twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    రేటింగ్: 2.75/5

    వెండితెరపై ప్రేమ కథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రతీ సినిమాలోనూ అంతర్లీనంగా ప్రేమ కథ ఉంటూనే వస్తుంది. అయితే అలాంటి ప్రేమకథ చుట్టూనే తిరిగే సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనాలు ఉంటాయి. మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది ప్రేమ పిపాసి. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

    కథ

    కథ

    బావ (జీపీఎస్) కనిపించిన ప్రతీ అమ్మాయిని ట్రాప్‌లో పడేస్తాడు. ప్రేమ అంటూ అసలు పని కానిచ్చేస్తాడు. అవతల ఉన్న అమ్మాయిలు కూడా బావను తెగ వాడేస్తూ ఉంటారు. అయితే ఇలా జరుగుతూ ఉండగా.. బాలా (కపిలాక్షి మల్హోత్ర)ను చూసి ప్రేమించడం మొదలు పెడతాడు.

    కథలో ట్విస్ట్‌లు..

    కథలో ట్విస్ట్‌లు..

    అప్పటి వరకు కనిపించిన అమ్మాయిను ప్రేమ అంటూ ట్రాప్ చేసి అసలు విషయం జరిగాక వదిలేసే బావ.. బాలాను ఎందుకు ప్రేమిస్తాడు? బాలా ఎంతగా చీ కొట్టినా తన వెంటే ఎందుకు పడతాడు? బావ-బాలాకు ఉన్న గతం ఏంటి? అమ్మాయిలను బావ ఎందుకు ట్రాప్ చేస్తుంటాడు? ఈ కథలో సుమన్ పాత్ర ఏంటి? చివరకు ఏమైంది? లాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్రేమ పిపాసి.

    ఫస్టాప్ అనాలిసిస్..

    ఫస్టాప్ అనాలిసిస్..


    ప్రేమలో ఓడిపోయిన బావ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దమయ్యే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్‌ను ఓపెన్ చేయడంతో అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తించాడు. ఇక మెల్లిగా గతంలోకి తీసుకెళ్లడంతో ప్రథమార్థంలో ఊపు పెరిగినట్టుగా అనిపిస్తుంది. బావ రాసలీలలు, అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇవే సీన్స్ తిప్పి తిప్పి చూపించిన ఫీలింగ్ కలుగుతంది. శ్రుతీ, కోమలి, కీర్తి అంటూ ఒకరి తరువాత ఒకర్ని ట్రాప్ చేసే సీన్స్‌తోనే ప్రథమార్థం మొత్తం నిండినట్టు అనిపిస్తుంది. సుమన్, బాలా (సోనాక్షి) ఎంట్రీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అయితే యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ప్రథమార్థం పర్వాలేదనిపిస్తుంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    తన కూతురుని ట్రాప్ చేస్తున్నాడని తెలిసిన సుమన్.. బావను చితక్కొట్టించడం, ఆ సమయంలో బాలాను కనబడటంతో కథలో మలుపు తిరిగిన ఫీలింగ్ వస్తుంది. అయితే ప్రథమార్థంలో ఏదో కొత్తగా ఉంటుందని ఎదురు చూసే ప్రేక్షకుడి మాత్రం నిరాశే కలుగుతుంది. బాలా ఇంటి ముందే ధర్నాకు దిగడం, అక్కడే కథంతా గిరగిర తిరినట్టు అనిపిస్తుంది.అయితే ఈ సమయంలో వచ్చే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే కామెడీ ఆకట్టుకుంది. ఎంటర్టైన్మెంట్‌ మిస్ కాకుండా చూసుకోవడంతో ఆ సీన్స్ అన్నీ చకచకా వెళ్లిపోతాయి. బాలా-బావకు ఉన్న గతం, ఫ్లాష్ బ్యాక్‌లో బావ స్నేహితుడు కార్తీక్‌ను ప్రీతి మోసం చేస్తుంది. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవడంతో అమ్మాయిలను ట్రాప్ చేసే వాడిగా బావ మారిపోతాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో అంత ఆసక్తికరమైన అంశాలు లేకపోవడం కాస్త మైనస్‌గా మారే అవకాశం ఉంది. టోటల్‌గా ద్వితీయార్థం ప్రేక్షకులను మెప్పించిందే చెప్పవచ్చు.

