twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ అంత ఈజీ కాదు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5

    చిన్న చిత్రాలైనప్పటికి, ప్రేక్షకులను మెప్పించే విధంగా విభిన్నమైన కథ ఉండే చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. కొత్త తారలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిన చిత్రం ప్రేమ అంత ఈజీ కాదు. రాజేష్ కుమార్, ప్రజ్వాల్ జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో అంజయ్య , శ్రీధర్ , నరేష్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకొన్నదంటే..

    ప్రేమ అంత ఈజీ కాదు కథ

    ప్రేమ అంత ఈజీ కాదు కథ

    సంగీతం, సినిమాపై ఆసక్తి ఉండే కార్తీక్ (రాజేష్ కుమార్) అనే యువకుడు, ప్రేమ (ప్రజ్వల్) అనే యువతి ఒకరినొకరిని ప్రేమించుకొంటారు. కానీ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకోరు. తన ఇంట్లో ఉండే ప్రేమకు తన లవ్ విషయాన్ని చెప్పలేక మదనపడుతుంటారు. ఓ దశలో తండ్రితో విభేదించి స్నేహితులకు దగ్గరవుతాడు. ఈ క్రమంలో తాను రూపొందించిన ఓ ఆల్బమ్‌ను ప్రేమకు చూపిస్తాడు. దాంతో అతడిని ప్రేమ దూరంగా పెడుతుంది.

    ప్రేమ అంత ఈజీ కాదు మలుపులు

    ప్రేమ అంత ఈజీ కాదు మలుపులు

    కార్తీక్ రూపొందించిన ఆల్బమ్‌లో ఏమున్నది? ఆ ఆల్బమ్‌ను చూసిన తర్వాత ప్రేమ అతడిని ఎందుకు దూరం పెట్టింది? చివరకు తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తీకరించుకొన్నారా? వారి ప్రేమ పెళ్లి పీటల వరకు చేరిందా? తండ్రితో విభేదించిన కార్తీక మళ్లీ దగ్గరయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ అంత ఈజీ కాదు.

    నటీనటుల ప్రతిభ

    నటీనటుల ప్రతిభ

    కార్తీక్ పాత్రలో రాజేష్ కుమార్ పాత్రలో ఒదిగిపోయారు. గత చిత్రాల్లో కంటే మంచి నటన కనబరిచారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకొనేలా ఉంటాయి. డ్యాన్స్, ఫైట్స్‌లో కూడా తన ప్రతిభను నిరూపించుకొన్నాడు. ప్రేమ పాత్రలో ప్రజ్వల్ మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు ప్రతికూల అంశాల్లో ప్రజ్వల్ ఎంపిక ఒకటి. జబర్దస్త్ బ్యాచ్ ధన్‌రాజ్, అవినాష్, ఆటో రాంప్రసాద్ తమ కామెడీతో అలరించారు.

     సాంకేతిక విభాగ పనితీరు

    సాంకేతిక విభాగ పనితీరు

    దర్శకుడు ఈశ్వర్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కాకపోతే కథ నడిపించే విధానంలో తడబాటుకు గురయ్యాడు. స్క్రిప్టుపై మరింత కసరత్తు చేయాల్సి ఉండేది. ఇక సినిమాకు మ్యూజిక్ ప్రాణం. పాటలు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. సినిమాటోగ్రఫి ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి. పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకం బ్యానర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మంచి కథ దొరికితే ఫీల్‌గుడ్ సినిమాలను రూపొందించే సత్తా వారి ప్రొడక్షన్‌కు ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    పాజిటివ్ పాయింట్స్:
    కథలో బేసిక్ పాయింట్
    మ్యూజిక్
    సెంటిమెంట్ సీన్లు

    మైనస్ పాయింట్స్
    హీరోయిన్
    సినిమాటోగ్రఫి

     తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు : రాజేష్ కుమార్ , ప్రజ్వల్ , శ్రీధర్
    సమర్పకులు: టీ అంజయ్య
    దర్శకుడు: ఈశ్వర్
    నిర్మాతలు: శ్రీధర్ , నరేష్ , అంజయ్య
    సంగీతం: జై యం

    బ్యానర్: పారిజాత మూవీ క్రియేషన్స్
    రిలీజ్: 2019-03-29

    English summary
    Prema Antha Easy Kadu is a love, romantic movie. Directed by Eshwar. Presented by T Anjaiah. Produced by T Naresh, T Sridhar. Rajesh Kumar and Prajwal are lead. This movie is released on March 29th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X