆదిత్య) తన సైన్యంలో వీరుడు కార్తీని తన తండ్రి సుందరచోళ వద్దకు పంపడంతో కథ ఊపందుకొంటుంది. సుందర చోళ చుట్టు.. అంత:పురంలో జరిగే కుట్రలు, వ్యూహాలతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథ సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా.. పాత్రల మధ్య సంబంధాలను వివరించే క్రమంలో దర్శకుడు మణిరత్నం తడబాటుకు గురయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా అర్ధం కాని కథను తెర మీద మరింత క్లిష్టంగా మార్చాడు. విక్రమ్ (ఆదిత్య), ఐశ్వర్య రాయ్ (నందిని) మధ్య రిలేషన్ ఏమిటి? నాజర్‌కు, అలాగే శరత్ కుమార్‌కు ఐశ్వర్యరాయ్‌కి మధ్య ఎలాంటి బంధం ఉందనే విషయాన్ని స్పష్టీకరించలేకపోవడం కంగాళీగా మారుతుంది. ఇక తాను తన ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన నందిని (ఐశ్వర్య) వ్యవహార తీరుతో ఆదిత్య (విక్రమ్) మనస్తాపం చెందడం అనే ఎమోషనల్ విషయాన్ని క్లారిటీతో చెప్పలేకపోయారనిపిస్తుంద. ఇలా ఫస్టాఫ్ రకరకాల గందరగోళాల మధ్య ముగుస్తుంది.

    పొన్నియన్ కథలో ట్విస్టులు

    పొన్నియన్ కథలో ట్విస్టులు

    ఇక సెకండాఫ్‌లో అసలు కథ, పాత్రల మధ్య బంధాలు, వైరాలను కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేయడం కాస్త ఉపశమనం కలుగుతుంది. అప్పటికే గందరగోళానికి లోనైన ప్రేక్షకుడికి ఈ కథతో ట్రావెల్ చేయడం కష్టంగా మారుతుంది. ఇక సెకండాఫ్‌లో కార్తీ, జయం రవి మధ్య సన్నివేశాలు, త్రిష, ఐశ్వర్య రాయ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇక సముద్ర కుమారి పాత్ర కూడా కథలో కొసమెరుపుగా మారుతుంది. చివర్లలో ఒక మంచి ట్విస్టు ఇచ్చి పొన్నియన్ సెల్వన్ 2 పై అంచనాలు పెంచే ప్రయత్నం జరిగింది.

    ఫస్టాఫ్ గందరగోళంగా

    ఫస్టాఫ్ గందరగోళంగా


    పాండ్యుల నుంచి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడం పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. విక్రమ్ (ఆదిత్య) తన సైన్యంలో వీరుడు కార్తీని తన తండ్రి సుందరచోళ వద్దకు పంపడంతో కథ ఊపందుకొంటుంది. సుందర చోళ చుట్టు.. అంత:పురంలో జరిగే కుట్రలు, వ్యూహాలతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథ సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా.. పాత్రల మధ్య సంబంధాలను వివరించే క్రమంలో దర్శకుడు మణిరత్నం తడబాటుకు గురయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా అర్ధం కాని కథను తెర మీద మరింత క్లిష్టంగా మార్చాడు. విక్రమ్ (ఆదిత్య), ఐశ్వర్య రాయ్ (నందిని) మధ్య రిలేషన్ ఏమిటి? నాజర్‌కు, అలాగే శరత్ కుమార్‌కు ఐశ్వర్యరాయ్‌కి మధ్య ఎలాంటి బంధం ఉందనే విషయాన్ని స్పష్టీకరించలేకపోవడం కంగాళీగా మారుతుంది. ఇక తాను తన ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన నందిని (ఐశ్వర్య) వ్యవహార తీరుతో ఆదిత్య (విక్రమ్) మనస్తాపం చెందడం అనే ఎమోషనల్ విషయాన్ని క్లారిటీతో చెప్పలేకపోయారనిపిస్తుంద. ఇలా ఫస్టాఫ్ రకరకాల గందరగోళాల మధ్య ముగుస్తుంది.

    సెకండాఫ్‌  ఆసక్తికరంగా,  ఉద్వేగంగా

    సెకండాఫ్‌ ఆసక్తికరంగా, ఉద్వేగంగా

    ఇక సెకండాఫ్‌లో అసలు కథ, పాత్రల మధ్య బంధాలు, వైరాలను కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేయడం కాస్త ఉపశమనం కలుగుతుంది. అప్పటికే గందరగోళానికి లోనైన ప్రేక్షకుడికి ఈ కథతో ట్రావెల్ చేయడం కష్టంగా మారుతుంది. ఇక సెకండాఫ్‌లో కార్తీ, జయం రవి మధ్య సన్నివేశాలు, త్రిష, ఐశ్వర్య రాయ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇక సముద్ర కుమారి పాత్ర కూడా కథలో కొసమెరుపుగా మారుతుంది. చివర్లలో ఒక మంచి ట్విస్టు ఇచ్చి పొన్నియన్ సెల్వన్ 2 పై అంచనాలు పెంచే ప్రయత్నం జరిగింది.

