Prema Deshapu Yuvarani Review ట్రయాంగిల్ లవ్ స్టోరితో మర్డర్ మిస్టరీ.. ప్రేమదేశపు యువరాణి మెప్పించిందా?
నటీనటులు: మెహబూబ్ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్, పవన్ ముత్యాల, రాజారెడ్డి, సందీప్, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు తదితరులు
రచన, దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల
నిర్మాతలు: ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్
సినిమాటోగ్రఫి: శివకుమార్ దేవరకొండ
మ్యూజిక్: అజయ్ పట్నాయక్
ఎడిటర్: ఎంఆర్ వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను-కృష్ణ
సౌండ్ మిక్స్: జయంతన్ సురేష్
కొరియోగ్రఫీ: కపిల్, శ్రీవీర్
సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తం రాజు
ఫైట్స్: శివ్‌రాజ్
డిఐ: వెంకట్
బ్యానర్: సారథి స్టూడియోస్
రిలీజ్ డేట్: 2023-09-02
బీటెక్ ఫెయిలై ఎలాంటి బాధ్యత తెలియకుండా తిరిగే యువకుడు చెర్రీ (యామినీ రాజ్). శ్రావణి (ప్రియాంక రేవ్రీ)ని చూసి ప్రేమలో పడటమే కాకుండా తన ప్రేమదేశపు యువరాణి అని ఫిక్స్ అవుతాడు. ఆ క్రమంలో ఓ కారణంగా చెర్రీ, శ్రావణి దగ్గరవుతారు. పీకల్లోతూ ప్రేమలో మునిగిన చెర్రీ పెళ్లి ప్రస్తావన తెస్తే శ్రావణి రిజెక్ట్ చేస్తుంది. రవి (విరాట్ కార్తీక్) అనే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పి చెర్రీకి శ్రావణి షాకిస్తుంది.

శ్రావణితో పీకల్లోతు ప్రేమలో చెర్రీ ఉండటానికి కారణాలు ఏమిటి? బీటెక్ ఫెయిల్ అయిన చెర్రీకి ఎలాంటి హెల్ప్ చేస్తానని చెప్పింది. చెర్రీ, శ్రావణి మధ్య రొమాంటిక్ లైఫ్ ఎలా సాగింది? రవిని ప్రేమిస్తున్నానని శ్రావణి చెప్పడంతో చెర్రీ ఎలాంటి ఫీలింగ్‌కు గురయ్యాడు? రవి, శ్రావణి ప్రేమ కథ ఎలా సాగింది. శ్రావణితో చెర్రీ ప్రేమ కథకు ముగింపు ఏమిటి? చెర్రీ, రవిలో ఎవరిని శ్రావణి పెళ్లి చేసుకొన్నది? అమలాపురం, రావులపాలెం ప్రాంతాల్లో జరిగే హత్యలు, మానభంగాలు కారణం ఎవరు? అమలాపురంలో రౌడీ షీటర్ వీరయ్యకు శ్రావణి లవ్ స్టోరికి సంబంధం ఏమిటి? భద్రకాళి అవతారంలో హత్యలు చేసేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమదేశపు యువరాణి సినిమా కథ.
అమలాపురంలో హత్యలు, మానభంగాలు లాంటి అంశాల మధ్య శ్రావణి, చెర్రీ మధ్య లవ్ స్టోరి ఆసక్తికరంగా మొదలవుతుంది. దర్శకుడు సాయి సునీల్ కొత్తావాడైనప్పటికీ.. అనుభవం ఉన్న దర్శకుడిలా కథను డీల్ చేశాడు. కానీ అక్కడక్కడ అనుభవరాహిత్యంతో తడబాటు గురైనట్టు కనిపిస్తుంది. కానీ పాత్రలను రాసుకొన్న విధానం, లవ్ స్టోరీలో ట్విస్టులు పెట్టిన విధానం బాగుంది. ముక్కోణపు ప్రేమ కథను ఇంట్రెస్టింగ్ నడిపించేందుకు చేసిన ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. రౌడీ షీటర్ వీరయ్య, అతడి కుమారుడు భైరవ్ హత్యకు గురికావడమనే ట్విస్టు బాగుంది. భద్రకాళి రూపంలో వచ్చి హంతకులను చంపడం లాంటి అంశాలు కథకు బలంగా మారాయని చెప్పవచ్చు.

నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే. యామిన్ రాజ్ తన పాత్రలో ఒదిగిపోయాడు. పలు రకాల షేడ్స్ ఉన్న పాత్రను ఎలాంటి తడబాటు లేకుండా నటించి మెప్పించాడు. నటనపరంగా, డైలాగ్ డెలీవరిపరంగా చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొంటే మంచి యాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రావణి పాత్రలో ప్రియాంక చోప్రా రేవ్రీ మంచి ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. శ్రావణి పాత్ర లాంటి భారమైన కెరీర్ ఆరంభంలో రావడం హీరోయిన్లకు అరుదుగా వస్తుంది. అలాంటి పాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించిన తీరు ఆకట్టుకొనేలా ఉంది. అందం, అభినయంతోపాటు రొమాంటిక్ సీన్లలో హీరోతో కెమిస్ట్రీని బాగా పండించింది. రవిగా విరాట్ కార్తీక్ కూడా తన ప్రతిభతో ఆకట్టుకొన్నాడు. , విలన్ పాత్రలో సందీప్, భైరవ్‌గా పవన్, ఇతర పాత్రల్లో యోగి కద్రి, రఘు, ముత్యాల, రాజారెడ్డి, స్రవంతి, ప్రత్యూష, గోపీనాయుడు ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ సినిమా వరకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి బలంగా కనిపిస్తాయి. అజయ్ పట్నాయక్ మ్యూజిక్ బాగుంది. ఆర్పీ పట్నాయక్, సునీత పాడిన పాటలు బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఆర్పీ తన గాయకుడిగా మంచి ఫీల్‌ను కలిగించాడు. శివకుమార్ సినిమాటోగ్రఫి వర్క్ బాగుంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. ఏజీఈ క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. రాజీ లేకుండా రిచ్‌గా సినిమాను తెరకెక్కించిన తీరు చూస్తే సినిమా మేకింగ్‌పై వారికి ఉండే ఇష్టం కనిపిస్తుంది. కథ, కథనాల పరంగా ఇంకాస్త వర్క్ చేయాల్సి ఉందనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కొంచెం పేరున్న ఆర్టిస్టులు ఉంటే ఇంకా బెటర్ రీచ్ ఉండేదనిపిస్తుంది. యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.


Click it and Unblock the Notifications











