Pottel Review and Rating: పొట్టేల్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, నోయల్, ప్రియాంక శర్మ తదితరులు
డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
నిర్మాత: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సాదిగే
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: మనీష్ భూపతిరాజు
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
ఆర్ట్స్: నార్ని శ్రీనివాస్
ఫైట్స్: రాబిన్ సుబ్బ
బ్యానర్స్: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్, సాహిత్ మోత్కూరి రైటింగ్స్
రిలీజ్ డేట్: 2024-10-25
తెలంగాణలోని ఓ గ్రామం గుర్రంగట్టులోని ప్రజలు అత్యంత భక్తితో పూజించే గ్రామదేవత బాలమ్మ కోసం బలి ఇచ్చే పొట్టేళ్లకు మల్లేశ్ (చత్రపతి శేఖర్) కాపారి గా వ్యవరిస్తుంటాడు. ప్రతీ ఏటా గ్రామ దేవతకు బలి ఇచ్చే పొటేల్, అలాగే మాయరోగంతో ప్రజలు మృత్యువాత పడుతుంటారు. ఈ క్రమంలో ఆ గ్రామ పటేల్ చేతిలో మలేష్ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత గొర్రెల కాపరి బాధ్యతను మల్లేశ్ కుమారుడు గంగాధరీ (యువ చంద్ర కృష్ణ) అప్పగిస్తాడు. అయితే తన తండ్రిని చంపిన పటేల్‌పై పగను గంగాధర పెంచుకొని అదనుకోసం ఎదురు చూస్తుంటాడు.

గుర్రంగట్టు గ్రామంలో కరువు తాండవించడానికి కారణం ఏమిటి? ఆ గ్రామంలో ప్రజల మరణానికి కారణం ఏమిటి? గ్రామ పటేల్‌కు గ్రామ దేవత ఎందుకు పూనుతుంది? తండ్రి మరణానికి పగను తీర్చుకోవడానికి గంగాధర ఏం చేశాడు? పటేల్ ఆగ్రహానికి గంగాధరీ ఎందుకు గురయ్యాడు? బుజ్జమ్మ (అనన్య నాగళ్ల)ను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకొంటాడు? గ్రామదేవతకు బలి ఇచ్చే పొట్టేల్ కనిపించకుండా పోయిన తర్వాత గంగాధరీ లైఫ్‌లో చోటు చేసుకొన్న పరిస్థితులు ఏమిటి? చివరకు గ్రామ దేవతకు బలి ఇవ్వాల్సిన పొట్టేల్ దొరికిందా? పటేల్‌పై గంగాధరీ ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే పొట్టేల్ సినిమా కథ.
తెలంగాణ ప్రాంతంలో పటేల్, దొరల పాలనలో ప్రజలు ఎలా వివక్షకు గురయ్యారు. ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మి తమ జీవితాలను, తమ భవిష్యత్ తరాల జీవితాలను ఎలా నాశనం చేసుకొంటున్నారనే ఎమోషనల్ పాయింట్‌తో కథను అల్లు కొన్నాడు. కొన్ని సీన్లను అద్బుతంగా తెరకెక్కించారు. పలు సీన్లో భావోద్వేగంతో ప్రేక్షకుడి హృదయాలను టచ్ చేసేలా ఉంటాయి. అయితే కథను చక్కగా చెప్పే ప్రయత్నంలో కొంత గందరగోళానికి, తడబాటుకు గురవ్వడం వల్ల తన లక్ష్య చేధనలో ట్రాక్ మిస్ అయ్యాడనిపిస్తుంది. ఓవరాల్‌గా కొత్త జోనర్‌లో డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చే ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి.
నటీనటుల విషయానికి వస్తే.. యువ చంద్ర కృష్ణ కొత్తవాడైనా సినిమా భారాన్ని తన భుజాలపై మోశాడు. కొన్ని సీన్లలో పరిణతి చెందిన సీనియర్ నటులను మంచి ఫెర్ఫార్మెన్స్‌ను అందించాడు. ఇక అనన్య నాగళ్ల మరోసారి గ్రామీణ ప్రాంతంలో ఉండే గృహిణి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. క్లైమాక్స్ అనన్య నటనతో అదరగొట్టేసింది. విక్రమార్కుడు తర్వాత అజయ్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను భయపట్టించారనే చెప్పాలి. అజయ్ లేకపోతే ఈ సినిమా రేంజ్ ఇంత ఉండేది కాదనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ కూడా కథను ప్రభావితం చేసే పాత్రతో మెప్పించారు. ఇతరులు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

పొట్టేల్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బలంగా నిలిచింది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. పిరియాడిక్ మూవీకి కావాల్సిన ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేయడంలో మనీష్ భూపతిరాజా కెమెరా వర్క్ అదిరిపోయియంది. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిందనిపించింది. నార్ని శ్రీనివాస్ ఆర్ట్ వర్క్ సూపర్‌గా ఉంది. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సాది పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయనే కంటే.. అత్యున్నత స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.
పటేల్ వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొన్న వివక్షపై పోరాటం, విద్యను మించిన చైతన్యం మరోకటి ఉండదు అనే సందేశంతో సదుద్దేశంతో రూపొందిన సినిమా పొటేల్. మూఢ నమ్మకాల కారణంగా ప్రజలు ఎలా మోసపోతున్నారనే విషయాన్ని కళ్లకు కట్టి చూపించే ప్రయత్నం చేశారు. మంచి కథ చెప్పాలనే తాపత్రయం మంచిగానే ఉంది. కానీ సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో గొప్పతనం ఉంటుందనే విషయం మిస్ అయిందనిపిస్తుంది. ఏది ఏమైనా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కొత్త అనుభూతిని పొందామని ఫీల్‌తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి వచ్చే విధంగా ఈ సినిమాను అందించారు. పిరియాడిక్ నేపథ్యంతో వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











