twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prathyardhi movie review ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ.. ఫస్ట్ టైం డైరెక్టర్ ఎలా తీశారంటే?

    |

    Rating: 2.75/5

    నటీనటులు: రవి వర్మ, సన, రోహిత్ బెహల్, నీలిమా, తాగుబోతు రమేశ్, అక్షత సోనావానే, టీఎన్ఆర్ తదితరులు
    దర్శకత్వం: శంకర్ ముడావత్
    నిర్మాతలు: సంజయ్ సాహా, ఎం రాజు నాయక్
    మ్యూజిక్: పాల్ పవన్, భీమ్స్ సిసిలియో
    సినిమాటోగ్రఫి: రాకేష్ గౌడ్
    ఎడిటింగ్, డీఐ: రాకేష్ గౌడ్
    బ్యానర్: గాలు పాలు డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
    రిలీజ్ డేట్: 2023-01-06

    వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి విధి నిర్వాహణకు కట్టుబడే పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ (రవి వర్మ). ఫ్యామిలీని పట్టించుకోవడం లేదనే కోపంతో కూతురిని తీసుకొని భార్య (సన) ఇంటి నుంచి వెళ్లిపోయి వేరుగా బతుకుతుంది. అయితే ఎలాంటి కేసునైనా 24 గంటల్లో పరిష్కరించే కృష్ణ ప్రసాద్ ముందుకు వైశాలి అనే యువతి తన భర్త విజయ్ కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తుంది. అయితే సునాయసంగా కేసును పరిష్కరించే కృష్ణ ప్రసాద్‌కు విజయ్ మిస్సింగ్ కేసు కత్తిమీద సాముగా మారుతుంది. ఈ క్రమంలో మెకానిక్ శివ (రవి బెహల్)తోపాటు మరో ఇద్దరు స్నేహితులు శశి, రాకేష్ అరెస్ట్ చేస్తారు. కేసు దర్యాప్తు జరుగుతుండగానే.. జర్నలిస్టు దేవ్ సింగ్ నాయక్, కృష్ణ ప్రసాద్ కూతురు హత్యకు గురవుతారు.

    కృష్ణ ప్రసాద్‌ను భార్య ఎందుకు విడిచిపెట్టి వెళ్లింది? విజయ్ ఎలా మిస్ అయ్యాడు? విజయ్ ఇంటిలో రక్తపు మరకలు ఎవరివి? విజయ్ మిస్సింగ్ కేసుతో మెకానిక్ శివ ఏదైనా లింక్ ఉందా? కృష్ణ ప్రసాద్ కూతురును ఎందుకు, ఎవరు చంపారు? విజయ్ మిస్సింగ్ కేసుకు జర్నలిస్టు దేవ్ సింగ్ నాయక్‌కు ఏదైనా లింకు ఉందా? చివరకు విజయ్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఏం తెలిసింది? కృష్ణ ప్రసాద్‌ను మెకానిక్ శివ ఎందుకు టార్గెట్ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రత్యర్థి సినిమా కథ.

    Prathyardhi movie review and Rating: Shankar Mudavaths Feel good murder mystery

    క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ కృష్ణ ప్రసాద్ భార్యకు సంబంధించిన ఓ సీన్‌తో ప్రత్యర్థి మూవీ ఎమోషనల్‌గా టేకాఫ్ అవుతుంది. ఆ తర్వాత విజయ్ మిస్సింగ్ కేసుతో కృష్ణ ప్రసాద్ చేసే దర్యాప్తు అనేక ట్విస్టులతో కొనసాగుతుంది. కేసు దర్యాప్తుకు ముడిపడి ఉన్న అంశాలు ఎంగేజింగ్‌గా ఉంటాయి. ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేసేలా కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌ కమర్షియల్ అంశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో విజయ్ మిస్పింగ్ కేసు ఉన్న సీరియస్ అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఓవరాల్‌గా ఓ మంచి ఫీల్ గుడ్ ఉన్న అంశాలతో మర్డర్ మిస్టరీ ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

