For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Back Door movie review.. రొమాన్స్‌తో పూర్ణ అదుర్స్.. వివాహేతర సంబంధంతో..

  |

  Rating: 2.5/5

  ఇద్దరు పిల్లలు ఉన్న అంజలి (పూర్ణ) ఓ బిజినెస్‌‌మెన్ భార్య. భర్త వ్యాపార వ్యవహారాలతో బిజీగా ఉండటం, పిల్లలు స్కూల్‌కు వెళ్లడంతో ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ వేడుకలో పరిచయమైన అరుణ్‌ (తేజా త్రిపురాణ) ఆకర్షణకు గురి అవుతుంది. అరుణ్ మాట్లాడే తీరు, మాటలకు అంజలి ఫిదా అవుతుంది. ఆ పరిచయం వారిద్దరిని మానసికంగా దగ్గరకు చేస్తుంది. అయితే అంజలి అందానికి ముగ్దుడైన అరుణ్ ఆమెతో శారీరక అనుభవాన్ని పొందాలనుకొంటాడు. కానీ అరుణ్ కోరికకు అంజలి అడ్డుకట్టవేస్తూ తప్పించుకొంటూ ఉంటుంది.

  అయితే అప్పటికే ఒకరికి భార్య అయిన అంజలి తనకంటే చిన్నవాడైన అరుణ్‌కు ఎందుకు ఆకర్షితురాలైంది. అరుణ్‌ను ఇష్టపడిన అంజలి తన బలహీనతలను అణిచివేసిందా? అరుణ్ కోరికకు అంజలి దాసోహమైందా? లేక అరుణ్‌ను హద్దు దాటకుండా ఎలా కట్టడి చేసింది. అరుణ్, అంజలి రిలేషన్ చివరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనే ప్రశ్నలకు భావోద్వేగమైన సమాధానమే బ్యాక్ డోర్ సినిమా కథ.

  బ్యాక్ డోర్ సినిమాలో పూర్ణ నటన, గ్లామర్, కళ్లతో కవ్వించే అంశాలు, కాస్త బోల్డుగా నటించిన సన్నివేశాలు పాజిటివ్‌గా కనిపిస్తాయి. తేజ కూడా తన పాత్ర పరిధి మేరకు మెప్పించడానే చెప్పవచ్చు. తనకంటే వయసులో పెద్దదైన గృహిణితో ప్రేమలో పడిన పాత్రను బాగా ఎలివేట్ చేయడంలో అరుణ్ సఫలమయ్యారు. ఇక ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. చివర్లో చిన్నపాటి సందేశం ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. ఇక బ్యాక్ డోర్ సినిమా కేవలం రెండు పాత్రల మధ్యే సాగుతుంది. అయితే మరో నటుడుగానీ, మరో ట్రాక్ గానీ లేకపోవడం కొంత నెగిటివ్ అనిపించినా.. పూర్ణ నటన, గ్లామర్ ఆ లోపాన్ని పూరిస్తుంది.

  గృహిణి పాత్రలో పూర్ణ ఒదిగిపోయింది. రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె బాడీ లాంగ్వేజ్, హావభావాలు యూత్‌కు గిలిగింతలు పెడుతాయి. అఖండ తర్వాత పూర్ణను మరోసారి సరికొత్త, విభిన్నమైన పాత్రలో చూసేందుకు అవకాశం కలిగింది. తేజ అరుణ్‌గా ఆకట్టుకొన్నాడు. పూర్ణతో అరుణ్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. తన పాత్రను నటనతో బ్యాలెన్స్ చేస్తూ ఫర్వాలేదనిపిస్తాడు.

  దర్శకుడు కర్రి బాలాజీ రాసుకొన్న పాయింట్ బాగుంది. రెండు ప్రధాన పాత్రలకు తోడుగా మరికొన్ని పాత్రలను యాడ్ చేసి ఉంటే మరింత ఫీల్ పెరిగి ఉండేది. అయితే కేవలం రెండు పాత్రలతో సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించేలా రాసుకొన్న కథ, కథనాలు బాగున్నాయి. శ్రీకాంత్ నారోజ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. మొత్తంగా ఒక ఇంటిలో సాగే కథ కాబట్టి బడ్జెట్ కూడా కంట్రోల్‌లోనే ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్రణబ్ సంగీతం, రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. చోటా కే ప్రసాద్ ఎప్పటి మాదిరిగానే తన కత్తెర పదును చూపించాడు. మిగితా విభాగాలు వేటికి అవే బాగా రాణించాయి.

  Poornas Back Door movie review and rating

  చూపు వెళ్లిన ప్రతి చోటికీ మనసు వెళ్లకూడదు, మనసు వెళ్లిన ప్రతి చోటికీ మనిషి వెళ్లకూడదనే సందేశంతో బ్యాక్ డోర్‌ చిత్రాన్ని బీ శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా కనిపించడానికి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

  యూత్ ఫుల్, ఎంటర్‌టైనింగ్, సామాజిక సందేశంతో రూపొందించిన చిత్రం బ్యాక్ డోర్. గ్లామర్, రొమాన్స్ అంశాల మధ్య సామాజిక సందేశం ఉన్న చిత్రం. వివాహేతర సంబంధాల వల్ల జీవితం ఎలా పెడమార్గం పడుతుంది అని చెప్పడానికి చేసిన ప్రయత్నం. ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. రొమాంటిక్ చిత్రాలను ఇష్టపడేవారికి, పూర్ణను అభిమానించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

  నటీనటులు: పూర్ణ, తేజ త్రిపురాణ
  రచన, దర్శకత్వం: కర్రి బాలాజీ!!
  నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
  సమర్పణ: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
  కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
  సంగీతం: ప్రణవ్
  ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
  పాటలు: నిర్మల, చాందిని
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్
  కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ,
  పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్
  కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ
  ఆర్ట్: నాని
  ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్‌ కోట
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ
  కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను
  రిలీజ్ డేట్: 2021-12-25

  English summary
  Poorna's Back Door movie hits the sceens on December 25th. This movie got good repsonse in theatres.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X