Ponniyin Selvan II first Review మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుకు ఇచ్చిన రేటింగ్ ఎంతంటే? హిట్టా? ఫట్టా?
ఇండియాలో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ చిత్రం పార్ట్ 2 రిలీజ్‌కు సిద్దమైంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రం రిలీజై రికార్డు కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, ఐశ్వర్య తదితరులు నటించిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అవుతున్నది. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్లు, ట్రైలర్లు భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాపై ప్రముఖ క్రిటిక్ ఎలాంటి రివ్యూను ఇచ్చారంటే?
మణిరత్నం లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్టుగా
పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పెన్నియన్ సెల్వన్ గ్రంథం ఆధారంగా తెరకెక్కింది. తన లైఫ్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్టును లైకా ప్రొడక్షన్ బ్యానర్ అధినేత సుభాస్కరన్‌తో చేతులు కలిపి ఈ సినిమాను క్రేజీ ప్రాజెక్టుగా మలిచాడు. భారీ తారాగణంతో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేయడంలో మణిరత్నం సఫలమయ్యారు.

గితా భాషల్లో పొన్నియన్ సెల్వన్
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రం విడుదలై తమిళ ప్రేక్షకులు ఉన్న ప్రాంతాల్లో భారీ విజయాన్ని అందుకొన్నది. అయితే ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా మిగితా భాషల్లో ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో బిజినెస్ కావడానికి చాలా కష్టంగా మారిందనే టాక్ మీడియాలో కనిపిస్తున్నది.
భారీ ప్రమోషన్స్‌తో మణిరత్నం టీమ్
అయితే పొన్నియన్ సెల్వన్ తమిళ వెర్షన్ అందించిన విజయంతో మణిరత్నం, విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి అగ్ర నటులు దేశం మొత్తం పర్యటిస్తూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచే ప్లాన్‌తో టీమ్ ముందుకెళ్తున్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, కేరళ, ముంబై, ఢిల్లీ నగరాల్లో భారీగా ప్రచారం చేస్తున్నది.
ఉమేర్ సంధూ రివూ
ఇక దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ఇటీవల ఆ దేశపు సెన్సార్ అధికారులతో కలిసి పొన్నియన్ సెల్వన్ 2 సినిమా చూశాడు. అయితే పలు సినిమాలను దుబాయ్ సెన్సారింగ్‌లో ట్వీట్ల రూపంలో పెడుతుంటాడు అయితే తాను పెట్టిన ప్రతీ ట్వీట్ రివ్యూ దారుణంగా ఫ్లాప్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాను బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు దారుణమైన ఫలితాన్ని చూసిన సంగతి తెలిసిందే.
పొన్నియన్ సెల్వన్ 2 రేటింగ్ ఎంతంటే?
అయితే పొన్నియన్ సెల్వన్ గురించి ట్విట్టర్‌లో తన రివ్యూను తాజాగా పోస్టు చేశారు. పొన్నియన్ సెల్వన్ 2 సినిమాను చూశాను. ప్రేక్షకులకు బోరింగ్, టార్చర్‌ను ఈ సినిమా పంచింది. ఈ సినిమాలో ప్రతీ అంశం ఫేక్. వీలైతే ఈ సినిమాను చూడకుండా వదిలేయండి. నా రేటింగ్ 2/5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఎలాంటి అనుభూతిని పంచుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