    ట్విస్టులను డీల్ చేయడంలో దర్శకుడు శంకర్ ముడావత్ అనుసరించిన స్క్రీన్ ప్లే బాగుంది. ప్రతీ ట్విస్టును ఆసక్తిని కలిగించేలా తెరకెక్కించిన విధానం శంకర్ దర్వకత్వ ప్రతిభకు అద్దం పడుతుంది. ముఖ్యంగా భారమైన పాత్రల ద్వారా చిన్న నటుల ద్వారా ఫెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం దర్శకుడి విజన్‌ను తెలియజెప్పింది. బడ్జెట్ పరంగా కొన్ని లోపాలు మేకింగ్‌పై ప్రభావం చూపాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. క్రౌడ్ పుల్లింగ్ చేసే యాక్టర్లు ఉంటే డెఫినెట్‌గా ఇటీవల కాలంలో వచ్చిన మర్డర్ మిస్టరీ చిత్రాల్లో ప్రత్యర్థి మంచి చిత్రమయ్యేది. పేరున్న నటీనటులు లేకున్నా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కల్పించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

    నటీనటుల విషయానికి వస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో రాణిస్తున్న రవివర్మ.. ప్రత్యర్థి సినిమాను మొత్తం తన భుజాల మీదుగా మోశారని చెప్పవచ్చు. రవి వర్మ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కథను నడిపించిన విధానం ఆకట్టుకొంటుంది. ఇక రోహిత్ బెహల్ మరోసారి చక్కటి ఫెర్ఫార్మెన్స్‌తో అలరించాడు. విజయ్ ప్రియురాలు రేచల్, కృష్ణ ప్రసాద్ కూతురుగా చేసిన నిత్య గ్లామర్‌తోపాటు నటనపరంగా ఆకట్టుకొన్నారు. సన ఈ సినిమాలో ఎమోషనల్ పాత్రతో మెప్పించింది. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

    Prathyardhi movie review and Rating: Shankar Mudavaths Feel good murder mystery

    ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రత్యర్థి సినిమాకు పాల్ పవన్ బీజీఎం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. మర్డర్ మిస్టరీకి కావాల్సిన డార్క్ మూడ్‌ను క్రియేట్ చేయడంలో రాకేశ్ గౌడ్ తన పనితనంతో మెప్పిస్తాడు. మిగితా సాంకేతిక అంశాలు కూడా చిన్న బడ్జెట్ చిత్రానికి ఉండే ఫీల్‌ను కలిగించాయి. సంజయ్ సాహా, ఎం రాజు నాయక్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న బడ్జెట్ చిత్రమైనా మంచి ఫీల్‌గుడ్ అంశాలను, ప్రామాణాలను పాటిస్తూ గాలు పాలు డ్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తన ప్రత్యేకతను చాటుకొన్నది.

    ప్రత్యర్థి సినిమా విషయానికి వస్తే.. క్రైమ్, ఎమోషనల్, కేసు ఇన్వెస్టిగేషన్, యాక్టర్ల ఫెర్పార్మెన్స్‌ కలబోసిన మర్డర్ మిస్టరీ. మర్డర్ మిస్టరీ చిత్రంలో ప్రతీ సీన్‌కు ఉండే క్యూరియాసిటిని కొనసాగించడంలో దర్శకుడు మెప్పిస్తాడు. తొలి చిత్ర దర్శకుడైనా ఎక్కడ తడబాటు లేకుండా ప్రత్యర్థిని తెరకెక్కించాడనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా పరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. చిన్న చిత్రానికి ఉండే పరిమితులే కారణమనిస్తుంది. మర్డర్ మిస్టరీలను ఆదరించే, ఇష్టపడే వారికి ప్రత్యర్థి నచ్చుతుంది.

    English summary
    Debutant Director Shankar Mudavath who works for Auto Nagar Surya, latest movie is Prathyardhi, Ravi Varma, Sana, Ravi Behl, Tagubothu Ramesh, TNR are in lead roles. This movie is release on January 6th. Here is the Telugu Filmibeat's exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X