twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ జంట సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating: 2.75/5

    సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ప్రేమ‌జంట‌. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న ప్రేక్షకుల మందుకు వచ్చింది. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అయితే కాలేజీ ప్రేమ కథా చిత్రంగా తెలంగాణ యాస, భాషకు పెద్ద పీట వేస్తూ ఈ చిత్రం రూపొందింది. ఎలాంటి అంచనాల లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి బీ, సీ సెంటర్లలో మంచి రెస్సాన్ వస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి ఆదరణ దక్కడం వెనుక కారణాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    Prema Janta movie review and rating

    చందు (రామ్ ప్రణీత్), నందు (సుమయ) కాలేజీ విద్యార్థులు. మైనర్లయిన ఈ ఇద్దరు ప్రేమలో పడుతారు. పెద్దలు ప్రేమను వ్యతిరేకించడంతో చందు, నందు ఇద్దరు లేచిపోవాలని డిసైడ్ అవుతారు. పారిపోతున్న సమయంలో అల్లరి మూకల చేతిలో చందు మానభంగ ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో నందు, చందు పోలీసులకు సేఫ్‌గా చిక్కడంతో మళ్లీ ఇంటికి చేరుతారు. చందు ప్రేమను నిరాకరించిన తండ్రి ఆమెకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో పెళ్లి పీటల మీద నుంచి పరారై హైదరాబాద్‌కు చేరుకొంటారు. చందును బురిడీ కొట్టించి నందును వేశ్యవాటికలకు ఓ వ్యక్తి (షఫీ) అమ్మేస్తాడు.

    Prema Janta movie review and rating

    వ్యభిచార కూపం నుంచి నందు ఎలా బయటపడింది? హైదరాబాద్‌కు చేరిన ఈ ప్రేమ జంట ఎలాంటి కష్టాలను అనుభవించింది? చందు, నందు ప్రేమ కథకు ఎలాంటి ముగింపు లభించిందిఝ తన ప్రేమను గెలిపించుకొన్నారా? త్యాగం చేశారా? అనే ప్రశ్నలకు సమాధానమే ప్రేమ జంట కథ.

    ప్రేమ జంట చిత్రంకు ప్రధానమైన ఆకర్షణ తెలంగాణ యాస, భాష. ఆదిలాబాద్‌లో జరిగే ఈ కథ ప్రయాణం సాగించి హైదరాబాద్‌కు చేరే క్రమంలో ఆసక్తికరమైన సంఘటనలు, ట్విస్టులు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. చాలా చిన్న బడ్జెట్ అయినప్పటికీ.. పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించడమే ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అలాగే ముక్కు ముఖం తెలియని బాల తారలే సినిమాను పరుగుల పెట్టించడంతోనే విజయం సాధించిందనే మాటను పక్కాగా చెప్పవచ్చు.

    Prema Janta movie review and rating

    రెండో భాగంలో రాజా రవీంద్ర, ఉత్తేజ్, షఫీ, సూర్య ఇలాంటి పాత్రలు ఉన్న బాల నటీనటుల రోల్స్‌కు సపోర్ట్‌గానే కనిపించేలా రాసుకొన్న స్క్రిప్టు ఈ సినిమా దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. దర్శకుడు నిఖిలేష్ ఎక్కడా సినిమాను తెరకెక్కించే విషయంలో తడబాటు కనిపించదు. నటనలో అనుభవం లేని యాక్టర్లతో సినిమాను తెరకెక్కించిన తీరు ప్రశంసనీయం. ఆదిలాబాద్ లోకల్ నేటివిటిని తెరకెక్కించిన తీరు అభినందనీయం. బడ్జెట్ ఉండి, మంచి నటీనటులు ఉంటే ప్రేమ జంట గ్యారెంటీగా ఓ సైరత్, ప్రేమిస్తే సినిమాలను గుర్తు చేసేదని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. హీరో, హీరోయిన్లు ప్రతిభావంతులైనప్పటికి.. పబ్లిక్‌ను ఎట్రాక్ట్ చేయడంలో కొంత విఫలమయ్యారని చెప్పవచ్చు.

    ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సుమయ నటన గురించి. ఏ మాత్రం సినిమా అనుభవం లేకపోయినా తన స్క్రీన్ ప్రజెన్స్, హావభావాలు, కీలక సన్నివేశాల్లో ఆమె చూపించిన భావోద్వేగం సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే రామ్ ప్రణీత్ కూడా మంచి నటనను కనబరిచారు. మిగితా క్యారెక్టర్లో కనిపించిన వాళ్లు కూడా ఆకట్టుకొన్నారు.

    టెక్కికల్ విషయాలకు వస్తే.. నిఖిలేష్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. పాటలు తెర మీద చక్కగా కుదిరాయి. రీరికార్డింగ్ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. సురేష్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. కొన్ని షాట్స్ థ్రిల్ చేస్తాయి. మహేష్ మొగులూరి పాటించిన నిర్మాణ విలువలు పెద్ద సినిమాకు తీసిపోని విధంగా ఉన్నాయి.

    ఫైనల్‌గా.. ఇటీవల లోకల్, నేటివిటి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ స్పష్టంగా కనిపిస్తున్నది. భావోద్వేగమైన అంశాలు, సాంకేతిక విలువలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే నిరాశపరుచదు. లోకల్ టాలెంట్‌తో ఓ మంచి ఫీల్ గుడ్ సినిమాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే పక్కగా పైసా వసూల్ అని గ్యారెంటీగా చెప్పవచ్చు. ఇలాంటి సినిమా సక్సెస్ సాధిస్తే నేటివిటితో కూడిన చిత్రాలకు మంచి ఊపు లభిస్తుంది. సైరత్ ఛాయలున్న ఓ చిత్రంగా అనిపిస్తుంది.

    English summary
    Sun Food Entertainments production house came up with a new movie titled as Prema Janta. Screen Max Pitures banner is also a part of the production. The film has newly actors Ram Praneeth and Sumaya in the leads. Nikhilesh Togari is the director who made his debut with the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X