    నటీనటుల పర్ఫామెన్స్..

    నటీనటుల పర్ఫామెన్స్..

    ప్రేమ పిపాసిలో జీపీఎస్ పాత్రనే హైలెట్ అయ్యే అవకాశం ఉంది. మొదటి చిత్రమే అయినా డ్యాన్సుల్లో, ఫైట్స్‌లో పర్వాలేదనిపించాడు. అయితే ఎమోషన్స్ సీన్స్‌లో కాస్త తడబడినట్టు కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో తరువాత చెప్పుకోవాల్సింది సోనాక్షి గురించే. ద్వితీయార్థం మొత్తం ఈమె చుట్టే తిరగడంతో నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు అవకాశం దొరికింది. సీనియర్ నటుడైన సుమన్ ఆయన చేసిన పాత్రకు ఏ మాత్రం సూట్ కాలేదు. ఆయన గెటప్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ ఆకట్టుకునేలా లేదు. ఇక సినిమా మొత్తం హీరో పక్కనే ఉండే స్నేహితుడు రవి (ఫన్ బకెట్ భార్గవ్) కామెడీతో మెప్పించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో కనిపించే హీరో స్నేహితుడు కార్తీక్, అలాగే మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.

    Recommended Video

    Prema Pipasi Movie New Trailer | Filmibeat Telugu
    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    ప్రేమ పిపాసి సినిమాకు తీసుకున్న లైన్ యూత్‌ను ఆకట్టుకునేది కావడం ప్లస్ పాయింట్. ఈ కాలంలో ప్రేమ ఎలా ఉంది? అమ్మాయిలు-అబ్బాయిలు ఎందుకు ప్రేమించుకుంటున్నారు? దేని కోసం ప్రేమించుకుంటున్నారు? అనే అంశాలతో అల్లుకున్న కథ కావడంతో బాగానే అనిపిస్తుంది. అయితే తెరకెక్కించిన విధానంలోనూ కాస్త తడబడినట్టు కనిపిస్తుంది. సినిమాలోని సీన్స్ పదే పదే రిపీట్ అయినట్టు, కథ ముందుకు సాగినట్టు అనిపించకపోవడమే మైనస్. అక్కడక్కడా డైలాగ్స్ బాగానే పేలాయి. మొత్తంగా యూత్‌ను టార్గెట్ చేసిన దర్శకుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు..

    ప్రేమ పిపాసిలో అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించే. మంచి మాస్ బీట్స్‌తో అందర్నీ మెప్పించినట్టు అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ విషయంలో మరికొంత శ్రద్ద తీసుకుంటే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫర్ తన కెమెరాతో హీరో, హీరోయిన్లను అందంగా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..


    ప్రేమ పిపాసి అనే సినిమా చూస్తున్నంత సేపు.. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ కాదేమోనన్న అనుమానం ప్రేక్షకులకు కలగవచ్చు. అయితే బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది. మరి కమర్షియల్‌గా ఏ మాత్రం విజయం సాధిస్తుందో వేచి చూడాలి

    బలాలు, బలహీనతలు..

    బలాలు, బలహీనతలు..

    ప్లస్ పాయింట్స్
    నటీనటులు
    యూత్‌ను ఆకట్టుకునే సీన్స్

    మైనస్ పాయింట్స్
    ఆసక్తికరంగా సాగని కథనం
    క్లైమాక్స్

    నటీనటులు

    నటీనటులు

    నటీనటులు : కపిలాక్షి మల్హోత్ర, సోనాక్షి, సుమన్ తదితరులు
    దర్శకత్వం : మురళీ రామస్వామి
    నిర్మాత : పీఎస్ రామకృష్ణ
    బ్యానర్ : ఎస్‌ఎస్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్, రాహుల్ భాయ్ మీడియా, దుర్గ శ్రీ ఫిల్మ్
    మ్యూజిక్ : ఆర్ఎస్
    సినిమాటోగ్రఫి : తిరుమల్ రోడ్రిగుజ్
    ఎడిటింగ్ : ఎస్‌జే శివ కిరణ్

    English summary
    Prema Pipasi is an Telugu language Love And Entertainment Drama written and directed by Murali Ramaswamy. The film stars GPS, Suman, Kapilakshi Malhothra, Sonakshi, Funbucket Bhargav. This movie released on March 13th 2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X