twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Today Review: ఫన్ అండ్ ఎమోషనల్ గా స్మార్ట్ ఫోన్ 'లవ్ టుడే'.. వన్ మ్యాన్ షోగా అతడు!

    |

    Rating:
    3.0/5

    టైటిల్: లవ్ టుడే (తమిళ డబ్బింగ్)
    నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, ఇవానా, రాధిక, సత్యరాజ్, యోగిబాబు తదితరులు
    ప్రొడక్షన్ బ్యానర్: ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్
    తెలుగు డిస్ట్రిబ్యూషన్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)
    నిర్మాతలు: కల్పతి అఘోరమ్, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
    సంగీతం: యువన్ శంకర్ రాజా
    సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
    విడుదల తేది: నవంబర్ 25, 2022

    తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో వచ్చిన కోమలి సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్ గా సైమా అవార్డు అందుకున్నాడు. అప్పుడున్న సోషల్ ఎలిమెంట్స్ ను కామెడీ జోనర్ లో తెరకెక్కించి సూపర్ సక్సెస్ సాధించాడు. ఈసారి ప్రదీప్ రంగనాథన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్ 4న తమిళనాట విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా తీసుకొచ్చారు. లవ్ టుడే మూవీ నవంబర్ 25న అంటే ఇవాళ తెలుగులో రిలీజైంది. ప్రస్తుత జనరేషన్ లవ్ ట్రాక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందామా!

    కథ:

    కథ:


    ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖితా (ఇవానా) ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం అనుకోకుండా ఓరోజు నిఖితా తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్)కి తెలుస్తుంది. ప్రేమ, పెళ్లి గురించి ప్రదీప్ ను వచ్చి ఇంట్లో మాట్లాడమని చెబుతాడు నిఖితా తండ్రి. ప్రదీప్, నిఖితా ఇద్దరు తమ ముబైల్ ఫోన్స్ మార్చుకుని 24 గంటలు గడపాలని ఇద్దరూ ఊహించని షాక్ ఇస్తాడు. ఒకరి ఫోన్ తో ఒకరు ఒక రోజు గడిపిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చెబితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదని హామీ ఇస్తాడు. దీంతో ఆ ఒక్క రోజు ప్రదీప్, నిఖితా ఫోన్స్ మార్చుకుంటారు. అప్పటి నుంచి వాళ్ల జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి..? ఎవరి గురించి ఎలాంటి సీక్రెట్స్ తెలుసుకున్నారు..? వీళ్ల ప్రేమ నిలిచిందా..? పెళ్లి చేసుకున్నారా? అనేది తెలియాలంటే లవ్ టుడేను కచ్చితంగా చూడాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:

    తొలి సినిమాతోనే ఎంతో ఎక్సిపీరియన్స్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పుడు తాజాగా లవ్ టుడే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాట రూ. 70 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో నేడు తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే.. నేడు సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. వాడకం అనడం కంటే మన బాడీలో ఒక అవయంలా మారిపోయింది ముబైల్. వ్యక్తిగత విషయాల నుంచి కెరీర్, జాబ్ ఇలా ప్రతిదానికి సెల్ ఫోన్ పై ఆధారపడిపోయింది నేటి సమాజం.

    బ్యాడ్ హాబిట్స్

    బ్యాడ్ హాబిట్స్

    ఇంతకుముందు బ్యాడ్ హాబిట్స్ వల్ల ఒక మనిషి క్యారెక్టర్ ను డిసైడ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు వాళ్ల ముబైల్ ఫోన్ చూస్తే తెలిసిపోతుంది. ఈ పాయింట్ పైనే ఒక ప్రేమ జంట ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందనే విషయాన్ని ఫన్ అండ్ ఎమోషనల్ గా చూపించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ అండ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మొబైల్ షోరూమ్ లో ఫోన్ కొనడంతో స్టార్ట్ చేసిన సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది. హీరో హీరోయిన్లు మొబైల్స్ మార్చుకున్నప్పటి నుంచి సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఒకరిపై మరొకరికి వచ్చే అనుమానాలు, వాళ్లకు తెలిసి సీక్రెట్స్ సూపర్ ఫన్ క్రియేట్ చేయడంతో పాటు లోతైన మెసేజ్ ఉంది.

     చాలా ఎమోషనల్ గా

    చాలా ఎమోషనల్ గా


    ఇక చివరి అరగంట నుంచి వచ్చే సీన్లు చాలా ఎమోషనల్ గా ఉంటాయి. క్లైమాక్స్ కు ముందు అరగంటలో వచ్చే హీరోహీరోయిన్ సీన్ తో అప్పటివరకు ఉన్న కామెడీ టోన్ ఎమోషనల్ గా మారిపోతుంది. ప్రతి ఒక్కరు ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు. సినిమాలో సన్నివేశానికి తగినట్లు రెండు మూడు డైలాగ్ లు కట్టిపడేస్తాయి. "ఒక విషయాన్ని దాస్తున్నామంటే అది ఇతరులకు తెలియకూడదని అర్థం. అది తప్పు కావాల్సిన అవసరం లేదు" అనే డైలాగ్ కమెడియన్ యోగిబాబుతో చెప్పించడం చప్పట్లు కొట్టించేలా ఉంది. అలాగే నమ్మకం గురించి ఒక విత్తనం, చెట్టు గురించి చూపించే సీన్స్ హైలెట్ గా నిలిచాయి. క్లైమాక్స్ చివర్లో వచ్చే హీరో హీరోయిన్ మధ్య సన్నివేశం కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సినిమాకు ప్రధాన అస్సెట్ గా నిలిచింది యువన్ శంకర్ రాజా మ్యూజిక్. ఆకట్టుకునేలా పాటలతో పాటు కామెడీ, ఎమోషన్ జెనరేట్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

    ఎవరెలా చేశారంటే:

    ఎవరెలా చేశారంటే:

    ఓవైపు డైరెక్షన్ మరోవైపు హీరోగా మెప్పించి హిట్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. ఇటీవల వచ్చిన కాంతారతో రిషబ్ శెట్టి, ఇప్పుడు లవ్ టుడేతో ప్రదీప్ రంగనాథన్ దాన్ని నిజం చేసి చూపించారు. చూడటానికి ఎంతో బక్కపలుచగా ఉండి, ఎంతో అనుభవకజ్ఞుడిలా సినిమా తెరకెక్కించారు ప్రదీప్ రంగనాథన్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పవచ్చు. ప్రతి ఎమోషన్, కామెడీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ అంతే పర్ఫెక్ట్ గా నటించాడు. ఇక హీరోయిన్ ఇవానా కూడా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది. అమ్మాయి తండ్రిగా సత్యరాజ్, హీరో తల్లిగా రాధికల నటనకు వంక పెట్టలేం. తక్కువ డైలాగ్ లో ఉన్నప్పటికీ స్క్రీన్ ప్రజెన్స్ తో, ఒకే ఒక్క డైలాగ్ తో తెగ ఆకట్టుకుంటాడు కమెడియన్ యోగిబాబు.

    ఫైనల్ గా చెప్పాలంటే..

    ఫైనల్ గా చెప్పాలంటే..

    నేటి సమాజంలో సెల్ ఫోన్ ఇంపార్టెన్స్, స్మార్ట్ ఫోన్ సీక్రెట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ టుడే మూవీ ప్రతి ఒక్కరికి రిలేటెడ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మన గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఆ స్మార్ట్ ఫోన్ లోనే ఉంటాయి. ఒక్కసారి అవి బయటపడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంది.

    English summary
    Producer Dil Raju Distributed Tamil Dubbed Movie Love Today Review And Rating In Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X