Popcorn Movie Review అవికా గోర్, సాయి రోనక్ కెమిస్ట్రీ వర్కవుట్ అయిందా?

Rating:
2.0/5

నటీనటులు: అవికా గోర్, సాయి రోనక్ తదితరులు
దర్శకత్వం: మురళీ గంధం
నిర్మాతలు: భోగేంద్ర గుప్తా, అవికా గోర్, ఎమ్ఎస్ చలపతిరావు, శేషుబాబు పెద్దింటి
మ్యూజిక్ డైరెక్టర్: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫి: ఎంఎన్ బాల్‌రెడ్డి
ఎడిటర్: కేఎస్ఆర్
రిలీజ్ డేట్: 2023-02-10

లత మంగేష్కర్, సుశీల, జానకీ స్థాయిలో గాయనిగా గుర్తింపు పొందాలనే కోరిక ఉన్న సమీరాణ (అవికా గోర్) ఓ ఆరోగ్య సమస్య ఉంటుంది. ఆ ఆరోగ్య సమస్య కారణంగా గాయనిగా రాణించలేకపోతుంది. అయితే ఓ మాల్‌లో షాపింగ్ కోసం వెళ్లిన సమీరాణ, పవన్ (సాయి రోనక్) అనే యువకుడితో లిఫ్టులో ఇరుక్కుపోతుంది. అయితే అంతకు ముందే ఓ విషయంలో సమీరాణపై పవన్ కోపం పెంచుకొంటాడు. లిఫ్టులో ఇరుకోగానే సమీరాణను పవన్ చెంపదెబ్బ కొడుతాడు. దాంతో పవన్ అంటే పీకల్లోతు కోపం సమీరాణకు కలుగుతుంది.

సమీరాణకు ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఆ సమస్య తన కలకు ఎలా అవరోధంగా మారింది? సమీరాణను ఎందుకు పవన్ కొట్టాడు? లిఫ్టులో వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి? లిఫ్టులో ఎలా అగ్ని ప్రమాదం జరిగింది? అగ్నిప్రమాదం తర్వాత సమీరాణ ప్రాణాలకు ఎలా ముప్పు వాటిల్లింది? లిఫ్టు నుంచి వారిద్దరు ఎలా బయటపడ్డారు? లిఫ్టు నుంచి వచ్చిన తర్వాత వారిద్దరి పరిస్థితి ఏమైందనే ప్రశ్నలకు సమాధానమే పాప్ కార్న్ సినిమా కథ.

Popcorn

లిఫ్టులో రెండు గంటలకుపైగా సినిమాను తీయడమనేది అతిపెద్ద సవాలే అని చెప్పవచ్చు. అయితే దర్శకుడు కథను ఆసక్తికరంగా ప్రారంభించినప్పటికీ.. లిఫ్టులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరిగే సన్నివేశాలను ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా రాసుకోలేకపోవడం ప్రధానమైన లోపం. రొమాంటిక్ సీన్లు, అవికా, సాయి రోనక్ మధ్య కొన్ని సన్నివేశాలు ఫస్టాఫ్‌లో ఒకే అనిపిస్తాయి. కానీ సెకండాఫ్‌లో మాత్రం సహనానికి పరీక్ష మాదిరిగానే సన్నివేశాలు, కథనం ఉంటుంది.చివరి 20 వరకు కథను సాగదీసి..సాగదీసి ఓపికను దర్శకుడు పరీక్షించాడని చెప్పవచ్చు. అయితే ఎమోషన్స్, ఫీలింగ్స్ కొరవడంతో ఈ సినిమా సాదాసీదాగా ముగుస్తుంది.

పాప్ కార్న్ సినిమాకు అవికా గోర్ నిర్మాతగా కూడా మారిందనే విషయం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా చేసింది. అయితే కథలో కూడా బలం లేకపోవడమే కాకుండా.. తన పాత్రలో ఏమాత్రం ఏమోషన్స్ లేకపోవడం వల్ల అవికా గోర్ తన ప్రతిభను చాటుకోలేకపోయింది. క్లోజప్ షాట్స్‌లో అవికా గోర్‌ను చూడటం కష్టంగా మారిందనిపిస్తుంది. ఇక సాయి రోనక్ కూడా అదే పరిస్థితి. కానీ కొంతలో కొంత సాయి రోనక్ బెటర్‌గా ఫెర్పార్మ్ చేయడానికి స్కోప్ కనిపించింది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే... పాప్ కార్న్ సినిమాకు బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి ది బెస్ట్‌గా అనిపిస్తుంది. పరిమితమైన ప్రదేశంలో సీన్లను చిత్రీకరించి తీరు బాగుంది. లైటింగ్ వాడుకొన్న విధానం ఇంకా బెటర్‌గా ఉంది. కథ, సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల శ్రవణ్ భరద్వాజ్ తన ప్రతిభను నిరూపించుకోవడానికి ఛాన్స్ లేకపోయింది. ఎడిటింగ్, ఇతర విభాగాలు సినిమాకు తగినట్టే ఉన్నాయి. సినిమాను రూపొందించిన విధానం చూస్తే నిర్మాతల టేస్ట్ బాగుందనిపిస్తుంది.

లిఫ్టులో జరిగే ఓ ప్రేమకథ, ఇద్దరి మధ్య భావోద్వేగాలకు స్కోప్ ఉన్న చిత్రంగా పాప్ కార్న్ కనిపిస్తుంది. అయితే ఎమోషన్స్, అందమైన ప్రేమకథకు కావాల్సిన సన్నివేశాలను అందించడంలో దర్శకుడు విఫలమయ్యారనిపిస్తుంది. మంచి, కథ, ఎమోషన్స్ దట్టించి ఉంటే.. పాప్‌ కార్న్ మంచి సినిమా అయి ఉండేదనిపిస్తుంది. కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X