The Night Manager Review శోభిత ధూళిపాల హాట్ హాట్‌గా, అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ ఎలా చేశారంటే?
నటీనటులు: అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభితా ధూలిపాళ, తిలొత్తమ షోమ్, రవి బెహల్, సర్వస్వత ఛటర్జీ, శ్రేనిక్ ఆరోరా తదితరులు
రచన: డేవిడ్ ఫార్
దర్శకత్వం: ప్రియాంక ఘోష్, రుక్ నబీల్, సందీప్ మోదీ
నిర్మాతలు: అమృత సేన్, ప్రీతి జింటా
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: బెంజమిన్ జాస్పర్, నిక్ రామ్ వర్మ
రిలీజ్ ఓటీటీ: డిస్నీ+హాట్ స్టార్
రిలీజ్ డేట్: 2023-02-17

ది నైట్ మేనేజర్ కథ ఏమిటంటే?
షాన్ సేన్ గుప్తా (ఆదిత్య రాయ్ కపూర్) మాజీ ఇండియన్ నేవీ ఆఫీసర్. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లిపికా సైకియా రావు (తిలొత్తమ షోమ్) కోసం బంగ్లాదేశ్‌లోని ఓ రిసార్టులో నైట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. రిసార్ట్ యజమాని ఫ్రెడ్డీ రెహ్మాన్ (రేష్ లాంబా) 14 అమ్మాయిని పెళ్లి చేసుకొని హోటల్‌లో లైంగిక వేధింపులకు గురిచేస్తుంటాడు. ఫ్రెడ్డీ నుంచి తప్పించుకొనే క్రమంలో షాన్ సహాయం కోరుతుంది. ఆమెకు సహాయం చేసి ఇండియాకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఆ అమ్మాయి బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతుంది. ఆ క్రమంలో ఫ్రెడ్డీకి ఇండియాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త శైలేంద్ర రంగ్దా (అనిల్ కపూర్)తో అక్రమ ఆయుధాల వ్యాపారం ఉందని తెలుస్తుంది.

ది నైట్ మేనేజర్‌లో కథనంలో ట్విస్టులు
ఫ్రెడ్డీ పెళ్లి చేసుకొన్న 14 ఏళ్ల కోల్‌కత్తా అమ్మాయిని ఏ పరిస్థితుల్లో షాన్ బంగ్లాదేశ్ నుంచి తప్పించాలనుకొన్నాడు? అమ్మాయిని షాన్ దాచిన విషయం ఫ్రెడ్డీకి తెలిసిన తర్వాత ఏమైంది? 14 ఏల్ల ఫ్రెడ్డీ భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన తర్వాత ఏం జరిగింది? షాన్‌ను ఫ్రెడ్డీ ఎలా వెంటాటాడు? ఫ్రెడ్డీ, శైలు రంగ్తా ఉన్న అక్రమ వ్యాపారాన్ని ఎలా గుట్టురట్టు చేయాలనుకొన్నాడు? శైలేంద్ర చీకటి వ్యాపారాన్ని బయట ప్రపంచానికి తెలియజేయానికి షాన్ ఎలాంటి ఎత్తులు వేశాడనేది ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ పార్ట్ 1 కథ.

బ్రిటన్ టెలివిజన్ సిరీస్ ఆధారంగా
బ్రిటన్ టెలివిజన్ సిరీస్ ది నైట్ మేనేజర్‌ను ఆధారంగా చేసుకొని అదే టైటిల్‌తో ఇండియన్ వెబ్ సిరీస్‌గా రూపొందించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ తొలి ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఫ్రెడ్డీ, 14 అమ్మాయి మధ్య హోటల్‌లో జరిగే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అమ్మాయి చనిపోయిన తర్వాత కథ పూర్తిగా మరో దిశకు టర్న్ తీసుకొంటుంది. రెండో ఎపిసోడ్‌లో శైలేంద్ర, ఆయన గర్ల్ ఫ్రెండ్ (శోభితా ధూళిపాల) మధ్య సీన్లు రొమాంటిక్‌గా సాగుతాయి. శోభితా ధూళిపాల హాట్ షో అదిరిపోయేలా ఉంటుంది. బికినీలో అర్ధ నగ్న సన్నివేశాల్లో రెచ్చిపోయిందనిపిస్తుంది.

అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని గుట్టురట్టు చేసే
ఇక మూడు, నాలుగు ఎపిసోడ్స్‌లో శైలేంద్ర అక్రమ ఆయుధాల వ్యాపారాన్ని బట్టబయలు చేసేందుకు షాన్ చేసే ప్లాన్స్ స్లోగా సాగినప్పటికీ.. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. శైలేంద్ర ఫ్యామిలీలో నమ్మకమైన వ్యక్తిగా చేరేందుకు షాన్ ప్రయత్నాలు హైలెట్‌గా నిలుస్తాయి. ఇక చివరి ఎపిసోడ్‌లో శైలేంద్ర కుడిభుజాన్ని రియాద్‌లో అరెస్ట్ చేయించే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. పార్ట్ వన్1 నిదానంగా ఆసక్తికరంగా సాగే క్రైమ్ థ్రిల్లర్‌గా అనిపిస్తుంది. సెకండ్ పార్ట్‌కు సంబంధించిన ప్రోమో ఎప్పుడెప్పుడు చూడాలా? అనే ఫీలింగ్ కలిగించిదని చెప్పవచ్చు.

ఆదిత్య, అనిల్, శోభితా ఎలా చేశారంటే?
షాన్ సేన్‌గుప్తాగా అదిత్య రాయ్ కపూర్ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకొంటాడు. తక్కువ డైలాగ్స్‌తో ఎక్కువగా కళ్లతోనే ఫెర్పార్మెన్స్ చేయడం ఆకట్టుకొంటుంది. సీరియస్ సన్నివేశాల్లో ఆదిత్య రాయ్ కపూర్ చూపించిన హావభావాలు అతడి టాలెంట్‌కు అద్దంపట్టాయి. ఫ్రెడ్డీ రెహ్మాన్‌గా రేష్ లాంబా మంచి విలనిజాన్ని పండించాడు. పారిశ్రామిక వేత్త శైలేంద్ర రంగ్డాగా అనిల్ కపూర్ మరోసారి విభిన్నమైన పాత్రలో మెప్పించాడు. సాఫ్ట్ విలనిజం ఉన్న క్యారెక్టర్‌లో అనిల్ ఒదిగిపోయారు. శోభితా ధూళిపాల తన హట్ హాట్ లుక్స్‌తో అదరగొట్టేసింది. బికినీలో, అర్ధనగ్నంగా తెరపైన కనిపించడమే కాకుండా యాక్టింగ్‌తో కూడా వావ్ అనిపించింది.

సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయంటే?
సాంకేతిక విభాగాల్లో సామ్ సీఎస్ అందించిన మ్యూజిక్ బాగుంది. పలు సన్నివేశాలను బీజీఎంతో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. బెంజమిన్ జాస్పర్, నిక్ రామ్ వర్మ సినిమాటోగ్రఫి బాగుంది. మిగితా విభాగాలు కూడా భాగున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు అమృతసేన్, ప్రీతి జింటా నిర్మాతలు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా హై రేంజ్‌లో ఉన్నాయి.

ఫైనల్‌గా ఎలా ఉందంటే?
దేశ భద్రత కోసం ఇండియన్ ఇంటెలిజెన్స్‌తో కలిసి మాజీ నేవీ ఆఫీసర్ అక్రమ ఆయుధాల వ్యాపారులతో చేసే పోరాటంగా ప్రధానంగా ది నైట్ మేనేజర్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్ రొహింగ్యా శరణార్థలు కథను టచ్ చేస్తూ రూపొందిన మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్. తొలి పార్ట్‌లో చాలా విషయాలు పరిచయాల వరకే సాగాయి. రెండో పార్ట్ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ది నైట్ మేనేజర్ ఫస్ట్ పార్ట్ మాత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకొనేలా ఉంది. డిస్నీ +:హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది కనుక.. తీరిక వేళ్లలో ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











