Prabhuthwa Junior Kalashala Review ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల తదితరులు
డైరెక్టర్, రైటర్, ఎడిటర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
సినిమాటోగ్రఫి: నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: పవన్ కల్యాణ్ కోదాటి
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సయ్యద్ కమ్రాన్
కో డైరెక్టర్: వంశీ ఉదయగిరి
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2024-06-21

వాసు (ప్రణవ్ ప్రీతం) కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకొనే స్టూడెంట్స్. కుమారి అందగత్తె కావడంతో చాలా మంది ఆమె ప్రేమ కోసం వెంటపడుతుంటాడు. కుమారి అందానికి ఆకర్షితుడైన వాసు తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. తనకు కూడా ఇష్టం కావడంతో కుమారి, వాసు ఇద్దరు లవ్‌లో కొనసాగుతారు. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత అనూహ్యంగా వాసు ప్రేమను తిరస్కరిస్తుంది.

Prabhuthwa Junior Kalashala Movie Review in Telugu

కుమారిని ప్రేమలో పడేయడానికి వాసు పడిన కష్టాలు ఏమిటి? ఏ పరిస్థితుల్లో వాసు ప్రేమను కుమారి అంగీకరించింది? వారిద్దరి ప్రేమ ఎలా ముందుకు కొనసాగింది? అయితే వాసు తల్లికి వచ్చిన కష్టం ఏమిటి? తనకు ఎదురైన సమస్య నుంచి గట్టెక్కడానికి వాసు తల్లి అప్పు తెచ్చుకొన్న డబ్బు ఎవరు కొట్టేశారు. వాసు ప్రేమను సడెన్‌గా తిరస్కరించడానికి కారణం ఏమిటి? కుమారితో బ్రేకప్ తర్వాత వాసు పరిస్థితి ఏమిటి? వాసు తల్లికి ఎదురైన సమస్యకు పరిష్కారం దొరికిందా? డబ్బు పోయిన తర్వాత వాసు తల్లి పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా కథ.

చిత్తూరు జిల్లా పుంగనూరు బ్యాక్ డ్రాప్‌గా ఈ కథ సాగుతుంది. టీనేజ్‌లో ఉన్న యువతీ, యువకులు ఆకర్షణలో పడటం అనే కాన్సెప్ట్‌తో చాలా కథలే వచ్చాయి. అలాంటి కథల్లో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ సీన్లు ఎంత కొత్తగా, యూత్‌ను ఎట్రాక్ట్ చేసే విధానంపైనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కొన్ని రొటీన్ సీన్లు ఉన్నప్పటికీ.. కొన్ని సీన్లు మంచి ఫీల్‌ను కలిగిస్తాయి. ఈ సినిమాకు చిత్తూరు యాస బ్యూటీ. చాలా చక్కగా వినసొంపుగా ఉండే విధంగా క్యారెక్టర్లతో డైలాగ్స్, డబ్బింగ్ చెప్పించిన తీరుకు దర్శకుడికి ఫుల్ మార్కులు వేయాలి.

ఫస్టాఫ్ క్యారెక్లర్ల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం ఎక్కువ టైమ్ తీసుకొన్నప్పటికీ.. సెకండాఫ్‌లో స్టోరిని పరుగులు పెట్టించాడు. అయితే కథలో బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడం.. ముగింపు ఊహించే విధంగా ఉన్నప్పటికీ.. సన్నివేశాలను ఎలా డ్రైవ్ చేస్తాడనే ఆసక్తిని కలిగించాడు. అయితే క్లైమాక్స్‌లో ఎమోషనల్ టచ్ ఇచ్చిన ఎపిసోడ్‌తో మంచి ఫీల్ ఉందనేలా ముగించడం సినిమాకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు.

Prabhuthwa Junior Kalashala Movie Review in Telugu

ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరున్న నటీనటులు ఎవరూ కూడా మచ్చుకు కనిపించరు. అయినప్పటికీ వారు తమ నటనతో ప్రతీ ఫ్రేమ్‌లో మోస్ట్ కన్విన్సింగ్ ఫెర్ఫార్మెన్స్ చూపించారు. చాలా ఈజ్, ఎమోషనల్‌గా పాత్రల్లోకి దూరిపోయి నటించారు. చాలా మంది సహజసిద్దంగా బిహేవ్ చేశారు. కుమారిగా షాజ్ఞ శ్రీ వేణున్ గ్లామర్‌తోపాటు ఫెర్పార్మెన్స్‌తో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక వాసుగా ప్రణవ్ ప్రీతం కూడా అలాగే భావోద్వేగమైన నటనతో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫి మూవీకి పాజిటివ్ అంశం. పల్లె వాతావరణాన్ని, నటీనటుల మూడ్‌ను అద్బుతంగా ఒడిసిపట్టుకొన్నారు. ఎడిటర్ పవన్ కల్యాణ్ సినిమా సన్నివేశాలను ఫర్‌ఫెర్చుకొంటూ పోయారు. కొన్ని సందర్భాల్లో ల్యాగ్ ఉందనిపిస్తుంది. సయ్యద్ కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్‌ను క్రియేట్ చేసింది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్‌పై భువన్ రెడ్డి కొవ్వూరి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

టీనేజ్ యువకుల్లో తొలి ప్రేమ ఒక మధురమైన భావన. దాదాపు తొలి ప్రేమలన్నీ కంచికి చేరనే కథలుగానే ఉంటాయి. అలాంటి కథతో శ్రీనాథ్ పులకురం చేసిన ఓ ప్రయోగం బాగుందనే చెప్పాలి. ముగింపు విషయంలో క్లారిటీ మిస్ కాకుంటే.. ఇంకా బెటర్ మూవీ అయి ఉండేదనిపిస్తుంది. కొత్త నటీనటులు నటన ఈ సినిమాకు ప్లస్. చిత్తూరు భాష, ఎమోషనల్ కంటెంట్‌తో కూడిన ఈ సినిమా అంచనాలు లేకుండా వెళ్తే మెప్పిస్తుంది. వారాంతంలో ఓ ట్రై చేసి చూడగలిగే సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X