    మణిరత్నం తడబాటు

    మణిరత్నం తడబాటు

    పొన్నియన్ సెల్వన్ కథలో రకరకాల పాత్రలు, పాత్రలకు సంబంధించిన డెస్ట్, వాటి మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్‌ను చక్కగా ప్రజెంట్ చేయడంలో మణిరత్నం విఫలమయ్యాడు. అయితే కథను తెర మీద గ్రాండియర్‌గా చూపించేందుకు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే కథలో పాత్రలు ఎక్కువ కావడంతో.. ఏ పాత్ర కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. ఒకవేళ పార్ట్ 2లో కొన్ని పాత్రలకు స్క్రీన్ టైమ్ కేటాయిస్తే.. చక్కటి అనుభూతి కలిగించే అవకాశం ఉంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. పార్ట్ 1 విషయానికి వస్తే 100 మార్కులకు 50 మార్కులతో పాస్‌ అయ్యాడనే చెప్పాలి.

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్

    నటీనటులు ఫెర్ఫార్మెన్స్


    ఇక నటీనటుల విషయానికి వస్తే ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయాడు. అయితే తన పాత్ర స్వభావం పూర్తిగా స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ కాకపోవడంతో విక్రమ్ ఫెర్ఫార్మెన్స్‌కు రెస్సాన్స్ కనిపించదు. ఈ సినిమాలో ఎక్కువగా ఆకట్టుకొన్న పాత్ర కుందవల్లిగా త్రిష కనిపించింది. ఈ కథలో పార్ట్ 1 విషయానికి వస్తే త్రిషనే డామినేట్ చేసింది. ఐశ్వర్య రాయ్ పాత్ర అక్కడక్కడ మెరుపులు మెరిపించింది. జయం రవి, కార్తీ తమ పాత్రల్లో ఒదిగిపోవడమే కాకుండా సినిమాకు ప్రాణంగా నిలిచారు.

    కనిపించని ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్

    కనిపించని ఏఆర్ రెహ్మాన్ మ్యాజిక్

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రవి వర్మన్ సినిమాటోగ్రఫి అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక శ్రీకర్ ప్రసాద్‌కు ఈ సినిమా ఎడిటింగ్ కత్తిమీద సాములానే మారిందనే విషయం స్పష్టమైంది. అయితే కథ, స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు ఎడిటర్‌గా కొంత రాజీ పడ్డారనే కనిపిస్తుంది. అలాగే ఏఆర్ రెహ్మన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బ్రహ్మండంగా ఉంది. పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. సినిమాకు గ్రాండియర్ లుక్ తీసుకు రావడంలో వారి పనితనం కనిపిస్తుంది. నేలకు తలవంచిన వాడు ఆకాశానికి ఎదుగుతాడు లాంటి డైలాగ్స్‌తో తనికెళ్ల భరణి ఆకట్టుకొన్నాడు. ఐశ్వర, కార్తీ, అలాగే కార్తీ, త్రిష మధ్య ఉండే రొమాంటిక్ డైలాగ్స్ ప్రేక్షకుడిని ఉల్లాసానికి గురిచేస్తాయి.

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా ఎలా ఉందంటే?


    రాజాధ్యికారం చేజిక్కించుకొనే క్రమంలో ఓ దేశంలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, ప్రేమ, భావోద్వేగాలు, రక్తపాతం లాంటి అంశాలు కలబోసి ఉండటమే కాకుండా హై రేంజ్‌లో ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేయాల్సి ఉంటుంది. కానీ పొన్నియన్ సెల్వన్‌లో అలాంటి పరిస్థితి కనిపించదు. కథా ప్రవాహం సరైన దిశగా జరగకపోవడం, కథ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చెప్పకపోవడం ఈ సినిమాకు మైనస్. ఇక పూర్తిగా తమిళలకు సంబంధించిన చోళ, పాండ్య కథలు తెలుగు వారికి తెలియకపోవడం వల్ల పొన్నియెన్ సెల్వన్‌ను ఎలా ఓన్ చేసుకొంటారనేది ప్రశ్నార్థకమే. ఇలాంటి మిశ్రమ అంశాలు ఉన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    యాక్షన్ ఎపిసోడ్స్
    మణిరత్నం టేకింగ్
    విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిషా ఫెర్ఫార్మెన్స్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    ఫస్టాఫ్
    స్లో నేరేషన్

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు: విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, కార్తీ, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా దూలిపాళ, ప్రభు, ఆర్ శరత్ కుమార్, జయరాం, ప్రకాశ్ రాజ్, రహమన్ తదితరులు
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
    డైలాగ్స్: బీ జయమోహన్
    నిర్మాత: శుభాస్కరన్, మణిరత్నం
    సినిమాటోగ్రఫి: రవివర్మన్
    ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
    మ్యూజిక్ం ఏఆర్ రెహ్మన్
    బ్యానర్ం మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్
    రన్‌టైమ్: 167 నిమిషాలు
    రిలీజ్: 2022-09-30

    English summary
    Mani Ratnam's Ponniyin Selvan: I movie is hits the screen on September 30th. Trisha Krishnan, Aishwarya Rai Bachchan, Vikram are in the lead roles. Here is the exclusive review of the movie by Telugu filmibeat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X